• Skip to Content
  • Sitemap
  • Advance Search
Economy

తెలంగాణ పురోగతికి తోడ్పాటు: పరిశ్రమలు, చేతివృత్తులను శక్తిమంతం చేసిన జీఎస్టీ

प्रविष्टि तिथि: 14 OCT 2025 16:31 PM

ముఖ్య విషయాలు

·   తెలంగాణ తన వ్యవసాయ ఉత్పత్తిలో 25 శాతం ఉత్పత్తులను 4,000లకు పైగా కర్మాగారాలు, 80,000 అనధికారిక యూనిట్ల ద్వారా శుద్ధి చేస్తోంది. 2023–24 కాలంలో వ్యవసాయ-ఎగుమతి విలువలో శుద్ధి చేసిన ఆహార ఉత్పాదకాల వాటా 50 శాతంగా ఉందిజీఎస్టీ తగ్గింపుతో ధరలు 6-7 శాతం తగ్గుతాయి.

·   రాష్ట్రం 800లకు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలకు ఆతిథ్యం ఇస్తోంది.. 2014 నుంచి 4.5 లక్షల ఉద్యోగాలను కల్పించింది.. భారత బల్క్ డ్రగ్ ఎగుమతుల్లో 50 శాతం వాటాను ఇది కలిగి ఉందిజీఎస్టీ తగ్గింపుతో ఔషధాల ధరలు 6-7 శాతం తగ్గుతాయి.

·   2024–25 కాలంలో విమానాలుఅంతరిక్ష నౌకలుసంబంధిత భాగాల ఎగుమతులు తెలంగాణ మొత్తం ఎగుమతుల్లో దాదాపు 31 శాతం వాటా కలిగి ఉన్నాయిజీఎస్టీఐజీఎస్టీ తగ్గింపుతో ఎగుమతి సామర్థ్యం మరింత బలపడుతుంది.

·   2023-24 కాలంలో తెలంగాణ ఎగుమతి చేసిన ఆటో విడిభాగాల విలువ రూ. 177 కోట్లుకార్ల విలువ రూ. 79 కోట్లుగా ఉందిజీఎస్టీ తగ్గింపుతో ఎగుమతి సామర్థ్యం పెరగడంతో పాటు.. ఉత్పత్తి వ్యయాలూ తగ్గుతాయి.

·   జీఐ-ట్యాగ్ పొందిన హస్తకళలుబొమ్మలపై జీఎస్టీ తగ్గింపుతో వాటి ధరలు శాతం తగ్గుతాయి.. ఇది అమ్మకాలతో పాటు చేతివృత్తులవారి ఆదాయాన్నీ పెంచుతుంది.. ప్రపంచ మార్కెట్ పరిధినీ విస్తరిస్తుంది.

 

పరిచయం

2014 జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ.. దేశంలో కొత్తఅతి చిన్న రాష్ట్రంగా అవతరించిందిఎత్తయిన దక్కన్ పీఠభూమి ప్రాంతంతో వ్యూహాత్మక ప్రాంతంగా.. తరచుగా "ఉత్తరానికి దక్షిణం.. దక్షిణానికి ఉత్తరంగా వర్ణించే తెలంగాణ చాలా కాలంగా అనేక భాషలుసంస్కృతులుసంప్రదాయాల కూడలిగా ఉందిఇది వంటకాలుకళలుచేనేత వస్త్రాలుహస్తకళలకు ప్రసిద్ధి చెందిందిఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం కీలకమైన ఆహార శుద్ధి పరిశ్రమనుజాతీయస్థాయి ప్రాధాన్యం గల ఔషధ కేంద్రాన్ని కలిగి ఉందిరాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ ఏరోస్పేస్రక్షణ రంగ తయారీకి ప్రముఖ కేంద్రంగా ఉంది.

ముఖ్యంగా ఇటీవలి జీఎస్టీ సంస్కరణలు తెలంగాణ వృద్ధి వేగాన్ని మరింత బలోపేతం చేశాయిముఖ్యమైన వస్తువులుసేవలపై పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా ఈ సంస్కరణలు డిమాండ్‌ను పెంచడంతో పాటు సామర్థ్యాన్నీ పెంపొందిస్తూ.. ఉపాధికి కొత్త మార్గాలను అందుబాటులోకి తెస్తున్నాయిఆహార శుద్ధిఔషధాల నుంచి.. తయారీఎగుమతుల వరకు రాష్ట్రంలోని కీలక రంగాలకు జీఎస్టీ సంస్కరణలు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తూ... తెలంగాణ సమగ్రసుస్థిర అభివృద్ధి దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయి.

ఆహార శుద్ధి పరిశ్రమ

ఎక్కువగా ఎమ్ఎస్ఎమ్ఈలపై ఆధారపడే తెలంగాణ ఆహార శుద్ధి రంగం... స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడంలోఉద్యోగాలను సృష్టించడంలోగ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోందిఈ పరిశ్రమ రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తిలో 25 శాతం ఉత్పత్తులను శుద్ధి చేస్తుంది.. తద్వారా వ్యవసాయ క్షేత్రాలుమార్కెట్ల మధ్య కీలక వారధిగా ఈ రంగం పనిచేస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రధాన క్లస్టర్లతో ఈ రంగం భౌగోళిక వైవిధ్యం కలిగి ఉందిహైదరాబాద్మెదక్మేడ్చల్మల్కాజ్‌గిరివరంగల్ అర్బన్‌ ప్రాంతాలు తినుబండారాలు.. నిజామాబాద్‌ సుగంధ ద్రవ్యాలువ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి.. ఖమ్మం అరటిసుగంధ ద్రవ్యాల ఆధారిత యూనిట్లకు ప్రసిద్ధి చెందాయితెలంగాణ 4,000 కర్మాగారాలు, 80,000 లకు పైగా అనధికారిక వ్యాపార సంస్థలకు నిలయంగా దేశంలోని మొత్తం ఆహార శుద్ధి యూనిట్లలో 10 శాతం వాటాను కలిగి ఉంది. దీని మార్కెట్ పరిధి దేశీయ తినుబండారాల మార్కెట్రిటైలర్లుడీ2సీ బ్రాండ్లుఎయిర్‌లైన్స్సూపర్ మార్కెట్‌లకూ విస్తరించి ఉందిఎగుమతి విషయంలో శుద్ధి చేసిన ఆహారాలు 2023-24 కాలంలో రాష్ట్ర వ్యవసాయఅనుబంధ ఎగుమతుల్లో (విలువ ప్రకారం) 50 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నాయిఇవి యూఎస్ఏజర్మనీఫ్రాన్స్స్పెయిన్రష్యా వంటి దేశాలకు ఎగుమతి అయ్యాయి.

ఇటీవలి జీఎస్టీ సంస్కరణల ద్వారా బనగానపల్లె మామిడిపండ్లుతాండూర్ కందులు వంటి జీఐ-ట్యాగ్ పొందిన ఉత్పత్తులు సహా కీలక ఉత్పత్తి కేటగిరీలపై పన్నుల తగ్గింపుతో ఈ రంగం సామర్థ్యం మరింత మెరుగైంది.

జీఎస్టీ తగ్గించిన ఇతర వస్తువుల్లో.. పనీర్చెనా (ప్యాక్ చేసినవి), యూహెచ్‌టీ పాలుభారతీయ బ్రెడ్లు (ప్యాక్ చేసినవి), వెన్ననెయ్యిజున్నుడ్రై ఫ్రూట్స్నమ్కీన్పాస్తాపండ్లు-కూరగాయల రసాలుకర్రీ పేస్ట్‌లుప్రిజర్వ్ చేసిన పండ్లుజామ్‌లుజెల్లీలుఐస్ క్రీంసూప్‌లుకార్న్‌ఫ్లేక్స్తృణధాన్యాల ఫ్లేక్స్చాక్లెట్లుపేస్ట్రీలుకేకులూ ఉన్నాయి.

A blue and white poster with text and images of foodAI-generated content may be incorrect.

 

ఈ రేటు తగ్గింపుతో షెల్ఫ్ ధరలు 6–7 శాతం తగ్గుతాయి. పీక్ సీజన్లలో ఫ్రూట్స్ టు ఫ్యాక్టరీకి సేకరణను పెంచుతాయి.. గ్రామీణసెమీ-అర్బన్ మార్కెట్లలో శుద్ధి చేసిన ఆహారాలను మరింత సరసమైనవిగా చేస్తాయిఈ సంస్కరణలు వినియోగదారుల్లో డిమాండ్‌ను పెంచడంతో పాటు రైతులుతయారీదారులుఎఫ్ఎమ్‌సీజీ వ్యాపారస్తులుఎమ్ఎస్ఎమ్ఈ ఆహార యూనిట్లకు ఒకే విధమైన ప్రయోజనం చేకూరుస్తాయివ్యవసాయ ఆధారిత పరిశ్రమల కేంద్రంగా తెలంగాణ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

లైఫ్ సైన్సెస్ – ఫార్మా రంగం

 

A diagram of different types of drugsAI-generated content may be incorrect.

 

దేశంలోని ప్రముఖ ఔషధ తయారీ కేంద్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందిఈ రంగం రాష్ట్ర సరుకుల ఎగుమతుల్లో అత్యధిక వాటాను కలిగి ఉందిఈ వృద్ధికి ఆధారంగా ఉన్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ "భారత లైఫ్ సైన్సెస్ రాజధాని"గా పేరుగాంచింది800 లకు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు అభివృద్ధి చెందుతున్న వ్యవస్థ రాష్ట్రంలో ఉంది.. 2014 నుంచి సమష్టిగా 4.5 లక్షలకు పైగా ఉద్యోగాలను ఇది సృష్టించింది.

తెలంగాణ ఫార్మాస్యూటికల్ నెట్‌వర్క్ దేశవ్యాప్త ఆసుపత్రులుక్లినిక్‌లురిటైల్ మార్కెట్లకూ సేవలు అందిస్తుందిడాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్అరబిందో ఫార్మాజీఎస్‌కేనోవార్టిస్శాంత వంటి ప్రధాన ప్రపంచస్థాయిదేశీయ సంస్థలకు నిలయంగా ఉందిభారత బల్క్ డ్రగ్ ఎగుమతుల్లో తెలంగాణ దాదాపు 50 శాతం వాటాను కలిగి ఉండడంతో పాటు.. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో మూడింట ఒక వంతు వాటాను కలిగి ఉంది.. మొత్తం ఫార్మా ఎగుమతుల్లో అయిదో వంతు వాటానూ ఇది కలిగి ఉంది. భారత ఆరోగ్య సంరక్షణ తయారీ వాణిజ్య కార్యకలాపాల్లో ఈ రంగం కీలక పాత్రను ఇది స్పష్టం చేస్తుంది.

ఇటీవలి జీఎస్టీ సంస్కరణలు ఈ రంగం సామర్థ్యాన్నియాక్సెసిబిలిటీనీ మరింత బలోపేతం చేశాయి.. 30 క్యాన్సర్ మందులపై జీఎస్టీని 12 శాతం నుంచి సున్నాకి తగ్గించారుఅదనంగా వ్యక్తిగత ఉపయోగం కోసం గల అన్ని మందులుఔషధాలపై జీఎస్టీని 12 శాతం నుంచి శాతానికి తగ్గించారుఈ తగ్గింపులు వినియోగదారుల వ్యయాన్ని 6-7 శాతం తగ్గిస్తాయి... ఇది ఆరోగ్య సంరక్షణను మరింత సరసమైనదిగా మార్చడంతో పాటు మరింత అందుబాటులో ఉండేలా చేస్తుందితెలంగాణ ఫార్మాస్యూటికల్లైఫ్ సైన్సెస్ పరిశ్రమ వృద్ధినీఆవిష్కరణలనూ పెంపొదిస్తుంది.

ఏరోస్పేస్ – రక్షణ రంగం

 

A poster with images of military vehiclesAI-generated content may be incorrect.

25కి పైగా పెద్ద కంపెనీలు, 1,000కి పైగా ఎమ్ఎస్ఎమ్ఈలతో హైదరాబాద్ ఒక ప్రముఖ ఏరోస్పేస్రక్షణ రంగ తయారీ కేంద్రంగా ఉందిఈ నగరం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (డీఆర్‌డీఎల్), రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (ఎమ్‌డీఎన్), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీడిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ (డీఎమ్ఆర్ఎల్వంటి ప్రముఖ పరిశోధనరక్షణ సంస్థలకు నిలయంగా ఉందిఇది డజనుకు పైగా ప్రధాన డీఆర్‌డీవో ల్యాబ్‌లురక్షణ పీఎస్‌యూల మద్దతుతో బలమైన వ్యవస్థను ఏర్పరుస్తోంది.

ఈ నగర పారిశ్రామిక వ్యవస్థ కీలక మార్కెట్లకూ సేవలందిస్తోందిమార్స్ ఆర్బిటర్ మిషన్ కోసం 30 శాతం భాగాలను సేకరించే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), భారత సైన్యంపారామిలిటరీ దళాలుడీఆర్‌డీవోవ్యవస్థ-స్థాయి ప్రొవైడర్లు వీటిలో భాగంగా ఉన్నాయిఈ బలాన్ని ప్రతిబింబిస్తూ.. భారత సైనిక హార్డ్‌వేర్ ఎగుమతులు యూఎస్ఫ్రాన్స్అర్మేనియాలతో పాటు 100కు పైగా దేశాలకు విస్తరించాయిగత 2-3 సంవత్సరాల్లో ఈ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.

2024–25 కాలంలో విమానాలుఅంతరిక్ష నౌకలుసంబంధిత భాగాల ఎగుమతులు తెలంగాణ మొత్తం ఎగుమతుల్లో దాదాపు 31 శాతం వాటాను కలిగి ఉన్నాయి. గణనీయంగా పెరిగిన రక్షణ రంగపీఎస్‌యూ ఆర్డర్‌లతో పాటు వ్యవసాయంమైనింగ్మౌలిక సదుపాయాల రంగాల్లో డ్రోన్‌లకూ దేశీయంగా డిమాండ్ పెరుగుతోంది.

ఇటీవలి జీఎస్టీ సంస్కరణలు ఈ రంగం సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేశాయిమానవరహిత విమానాలు (28 నుంచి 18 శాతం వరకు గలవి ప్రస్తుతం శాతానికి), టూ-వే రేడియోట్యాంకులుఇతర సాయుధ పోరాట వాహనాలుభాగాలు (12 శాతం నుంచి శాతానికి), టార్గెట్ మోషన్ సిమ్యులేటర్భాగాలుహెచ్ఏసీఎఫ్ఎస్ సబ్-అసెంబ్లీలుఎమ్ఆర్ఎస్ఏఎమ్ వ్యవస్థ భాగాలుఐఏడీడబ్ల్యూఎస్ భాగాలుసైనిక రవాణా విమానాలు మొదలైన వాటి జీఎస్టీ రేట్లు (ఐజీఎస్టీ 18 శాతం నుంచి సున్నాకుతగ్గించారు.

ఈ పన్ను తగ్గింపు తయారీ ఖర్చులను తగ్గిస్తుంది.. ఎగుమతి సామర్థ్యాన్నిపరిశోధనాభివృద్ధి సామర్థ్యాన్నీ పెంచుతుంది.. ఏరోస్పేస్రక్షణ రంగ వాణిజ్య కార్యకలాపాల్లో సమర్థమైన దేశీయ సేకరణకుబడ్జెట్ వినియోగానికి మద్దతునిస్తుంది.

వాహనవాహన విడి భాగాల పరిశ్రమ

 

A poster with text overlayAI-generated content may be incorrect.

తెలంగాణలోని హైదరాబాద్రంగారెడ్డి జిల్లాల్లో వాహనవాహన విడి భాగాల పరిశ్రమ ఉందిమహీంద్రా గ్రూప్హ్యుందాయ్ఎంఆర్‌ఎఫ్ వంటి కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయిఓఈఎంవాహన విడి భాగాలు (ఆఫ్టర్ మార్కెట్), పంపులు లేదా ఎలక్ట్రిక్ మోటార్లతో సహా విస్తృత విభాగాల అవసరాలను ఈ రంగం తీరుస్తోంది

2023–24లో తెలంగాణ రూ. 177 కోట్ల విలువైన వాహన విడిభాగాలనురూ. 79 కోట్ల విలువైన కార్లను ఎగుమతి చేసిందితయారీవాణిజ్యం రెండింటిలోనూ స్థిరమైన వృద్ధిని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి

వాహన విడిభాగాలుత్రిచక్ర వాహనాలుచిన్న కార్లుమోటార్ సైకిళ్లపై (350cc కంటే ఎక్కువఇటీవల జీఎస్టీ తగ్గటంతో వీటికి సంబంధించిన వ్యవస్థ మరింత బలోపేతం అవుతోందిజీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల ఓఈఎంల ఉత్పత్తి ఖర్చులు తగ్గటంధరలపరంగా పోటీతత్వం పెరగటంవిడి భాగాలతో పాటు ఇతర ఖర్చులు తగ్గటం ద్వారా వాణిజ్య కార్యకలాపాల్లో భాగస్వాములందరికీ ప్రయోజనం చేకూరుతోంది

బొమ్మలుహస్తకళలు

భారతదేశానికి చేతితో చేసిన బొమ్మల విషయంలో ఘనమైన సాంస్కృతిక వారసత్వం ఉందిఇది దేశానికి ఉన్న కళాత్మక వారసత్వంహస్తకళ నైపుణ్యాలను తెలియజేస్తోందిదేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందుతుండటంతో బొమ్మలకు సంబంధించిన రిటైల్ పరిశ్రమ పలు సంవత్సరాలుగా గణనీయమైన వృద్ధిని సాధించిందితెలంగాణ విషయానికి వస్తే నిర్మల్ బొమ్మలుహస్తకళలలకు రాష్ట్రం ప్రసిద్ధి చెందిందిదీనితో పాటు తరతరాల నుంచి వస్తోన్న విభిన్న హస్తకళలుసంప్రదాయాలకు కూడా తెలంగాణ పేరు పొందిందిపెంబర్తి ఇత్తడి పాత్రలు లోహాలతో చేసే సంక్లిష్టమైన కళకు పేరెన్నికగన్నదిఅదిలాబాద్‌ డోక్రా లోహ హస్తకళలు… పురాతన లాస్ట్-వాక్స్ కాస్టింగ్ పద్ధతిని ఉపయోగించే ఈ ప్రాంత గిరిజన కళను తెలియజేస్తున్నాయివరంగల్ జిల్లాలో తయారయ్యే తివాచీలు భిన్నమైన రంగులువివరణాత్మక నమూనాలుమన్నికకు ప్రసిద్ధి చెందాయి

 

A chart of various itemsAI-generated content may be incorrect.

నిర్మల్ బొమ్మలుహస్తకళలు

చెక్కలోహంవస్త్రాలతో చేతుల మీదుగా తయారయ్యే నిర్మల్ బొమ్మలుహస్త కళలకు 2009లో భౌగోళిక గుర్తింపు (జీఐకూడా లభించిందిఅదిలాబాద్‌లోని నకాషి సామాజిక వర్గానికి చెందిన వారు ప్రధానంగా ఈ పురాతన హస్తకళల్లో ఉన్నారువీటి తయారీ కోసం పోనికి కలపచింతపండు గింజల ద్వారా తయారు చేసిన సహజమైన బంకను ఉపయోగిస్తారువీటి తయారీ కళాకారుల సంప్రదాయ పద్ధతులను తెలియజేస్తోంది

ఈ పరిశ్రమ దాదాపు 50–60 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోందిహస్తకళ ప్రదర్శనలురాష్ట్ర స్థాయి ఎంపోరియాలువాణిజ్య ఉత్సవాలుఆన్‌లైన్ మార్కెట్ల ద్వారా వీటి అమ్మకాలు జరుగుతున్నాయి. 2023–24లో భారతదేశం 150 దేశాలకు 152.34 మిలియన్ డాలర్ల విలువైన బొమ్మలను ఎగుమతి చేసిందిప్రత్యేకంగా రూపొందించిన ఈ హస్తకళలకు ఉన్న దేశీయఅంతర్జాతీయ డిమాండ్ స్థాయిని ఇది తెలియజేస్తోంది

ఇటీవలి జీఎస్టీ రేటును 12 శాతం నుంచి శాతానికి తగ్గించటం వల్ల చిల్లర ధరలు ఆరు శాతం తగ్గాయన్న అంచనా ఉందిఇది దేశీయఅంతర్జాతీయ మార్కెట్లలో నిర్మల్ బొమ్మల పోటీతత్వాన్ని మరింత పెంచటంతో పాటు దేశీయ సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహిస్తూ కళాకారుల జీవనోపాధికి మద్దతునిస్తోంది

లోహలతో చేసే పెంబర్తి హస్తకళలు

సంప్రదాయ పెంబర్తి హస్తకళలను లోహలను ఉపయోగించి తయారుచేస్తారుతెలంగాణలోని జనగాం జిల్లా వీటికి ప్రసిద్ధి చెందిందిదీనికి 2010లో జీఐ గుర్తింపు లభించిందిఈ హస్తకళలో విశ్వకర్మ సమాజానికి చెందిన కళాకారులు ఎక్కువగా ఉన్నారుప్రస్తుతం దాదాపు 100 కుటుంబాలు మాత్రమే ఈ సంప్రదాయాన్ని కాపాడుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి.

దక్షిణ భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాల అలంకరణలో ఈ కళను ఉపయోగించారుపాండన్లునాగర్‌డాన్లుఇటార్డాన్లుపాత్రలులాంప్‌షేడ్‌లుమొక్కల కుండీలు వంటి సాంస్కృతికఅలంకారగృహోపకరణ వస్తువులలో కూడా ఈ కళను ఉపయోగిస్తున్నారుహస్తకళ ప్రదర్శనలురాష్ట్ర స్థాయి ఎంపోరియాలుఉత్సవాల ద్వారా ఈ ఉత్పత్తులు విక్రయమవుతున్నాయిఇది సంప్రదాయ కళసమకాలీన ఆకర్షణల మిశ్రమాన్ని తెలియజేస్తోంది

జీఎస్టీని 12 శాతం నుంచి శాతానికి తగ్గించటం వల్ల రిటైల్ ధరలు శాతం తగ్గాయన్న అంచనా ఉందితద్వారా అమ్మకాలు వృద్ధి చెంది చేతివృత్తులవారి ఆదాయాలు పెరుగుతాయివీటితో పాటు ఈ సంస్కరణ.. దేశీయ మార్కెట్లలో ఈ సాంస్కృతిక హస్తకళలను నిలబెట్టుకునేందుకుప్రోత్సహించడానికి సహాయపడతాయి.

అదిలాబాదా డోక్రా

తెలంగాణలోని వోజ్ సామాజిక వర్గానికి చెందిన గిరిజన కళాకారులు తయారు చేసే సంప్రదాయ బెల్ మెటల్ హస్తకళల తయారీకి పురాతనమైన లాస్ట్-వాక్స్ కాస్టింగ్ పద్ధతిని ఉపయోగిస్తారుదీనికి 2018లో జీఐ గుర్తింపు లభించిందిఈ హస్తకళల వ్యాపారాన్ని దాదాపు 100 కుటుంబాలు కొనసాగిస్తున్నాయి.

స్థానిక మార్కెట్లుఉత్సవాలురాష్ట్ర హస్తకళల ఎంపోరియాలతో పాటు వర్థమాన ఆన్‌లైన్ వేదికల ద్వారా డోక్రా ఉత్పత్తులు విక్రయిస్తున్నారుఇది సాంస్కృతిక వారసత్వంపెరుగుతోన్న వాణిజ్య ఆకర్షణ రెండింటినీ తెలియజేస్తోంది

ఇటీవల జీఎస్టీని 12 శాతం నుంచి శాతానికి తగ్గించారుదీనివల్ల చిల్లర ధరలు ఆరు శాతం తగ్గాయన్న అంచనా ఉందిఇది అమ్మకాలను పెంచి.. చేతివృత్తులవారి ఆదాయాలను పెరిగేలా చూసుకుంటుందిఅదే విధంగా దేశీయఅంతర్జాతీయ మార్కెట్లలో ఈ సంప్రదాయ హస్తకళల సంరక్షణవృద్ధిని మరింత ప్రోత్సహిస్తుంది.

వరంగల్ తివాచీలు

దక్షిణ తెలంగాణలోని చారిత్రాత్మక నగరమైన వరంగల్‌కు 2018లో కాటన్ తివాచీల విషయంలో జీఐ గుర్తింపు లభించిందిసంక్లిష్టతతో కూడిన ఈ తివాచీలను పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేత కార్మికులు నేస్తారువ్యక్తిగతంగాసహకార సంఘాల ద్వారా ఈ హస్తకళను వారు కొనసాగిస్తున్నారుఈ తివాచీల విషయంలో మొత్తం దాదాపు 2,000 మంది ఉపాధి పొందుతున్నారు

వరంగల్ తివాచీ విక్రయాలు ఫ్యాబ్ ఇండియాసీసీఐసీగోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ వంటి వాటితో పాటు స్థానిక మార్కెట్‌లుఉత్సవ కేంద్రాలురాష్ట్ర ఎంపోరియాలుఅమెజాన్ వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా జరుగుతున్నాయివీటిని జర్మనీబ్రిటన్ఫ్రాన్స్ఇతర ఐరోపా దేశాలతో పాటు జపాన్అమెరికాకెనడాకు కూడా ఎగుమతి చేస్తున్నారుఇది వాటికి ఉన్న అంతర్జాతీయ ఆకర్షణను తెలియజేస్తోంది

జీఎస్టీని 12 శాతం నుంచి శాతానికి తగ్గించటంతో చిల్లర ధరలు శాతం తగ్గాయన్న అంచనా ఉందిదీనివల్ల వరంగల్ తివాచీల పోటీతత్వం పెరగటంతో పాటు వాటి ఎగుమతి సామర్థ్యం పెరుగుతుందిదీనితో పాటు అమ్మకాలు మెరుగుపడి కళాకారుల ఆదాయాలు పెరుగుతాయితద్వారా ఈ సంప్రదాయ హస్తకళలు నిరంతరం వృద్ధి సాధిస్తాయి

ముగింపు

జీఎస్టీ సంస్కరణలు ఖర్చులను తగ్గించడంపోటీతత్వాన్ని పెంచడంవివిధ రంగాల విషయంలో మార్కెట్లను విస్తరించడం ద్వారా తెలంగాణ వృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాయిఆహార శుద్ధిఔషధాల విషయంలో తగ్గిన పన్నులు.. ఉత్పత్తులను మరింత అందుబాటు ధరల్లోకి తీసుకురావటంతో పాటు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయివిమానయానంరక్షణవాహన రంగంలో జీఎస్టీ రేట్ల తగ్గింపు ఉత్పత్తి ఖర్చులను తగ్గిస్తుందితద్వారా ఎగుమతులు పెరగటంతో పాటు పరిశోధనఅభివృద్ధి మద్దతు లభిస్తుందిసంప్రదాయ హస్తకళలుబొమ్మలపై జీఎస్టీ శాతానికి తగ్గటంతో అమ్మకాలు పెరిగి చేతివృత్తుల వారికి ఆదాయాలు మెరుగుపడతాయితద్వారా ఇవి బలమైన దేశీయఅంతర్జాతీయ డిమాండ్‌ను చూస్తాయి.

మొత్తంమీద ఈ సంస్కరణలు ఉత్పత్తులను అందుబాటు ధరల్లోకి తీసుకొచ్చి మార్కెట్ వృద్ధిసమ్మిళిత ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తాయితద్వారా తెలంగాణను పరిశ్రమఎగుమతులుసాంస్కృతిక వారసత్వానికి కేంద్రంగా మారుస్తాయి

సూచనలు

Telangana.gov.in
https://www.telangana.gov.in/about/language-culture/
https://www.telangana.gov.in/about/state-profile/


 

incredibleindia.gov.in
https://www.incredibleindia.gov.in/en/telangana

invest.telangana.gov.in
https://invest.telangana.gov.in/pharma/

tourism.telangana.gov.in
https://tourism.telangana.gov.in/page/arts-crafts

ఐబీఈఎఫ్
https://ibef.org/blogs/the-toy-story-in-india-understanding-india-s-booming-toy-retail-market

పీడీఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

***

(तथ्य सामग्री आईडी: 150372) आगंतुक पटल : 46


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , हिन्दी , Urdu , Bengali , Odia
Link mygov.in
National Portal Of India
STQC Certificate