• Sitemap
  • Advance Search
Social Welfare

పటిష్ఠ‌ చట్టం, సురక్షిత పరీక్షలు: ప్రశ్నపత్రాల లీకేజీపై భారత్ ఉక్కుపాదం

प्रविष्टि तिथि: 31 JUL 2026 11:53 AM

కఠిన కారాగార శిక్షలు,  ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లుసత్వర విచారణ న్యాయస్థానాలు

 

దేశంలో ప్రతి ఏటా లక్షల మంది యువత మెరుగైన భవిష్యత్తు కోసం సమాన అవకాశాన్ని ఆశిస్తూ ప్రభుత్వ పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రశ్నపత్రం లీకైనాఏదైనా ముఠా ఫలితాలను తారుమారు చేసినా కేవలం ఒక నిబంధనను ఉల్లంఘించినట్లే కాదు. నిజాయతీగా చదివిన విద్యార్థి కృషినినమ్మకాన్ని వమ్ము చేసినట్లవుతుంది.

 

ఆ నమ్మకాన్ని కాపాడేందుకు పరీక్షల్లో అక్రమాలుప్రశ్నపత్రాల లీకేజీవ్యవస్థీకృత పరీక్షల మోసాలను అడ్డుకునే తొలి ప్రత్యేక చట్టమైన ‘ప‌బ్లిక్ పరీక్షల(అక్రమాల నివార‌ణ‌) చట్టం–2024’ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం ఇప్పుడు ప్ర‌వేశ‌పెట్టిన‌ ‘ప‌బ్లిక్‌ పరీక్షల(అక్రమాల నివార‌ణ‌) సవరణ బిల్లు–2026’ను పార్ల‌మెంటు ఆమోదించింది. ఈ బిల్లు శిక్షలను పెంచుతుంది. దర్యాప్తువిచారణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. బాధితులకు న్యాయం పొందేందుకు స్పష్టమైన మార్గాన్ని కల్పిస్తుంది.

 

ఈ సవరణ ఎందుకు అవసరమైంది?

2024 చట్టం దేశానికి పటిష్ఠమైన పునాది వేసింది. అయినప్పటికీఇటీవలి సంవత్సరాల్లో ప్రశ్నపత్రాల లీకేజీపరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన ఘటనలు వెలుగుచూశాయి. ఇవి ప్రభుత్వ పరీక్షల వ్యవస్థలో నిష్పాక్షికతనువిశ్వసనీయతను దెబ్బతీశాయి. వీటిని నేరుగా ఎదుర్కొనేందుకు 2026 బిల్లు చర్యలు ప్రతిపాదిస్తోంది. నేరాలకు పాల్పడకుండా బలమైన నిరోధకంగా పనిచేసేలా శిక్షలను కఠినతరం చేస్తోంది. దోషులకు త్వరగా శిక్ష పడేలావిద్యార్థులకు సత్వర న్యాయం లభించేలా వేగవంతమైనగడువుతో కూడిన దర్యాప్తువిచారణ వ్యవస్థను రూపొందిస్తోంది.

 

నేరస్థులకు కఠిన శిక్షలు

శిక్షల పెంపు ఈ బిల్లులో అత్యంత స్పష్టమైన మార్పు. వ్యక్తులుసేవా సంస్థలువ్యవస్థీకృత ముఠాల నిర్వాహకులు.. ఇలా పరీక్షల మోసాలకు పాల్పడే అన్ని వర్గాలకు కారాగార శిక్షలుజరిమానాలను భారీగా పెంచారు.

నిబంధన

గత పరిస్థితి (2024 చట్టం)

ప్రస్తుత మార్పు (2026 బిల్లు)

వ్యక్తిగత నేరస్థులు (సెక్షన్ 10)

నుంచి ఏళ్ల కారాగార శిక్షగరిష్ఠంగా ₹10 లక్షల జరిమానా

నుంచి 10 ఏళ్ల కారాగార శిక్షగరిష్ఠంగా ₹50 లక్షల జరిమానా

సేవా సంస్థలు (సెక్షన్ 10)

గరిష్ఠంగా ₹1 కోటి జరిమానాప్రభుత్వ పరీక్షల నిర్వహణ నుంచి నాలుగేళ్ల నిషేధం

గరిష్ఠంగా ₹5 కోట్ల జరిమానాప్రభుత్వ పరీక్షల నిర్వహణ నుంచి ఎనిమిదేళ్ల నిషేధం

బాధ్యులుగా తేలిన డైరెక్టర్లుసీనియర్ యాజమాన్య ప్రతినిధులు (సెక్షన్ 10)

నుంచి 10 ఏళ్ల కారాగార శిక్ష, ₹1 కోటి జరిమానా

నుంచి 10 ఏళ్ల కారాగార శిక్ష, ₹5 కోట్ల జరిమానా

వ్యవస్థీకృత నేర ముఠాలుపరీక్షల మోసాలకు పాల్పడే సిండికేట్లు (సెక్షన్ 11)

నుంచి 10 ఏళ్ల కారాగార శిక్షకనీసం ₹1 కోటి జరిమానా

నుంచి 10 ఏళ్ల కారాగార శిక్షకనీసం ₹10 కోట్ల జరిమానా

 

వేగవంతమైనలక్ష్య నిర్దేశిత దర్యాప్తు

2024 చట్టం ప్రకారం కనీసం డిప్యూటీ సూపరింటెండెంట్ హోదా కలిగిన పోలీసు అధికారి కేసులను దర్యాప్తు చేసేవారు. ఏదైనా కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. 2026 బిల్లు మరో అవకాశాన్ని చేర్చింది. పరీక్షల మోసాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఏదైనా కేసు కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తేఆ కేసును అదే బృందం దర్యాప్తు చేస్తుంది. తద్వారా బాధ్యత స్పష్టంగానిర్దిష్టంగా ఉంటుంది.

 

దర్యాప్తునకు తొలిసారిగా నిర్దిష్ట గడువును కూడా బిల్లు విధిస్తోంది. పోలీసు అధికారికేంద్ర దర్యాప్తు సంస్థ లేదా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌.. దర్యాప్తు బాధ్యత ఎవరికి అప్పగించినా రెండు నెలల్లోపు పూర్తి చేయాలి. పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేసిన రోజు నుంచి లేదా కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించిన రోజు నుంచి లేదా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి ఈ రెండు నెలల గడువు ప్రారంభమవుతుంది. ఆయా సందర్భాలకు అనుగుణంగా గడువును లెక్కిస్తారు.

 

కొత్త ప్రత్యేక సత్వర విచారణ న్యాయస్థానాలు

సెషన్స్ న్యాయస్థానాన్ని ప్రత్యేక సత్వర విచారణ న్యాయస్థానంగా గుర్తించడం ఈ బిల్లులోని అతిపెద్ద మార్పుల్లో ఒకటి. పరీక్షల మోసాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం ప్రతి రాష్ట్రంకేంద్రపాలిత ప్రాంతం సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి ఒక సెషన్స్ న్యాయస్థానాన్ని ప్రత్యేక సత్వర విచారణ న్యాయస్థానంగా గుర్తించాలి.

· అనవసర విరామాలు లేకుండా ఈ న్యాయస్థానాలు రోజువారీ ప్రాతిపదికన కేసులను విచారించాలి.

· అభియోగపత్రం దాఖలు చేసిన మూడు నెలల్లోపు విచారణ పూర్తి చేయాలి.

· ఈ సవరణ అమల్లోకి వచ్చిన తేదీ నాటికి ఇతర న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను కొత్త ప్రత్యేక సత్వర విచారణ న్యాయస్థానాలకు బదిలీ చేస్తారు. బదిలీ చేసిన మూడు నెలల్లోపు వాటి విచారణ పూర్తి చేయాలి.

· ఈ కేసుల్లో వాదనలు వినిపించేందుకు ప్రతి రాష్ట్రంకేంద్రపాలిత ప్రాంతం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా నియమిస్తుంది.

నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత లేదా ఇతర చట్టాల కింద సంబంధిత అభియోగాలు కూడా ఉంటేకేసును పలు న్యాయస్థానాలకు పంపకుండా ప్రత్యేక సత్వర విచారణ న్యాయస్థానమే ఒకే విచారణలో వాటిని పరిశీలిస్తుంది.

ఈ నిబంధనలతో పరీక్షల మోసానికి సంబంధించిన కేసు ఇకపై ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉండదు. దర్యాప్తు నుంచి విచారణ వరకు ప్రత్యేకగడువుతో కూడిన వ్యవస్థ ద్వారా కేసు ముందుకు సాగుతుంది.

 

అప్పీలుకు స్పష్టమైన హక్కు

ప్రత్యేక సత్వర విచారణ న్యాయస్థానం తీర్పుపై అప్పీలు ఎలా చేయాలనే అంశాన్ని కూడా ఈ బిల్లు తొలిసారిగా స్పష్టంగా నిర్దేశిస్తోంది.

· సాధారణ మధ్యంతర ఉత్తర్వులు మినహా ఏదైనా తీర్పుశిక్ష లేదా ఉత్తర్వుపై అప్పీలును హైకోర్టులో దాఖలు చేయాలి.

· ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం అప్పీలును విచారిస్తుంది. అప్పీలును స్వీకరించిన మూడు నెలల్లోపు పరిష్కరించేందుకు హైకోర్టు ప్రయత్నించాలి.

· బెయిల్ మంజూరు చేసినాతిరస్కరించినా ఆ ఉత్తర్వుపై నేరుగా హైకోర్టులో అప్పీలు చేయవచ్చు.

· సాధారణంగా 30 రోజుల్లోపు అప్పీలు దాఖలు చేయాలి. తగిన కారణం ఉంటే ఆలస్యాన్ని హైకోర్టు అనుమతించవచ్చు. అయితే, 90 రోజుల తర్వాత అప్పీలు దాఖలు చేయడానికి వీలుండదు.

 

హైకోర్టులో అప్పీలు చేసే ఈ మార్గం మినహాప్రత్యేక సత్వర విచారణ న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వుపై ఇతర ఏ న్యాయస్థానంలోనూ మరో అప్పీలు లేదా పునఃసమీక్ష పిటిషన్ దాఖలు చేయడానికి వీలుండదు. తద్వారా ప్రక్రియ వేగంగా సాగితుది నిర్ణయం వెలువడుతుంది.

 

నిందితులుప్రాసిక్యూషన్ పక్షానికి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు నిష్పాక్షికమైనగడువుతో కూడిన అవకాశం ఇది కల్పిస్తుంది. ఏ దశలోనూ న్యాయం నిరవధికంగా ఆలస్యం కాకుండా చూస్తుంది.

 

విద్యార్థులకు దీనివల్ల కలిగే ప్రయోజనం

ఈ మార్పులన్నీ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. పరీక్షల మోసాలకు పాల్పడేవారు ఇకపై భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి నేరాలను వేగంగా గుర్తించివిచారించిశిక్షిస్తారు. ప్రభుత్వ పరీక్షకు నిజాయతీగా సిద్ధమయ్యే విద్యార్థి.. ప్రశ్నపత్రాల లీకేజీపరీక్షల మోసాలకు పాల్పడే ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటారనే విశ్వాసంతో ఉండవచ్చు. అవసరమైనప్పుడు న్యాయం లభించేందుకు ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉండదు.

 

ప‌బ్లిక్‌ పరీక్షల (అక్రమాల నివార‌ణ‌) సవరణ బిల్లు–2026’.. 2024 చట్టం వేసిన పునాదిని మరింత బలోపేతం చేస్తుంది. తమ భవిష్యత్తు కోసం ప్రభుత్వ పరీక్షలపై ఆధారపడే యువతకు మరింత పారదర్శకమైనసురక్షితమైనవిశ్వసనీయమైన పరీక్షల వ్యవస్థను రూపొందిస్తుంది.

 

***

(तथ्य सामग्री आईडी: 150803) आगंतुक पटल : 8


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , हिन्दी , Bengali , Malayalam , Kannada , Assamese