Infrastructure
విద్యుత్(సవరణ) బిల్లు, 2025పై తరచూ అడిగే ప్రశ్నలు
प्रविष्टि तिथि:
30 OCT 2025 19:12 PM
ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన పోటీ, సామర్థ్యం పెంపు ద్వారా విద్యుత్ సరఫరా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ప్రగతిశీల సంస్కరణనే విద్యుత్(సవరణ) బిల్లు, 2025. వికసిత్ భారత్@2047 సంకల్పానికి అనుగుణంగా విద్యుత్ రంగాన్ని భవిష్యత్తుకు సిద్ధం చేయడానికి ఇది పునాది వేస్తోంది. ఇదే సమయంలో రైతులు, ఇతర అర్హులైన వినియోగదారుల సబ్సిడీ టారిఫ్‌లను సైతం పూర్తిగా రక్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టంలోని సెక్షన్ 65 కింద సబ్సిడీలను కొనసాగించవచ్చు.
ఎస్ఈఆర్‌సీల పర్యవేక్షణ కింద విద్యుత్ సరఫరాలో ప్రభుత్వ, ప్రైవేటు డిస్కమ్‌ల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ఈ బిల్లు ప్రోత్సహిస్తుంది. దీని వల్ల వినియోగదారులకు మెరుగైన సేవ, గొప్ప సామర్థ్యం లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పనితీరులో పోటీ పడేందుకు, గుత్తాధిపత్య సరఫరాను సమర్థవంతంగా, జవాబుదారీతనంగా, వినియోగదారుల అనుకూల సేవగా మార్చేందుకు ఇది ఉపయోగపడుతుంది.
1. పోటీ వల్ల రైతులు, సాధారణ వినియోగదారుల విద్యుత్ ధరలు పెరుగుతాయా?
పోటీ వల్ల విద్యుత్ సరఫరాలో సామర్థ్యం, జవాబుదారీతనం పెరిగి మొత్తంగా ఖర్చు తగ్గుతుంది.
నెట్‌వర్క్ భాగస్వామ్య వినియోగంతో సరఫరా లైన్లు, సబ్-స్టేషన్ల వృథాను నివారించవచ్చు. గుత్తాధిపత్య సరఫరా విధానం కింద సాంకేతిక, వాణిజ్య నష్టాలు ఎక్కువ ఉండేవి. ఇవి ఒకేలా చూస్తారు. సామర్థ్యలోపాలు, చోరీలను దాచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు లేదా గృహ వినియోగదారులు వంటి రంగాల వారికి విద్యుత్ సబ్సిడీలు ఇచ్చినప్పుడు సామాజిక మద్దతు కోసం ఇస్తున్న సబ్సిడీల భారమే కాకుండా గుత్తాధిపత్య కార్యకలాపాల ఖర్చు కూడా ప్రభుత్వంపై పడుతోంది.
భాగస్వామ్య నెట్‌వర్క్ వినియోగానికి అవకాశం కల్పించడం, పోటీని నెలకొల్పడం ద్వారా ఈ సంస్కరణలు నష్టాలను తగ్గించడంతో పాటు వినియోగదారుల సబ్సిడీల్లో మార్పులు చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వాలపై సబ్సిడీ భారం తగ్గుతుంది.
2. కాస్ట్-రిఫ్లెక్టీవ్ టారిఫ్‌ల వల్ల రైతులు, పేదలకు విద్యుత్ టారిఫ్‌లు భారంగా మారతాయా?
కాస్ట్-రిఫ్లెక్టీవ్ టారిఫ్‌లు డిస్కమ్‌లను రుణ చక్రం నుంచి బయటకు తెస్తాయి. తద్వారా నమ్మకమైన సేవలు, సమయానుకూల నిర్వహణ, సరఫరా వ్యవస్థ మౌలిక వసతుల నవీకరణకు అవకాశం కలుగుతుంది.
తయారీ పరిశ్రమలు, రైల్వేలు, మెట్రోలకు ఇస్తున్న క్రాస్-సబ్సిడీలను తొలగించి, పోటీతత్వాన్ని పెంచుతాయి. తద్వారా ఉద్యోగ కల్పలను దోహదపడతాయి. రహస్య క్రాస్-సబ్సిడీల స్థానంలో పారదర్శకమైన, లెక్కల ఆధారంగా సబ్సిడీలు(చట్టంలోని 65వ సెక్షన్ కింద) వస్తాయి. ఇవి రైతులు, పేదలు వంటి బలహీనులను రక్షిస్తాయి.
3. పోటీ వల్ల నెట్‌వర్క్(వీలింగ్) చార్జీల చెల్లింపులు తగ్గిపోతాయా?
ప్రతిపాదిత బిల్లు ప్రకారం ఎస్ఈఆర్‌సీలు కాస్ట్-రిఫ్లెక్టీవ్ వీలింగ్ చార్జీలను నిర్ణయిస్తాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సరఫరా వ్యవస్థలు ఈ నిర్దిష్ట చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వసూలైన చార్జీలు తర్వాత నెట్‌వర్క్ యాజమాన్యం ఆధారంగా లైసెన్స్‌దారులకు న్యాయంగా పంపిణీ జరుగుతుంది. తద్వారా వేతనాలు, నిర్వహణ, నెట్‌వర్క్ విస్తరణకు కావాల్సిన నిధులు విద్యుత్ సంస్థలకు అందుతాయి.
దేశంలో ఇప్పటికే భాగస్వామ్య సదుపాయాలపై నడిచే విజయవంతమైన నమూనా అయిన ఇంటర్-స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్(ఐఎస్‌టీఎస్) ఉంది. పవర్‌గ్రిడ్(కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ) లాంటి ట్రాన్స్‌మిషన్ సర్వీస్ ప్రొవైడర్(టీఎస్‌పీలు), ప్రైవేట్ సంస్థలు పోటీపడి సీఈఆర్‌సీ పర్యవేక్షణ కింద ఐసీటీఎస్ ఆస్తులను నిర్మిస్తాయి. వినియోగదారులు చేసే నెలవారీ చెల్లింపులను ఈ టీఎస్‌పీలకు న్యాయంగా పంపిణీ జరుగుతుంది. ఈ నమూనా విశ్వసనీయతను కాపాడుకుంటూనే ఐసీటీఎస్ నిర్మాణ వ్యయం, సమయాన్ని తగ్గించింది.
4. ఈ చట్టం వల్ల ప్రభుత్వ డిస్కమ్‌లు మూతబడతాయా లేదా ప్రైవేటు సంస్థలు లాభదాయకమైనవే ఎంచుకుంటాయా?
ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వ డిస్కమ్‌లు కూడా నియంత్రిత, సమాన అవకాశాల వాతావరణంలో పనిచేస్తాయి. పోటీ వల్ల వ్యయం తగ్గడంతో పాటు సామర్థ్యం, సేవల నాణ్యత పెరుగుతుంది. నియంత్రిత పోటీ వల్ల వ్యయం తగ్గుతుందని, వ్యవస్థ వేగంగా విస్తరించేందుకు అవకాశం కలుగుతుందని ఐసీటీఎస్ అనుభవం చాటుతోంది.
సరఫరా లైసెన్స్ కలిగిన సంస్థ ఎస్ఈఆర్‌సీ నిర్ణయించిన సరఫరా ప్రాంతంలోని వినియోగదారులు అందరికీ సరఫరా చేస్తుంది. సరఫరా ప్రాంతం అనేది మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు లేదా పక్కపక్కనే ఉండే మూడు జిల్లాలు లేదా ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించిన ఏదైనా చిన్న ప్రాంతం కావచ్చు. ఈ ప్రాంతాలను ఎస్ఈఆర్‌సీలు నియంత్రిస్తాయి.
సరఫరా లైసెన్స్ కలిగిన అన్ని సంస్థలకు నియంత్రణ సంస్థలు కాస్ట్-రిఫ్లెక్టీవ్ టారిఫ్‌లను నిర్ణయిస్తాయి. లైసెన్స్ కలిగిన అన్ని సంస్థలకు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్(యూఎస్‌వో) వర్తిస్తుంది. అంటే ప్రతి సరఫరాదారు పరిధిలోని ప్రాంతంలోని వినియోగదారులు అందరికీ ఎలాంటి వివక్ష లేకుండా సేవలు అందించాలి. అదనంగా సబ్సిడీలు పొందుతున్న వినియోగదారులకు(ఉదాహరణకు రైతులు, పేద గృహాలు) సేవలు అందించే సరఫరా సంస్థలు రాష్ట్ర సబ్సిడీలను అందుకుంటాయి. ఎస్ఈఆర్‌సీలు మినహాయించిన నిర్దిష్ట పెద్ద వినియోగదారులు తప్ప రైతులు, గృహ వినియోగదారులు సహా అందరికీ యూఎస్‌వో వర్తిస్తుంది.
పనితీరుకు సంబంధించి ఎస్ఈఆర్‌సీ ప్రమాణాలను(విశ్వసనీయత, వోల్టేజ్, ఔటేజ్ ఫ్రీక్వెన్సీ) అమలు చేస్తుంది. ఇవి పాటించకపోతే జరిమానా విధించడంతో పాటు లైసెన్స్‌లు రద్దు చేయవచ్చు.
చట్టం కింద ప్రస్తుతం ఓపెన్ యాక్సెస్‌కు అర్హులైన పెద్ద వినియోగదారులకు(1 మెగావాట్ కంటే ఎక్కువ) రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపుల ద్వారా యూఎస్‌వో తొలగింపునకు ఈ బిల్లు అనుమతిస్తుంది. ఈ పెద్ద వినియోగదారులు డిస్కమ్ సహకారంతో ఓపెన్ యాక్సెస్ ద్వారా సొంతంగా విద్యుత్ కొనుగోలు చేయవచ్చు. అవసరమైతే సరఫరా లైసెన్స్‌దారు సరఫరా నష్టం లేకుండా సరఫరా ఖర్చుతో విద్యుత్ సరఫరా చేయవచ్చు.
కాబట్టి, ఈ చట్టం లైసెన్స్‌దారులు అందరికీ పారదర్శక పోటీ, పూర్తి కవరేజీ, ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది.
5. ఈ బిల్లు అధికారాలను కేంద్రీకరిస్తుందా లేదా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందా?
విద్యుత్ ఉమ్మడి జాబితాలో ఉంది. కాబట్టి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చట్టం చేయవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపుల ప్రక్రియ ద్వారా సంస్కరణలు అమలు చేయాలనేది ఈ బిల్లు ఉద్దేశం.
విధానపరమైన ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ప్రతిపాదిత విద్యుత్ మండలి సంప్రదింపుల సంస్థగా వ్యవహరిస్తుంది. ఇదే సమయంలో ఎస్ఈఆర్‌సీలు టారిఫ్‌లు నిర్ణయించడం, లైసెన్స్‌లు జారీ చేయడంతో పాటు రాష్ట్రం పరిధిలో కార్యకలాపాలను నియంత్రిస్తాయి.
సమాఖ్య సమతుల్యాన్ని ఈ బిల్లు పరిరక్షిస్తుంది. సహకార పరిపాలనను ప్రోత్సహించడంతో పాటు విద్యుత్ రంగంలోని సవాళ్లను పరిష్కరించే చట్రాన్ని బలోపేతం చేస్తుంది.
***
(तथ्य सामग्री आईडी: 150454)
आगंतुक पटल : 44
Provide suggestions / comments