• Sitemap
  • Advance Search
Infrastructure

భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి: అనుసంధానం నుంచి సామర్థ్యం దిశగా

प्रविष्टि तिथि: 12 AUG 2026 19:12 PM

వృద్ధికి బలమైన పునాది
గత 12 ఏళ్లలో భారత్‌ మౌలిక సదుపాయాల రంగం భారీ పరివర్తనను సాధించింది. రవాణా, లాజిస్టిక్స్‌ నుంచి గృహ నిర్మాణం, నీటి సరఫరా వరకు సమీకృత ప్రణాళిక, భారీ స్థాయి విస్తరణ దిశగా మౌలిక సదుపాయాల అభివృద్ధి ముందుకు సాగింది. దీనివల్ల అనుసంధానం బలోపేతమైంది. అత్యవసర సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయి. నిరంతర ఆర్థిక వృద్ధికి బలమైన పునాదులు ఏర్పడ్డాయి. ఈ పురోగతికి మద్దతుగా ప్రభుత్వ మూలధన వ్యయం 2014–15 ఆర్థిక సంవత్సరంలో సుమారు ₹2 లక్షల కోట్ల నుంచి 2026–27 ఆర్థిక సంవత్సరంలో ₹12.2 లక్షల కోట్లకు పెరిగింది.

రైల్వే రవాణాలో నవశకం
భారతీయ రైల్వేలు వేగవంతమైన, సురక్షితమైన, ఆధునిక రవాణా దిశగా ముందుకు సాగుతున్నాయి. విద్యుదీకరణ, అధునాతన భద్రతా వ్యవస్థలు, హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టులు, కొత్తతరం రైళ్లు దేశ రైల్వే వ్య‌వ‌స్థ‌కు సరికొత్త రూపునిస్తున్నాయి.

* రైల్వే బడ్జెట్‌ 2014–15లో ₹32 వేల కోట్ల నుంచి 2026–27 ఆర్థిక సంవత్సరంలో ₹2.78 లక్షల కోట్లకు పెరిగింది.
* రైల్వే విద్యుదీకరణ 2014కు ముందు సుమారు 20 శాతంగా ఉండగా, 2026 జూలై నాటికి 99.6 శాతానికి చేరింది.
* 162 వందే భారత్‌, 2 వందే భారత్‌ స్లీపర్‌, 72 అమృత్‌ భారత్‌ రైలు సర్వీసులు అనుసంధానాన్ని, ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచాయి.
* కవచ్‌ వెర్షన్‌ 4.0ను 2026 జూలై నాటికి 2,633 రూట్‌ కిలోమీటర్లలో అమల్లోకి తీసుకొచ్చారు.
* ముంబయి–అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు కారిడార్‌ను 508 కిలోమీటర్ల మార్గంలో, గంటకు 350 కిలోమీటర్ల డిజైన్‌ వేగంతో అభివృద్ధి చేస్తున్నారు.
* అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద గుర్తించిన 1,340 స్టేషన్లలో 261 స్టేషన్ల పునరాభివృద్ధి 2026 జూలై 18 నాటికి పూర్తయింది.
* దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ రైలును 2026 జూలైలో ప్రారంభించారు. దాదాపు 2,600 మంది ప్రయాణికుల సామర్థ్యంతో కూడిన ఈ 10 బోగీల రైలు జింద్‌–సోనిపట్‌ మార్గంలో నడుస్తోంది. రైలు ప్రయాణానికి అవసరమైన విద్యుత్తును రైలులోనే ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, వేడి మాత్రమే ఉప ఉత్పత్తులుగా వెలువడతాయి.



భారత్‌ను అనుసంధానిస్తున్న రహదారులు–జాతీయ రహదారులు
మరింత విస్తృతమైన, అధిక సామర్థ్యం కలిగిన రహదారి నెట్‌వర్క్‌ దేశంలోని ప్రాంతాలను చేరువ చేస్తోంది. జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులు, ప్రధాన కారిడార్ల విస్తరణతో ప్రజలు, వస్తువుల రవాణా మరింత సులభమవుతోంది.
* 63.73 లక్షల కిలోమీటర్లతో భారత్‌ ప్రపంచంలో రెండో అతిపెద్ద రహదారి వ్య‌వ‌స్థ‌ను కలిగి ఉంది.
* జాతీయ రహదారుల పొడవు 2013–14 ఆర్థిక సంవత్సరంలో 91,287 కిలోమీటర్ల నుంచి 2026 మార్చి నాటికి 1,46,572 కిలోమీటర్లకు చేరింది. ఇది దాదాపు 61 శాతం వృద్ధి.
* నాలుగు వరుసలు అంతకంటే ఎక్కువ వరుసలు కలిగిన జాతీయ రహదారుల పొడవు 2014లో 18,371 కిలోమీటర్ల నుంచి 45,516 కిలోమీటర్లకు పెరిగింది.
* ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన కింద 2000–2014 మధ్య నిర్మించిన రహదారుల పొడవు 3.86 లక్షల కిలోమీటర్లు కాగా, 2014–2026 మధ్య ఇది 4.11 లక్షల కిలోమీటర్లకు పెరిగింది. 2029 నాటికి అనుసంధానం లేని 25 వేల జనావాసాలకు రహదారి సదుపాయం కల్పించే లక్ష్యంతో 2024 సెప్టెంబర్‌లో పీఎంజీఎస్‌వై–4ను ప్రారంభించారు.
* భారతమాల కింద 2026 మార్చి 31 నాటికి 22,590 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయింది.

వంతెనలు, సొరంగాలు: ఇంజినీరింగ్‌లో సరికొత్త విజ‌యాలు
ఇంజినీరింగ్‌ రంగంలోని వినూత్న విజయాలు భారత్‌లో అత్యంత క్లిష్టమైన భౌగోళిక సవాళ్లను అధిగమిస్తున్నాయి. దుర్గమ ప్రాంతాల్లో కొత్త రవాణా మార్గాలను ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి తెస్తున్నాయి.

* చీనాబ్‌ వంతెన (2025): చీనాబ్‌ నదికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్‌ వంతెన. 1,315 మీటర్ల పొడవైన ఈ ఉక్కు నిర్మాణం జమ్మూ–శ్రీనగర్‌ అనుసంధానాన్ని బలోపేతం చేస్తోంది.
* అంజి ఖడ్‌ వంతెన (2025): జమ్మూ–కశ్మీర్‌లో నిర్మించిన భారత్‌ తొలి కేబుల్‌ ఆధారిత రైల్వే వంతెన.
* పాంబన్‌ వంతెన (2025): రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించే భారత్‌ తొలి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సముద్ర వంతెన. 2.07 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనలో 72.5 మీటర్ల వర్టికల్‌ లిఫ్ట్‌ భాగం ఉంది.
* జెడ్‌–మోర్హ్‌/సోనామార్గ్‌ సొరంగం (2025): హిమపాతాలు సంభవించే జమ్మూ–కశ్మీర్‌ ప్రాంతంలో అన్ని కాలాల్లో రాకపోకలకు వీలు కల్పించే 12 కిలోమీటర్ల సొరంగం. లద్దాఖ్‌ వైపు రవాణాను ఇది మెరుగుపరుస్తోంది.
* సుదర్శన్‌ సేతు (2024): గుజరాత్‌లోని ఓఖాను బేట్‌ ద్వారకతో అనుసంధానించే 2.32 కిలోమీటర్ల వంతెన.
* అటల్‌ సొరంగం (2020): మనాలీ, లాహౌల్‌–స్పితిని అనుసంధానించే 9.02 కిలోమీటర్ల సొరంగం. 10 వేల అడుగులకు పైగా ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి సొరంగం.
* డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ సొరంగం (2017): జమ్మూ–శ్రీనగర్‌ మధ్య అన్ని కాలాల్లో రాకపోకలకు వీలు కల్పించే తొమ్మిది కిలోమీటర్ల సొరంగం. దీనివల్ల ప్రయాణ సమయం సుమారు రెండు గంటలు తగ్గింది.



పౌర విమానయానం–ప్రాంతీయ గగన అనుసంధానం
విమాన అనుసంధానం మరిన్ని నగరాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తోంది. విమానాశ్రయాలు, ఉడాన్‌ మార్గాలు, డిజిటల్‌ ప్రయాణికుల సేవల విస్తరణతో దేశవ్యాప్తంగా విమాన ప్రయాణం మరింత అందుబాటులోకి వస్తోంది.
* ఉడాన్‌ పథకం కింద 2026 జూలై 15 నాటికి 679 మార్గాల ద్వారా 95 విమానాశ్రయాలు, హెలిపోర్టులు, వాటర్‌ ఏరోడ్రోమ్‌లను అనుసంధానించారు. దీంతో 1.68 కోట్ల మందికి పైగా ప్రయాణికులు ప్రయోజనం పొందారు.
* నిర్వహణలోని విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 నుంచి 2026 జూలై నాటికి 165కు పెరిగింది.
* 2014 తర్వాత 25 గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలకు అనుమతులు మంజూరు చేశారు.
* డిజి యాత్ర ప్రస్తుతం 38 విమానాశ్రయాల్లో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ 2.4 కోట్లకు పైగా డౌన్‌లోడ్‌లతో 10 కోట్లకు పైగా అవాంతరాలు లేని ప్రయాణాలకు వీలు కల్పించింది.
* చివరి అంచె ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని బలోపేతం చేసేందుకు 2026–27 నుంచి 2035–36 ఆర్థిక సంవత్సరం వరకు ₹28,840 కోట్ల వ్యయంతో సవరించిన ఉడాన్‌ పథకానికి 2026 మార్చిలో ఆమోదం లభించింది. ఈ పథకం కింద 100 కొత్త విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిప్యాడ్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.

మెట్రో: పట్టణ సామూహిక రవాణాలో పురోగతి
భారత్‌లో పట్టణ రవాణా నెట్‌వర్క్‌ విస్తీర్ణం, పరిధిపరంగా వేగంగా విస్తరిస్తోంది. మెట్రో అనుసంధానం మరిన్ని నగరాలకు చేరుతుండగా, వినూత్న వ్యవస్థలు పట్టణ రవాణాలో కొత్త అవకాశాలను అందిస్తున్నాయి.
* మెట్రో నెట్‌వర్క్‌ 2014లో 248 కిలోమీటర్ల నుంచి 2026లో 1,155 కిలోమీటర్లకు పైగా విస్తరించింది.
* మెట్రో వ్య‌వ‌స్థ‌ కలిగిన నగరాల సంఖ్య 5 నుంచి 26కు పెరిగింది. రోజువారీ ప్రయాణికుల సంఖ్య 1.15 కోట్లు దాటింది.
* కోల్‌కతాలో భారత్‌ తొలి నీటి అడుగున మెట్రో సొరంగాన్ని 2024లో ప్రారంభించారు.
* కొచ్చిలో భారత్‌ తొలి వాటర్‌ మెట్రో వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఇందులో తొలి పడవను 2021 డిసెంబర్‌లో ప్రారంభించారు.

భారత్‌ సముద్ర రంగంలో వేగవంతమైన పురోగతి
విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య అవసరాలకు మద్దతుగా భారత్‌ తన సముద్ర రంగ పునాదులను బలోపేతం చేస్తోంది. ఓడరేవులు, జలమార్గాలు, సముద్ర మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు అధిక సామర్థ్యం, మెరుగైన అనుసంధానం కలిగిన వ్యవస్థను రూపొందిస్తున్నాయి.
* ప్రధాన ఓడరేవుల సరకు నిర్వహణ సామర్థ్యం 2014లో 873 ఎంఎంటీపీఏ నుంచి 2026లో 1,728 ఎంఎంటీపీఏకు పెరిగి దాదాపు రెట్టింపైంది.
* నౌకల రాకపోకలకు పట్టే సగటు సమయం 94 గంటల నుంచి 2025–26లో 48.8 గంటలకు తగ్గింది.
* ప్రధాన ఓడరేవులు 2014–15 ఆర్థిక సంవత్సరంలో 581 మిలియన్‌ టన్నుల సరకును నిర్వహించగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలో 915.17 మిలియన్‌ టన్నుల సరకును నిర్వహించాయి.
* సాగరమాల కార్యక్రమం ఓడరేవుల ఆధారిత అభివృద్ధి, తీర ప్రాంత అనుసంధానం, లాజిస్టిక్స్‌ ఏకీకరణను బలోపేతం చేసింది.
* జాతీయ జలమార్గాల సంఖ్య 2014లో 5 నుంచి 2026లో 111కు పెరిగింది. వీటిలో 32 జలమార్గాలు ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయి.
* ప్రపంచ నౌకల రీసైక్లింగ్‌లో భారత్‌ వాటా 2024లో 30.1 శాతం నుంచి 2025లో 35.4 శాతానికి పెరిగింది. దీంతో భారత్‌ 2025లో ప్రపంచంలోనే నౌకల రీసైక్లింగ్‌కు ప్ర‌ధాన‌ కేంద్రంగా అవతరించింది. 2024లో 1.86 మిలియన్‌ స్థూల టన్నుల నౌకలను రీసైకిల్‌ చేయగా, 2025లో ఇది దాదాపు 60 శాతం పెరిగి 2.99 మిలియన్‌ స్థూల టన్నులకు చేరింది.
* ప్రపంచ బ్యాంకు ప్రచురించిన కంటైనర్‌ పోర్ట్‌ పనితీరు సూచీ–2025లో జవహర్‌లాల్‌ నెహ్రూ ఓడరేవు 22వ స్థానంలో నిలిచింది.
* భారత్‌ మారిటైమ్‌ ఇన్సూరెన్స్‌ పూల్‌(బీఎంఐపీ)ను 2026 మే 12న ప్రారంభించారు. ఇది 1.5 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల దేశీయ బీమా నిధి. ఇందులో 1.4 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల (₹12,980 కోట్లు) ప్రభుత్వ హామీ ఉంది. భారత జెండాతో నడిచే లేదా భారత నియంత్రణలోని నౌకలకు హల్‌–మెషినరీ, సరకు, రక్షణ–నష్టపరిహారం, యుద్ధ ప్రమాద బీమా సదుపాయాలను ఇది అందిస్తుంది. ఈ నిధి కింద 2026 జూలై 29 నాటికి సరకు యుద్ధ ప్రమాదాలు, నౌక యుద్ధ ప్రమాదాలకు రక్షణ కల్పిస్తూ మొత్తం 1,608 పాలసీలు జారీ చేశారు.

లాజిస్టిక్స్‌, పారిశ్రామిక సామర్థ్యానికి మరింత బలం
పరిశ్రమలు, వాణిజ్యానికి మద్దతు ఇచ్చే పరస్పర అనుసంధానిత వ్య‌వ‌స్థ‌గా మౌలిక సదుపాయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారు. గతిశక్తి నుంచి పారిశ్రామిక కారిడార్ల వరకు సమన్వయం, సామర్థ్యం, తయారీ శక్తిని మెరుగుపరచడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.
* పీఎం గతిశక్తి జాతీయ బృహత్‌ ప్రణాళిక 3,291కి పైగా డేటా లేయర్లను ఉపయోగించి 58 మంత్రిత్వ శాఖలు, విభాగాల మౌలిక సదుపాయాల ప్రణాళికను ఏకీకృతం చేసింది.
* 2026 ఆగస్టు 11 నాటికి దాదాపు ₹18.66 లక్షల కోట్ల అంచనా వ్యయంతో కూడిన 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ గ్రూప్‌ విధానం ద్వారా మదింపు చేశారు. వీటిలో 256 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు కాగా, 198 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి.
* జాతీయ లాజిస్టిక్స్‌ విధానం బహుళ రవాణా వ్యవస్థల సామర్థ్యం, సరఫరా వ్యవస్థల ఏకీకరణను బలోపేతం చేసింది.
* ప్రగతి ద్వారా ₹85 లక్షల కోట్లకు పైగా విలువైన 382 ప్రాజెక్టులను సమీక్షించి, 2,958 సమస్యలను పరిష్కరించారు.
* ఇండియా ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ బ్యాంక్‌(ఐఐఎల్‌బీ)లో 4,220కి పైగా పారిశ్రామిక పార్కులను మ్యాపింగ్‌ చేశారు.
* దేశవ్యాప్తంగా 272 ప్లగ్‌ అండ్‌ ప్లే పారిశ్రామిక పార్కులు నిర్వహణలో ఉన్నాయి.
* ఏడు పారిశ్రామిక కారిడార్ల పరిధిలో 20 పారిశ్రామిక స్మార్ట్‌ సిటీలకు ఆమోదం లభించింది.
* 100 కొత్త ప్లగ్‌ అండ్‌ ప్లే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసేందుకు భవ్య పథకానికి 2026 మార్చిలో ఆమోదం లభించింది.
* భవ్య రసాయన్‌ పథకానికి ₹3,030 కోట్ల వ్యయంతో 2026 జూలై 24న ఆమోదం లభించింది. 2026–27 నుంచి 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు ఐదేళ్లపాటు ఈ పథకాన్ని అమలు చేస్తారు.
* తయారీ రంగ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఏడు ప్రధానమంత్రి మిత్ర పార్కులను ప్రతిపాదించారు.

నీరు, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి
మౌలిక సదుపాయాల విస్తరణ ప్రజల గృహాలు, రోజువారీ అవసరాలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తోంది. కుళాయి నీరు, అందుబాటు ధరల్లో గృహాలు, పట్టణ పునరుద్ధరణ కార్యక్రమాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మెరుగైన జీవన పరిస్థితులను రూపొందిస్తున్నాయి.
* జల్‌ జీవన్‌ మిషన్‌(జేజేఎం) కింద గ్రామీణ కుళాయి నీటి కనెక్షన్లు 2019లో 3.23 కోట్ల కుటుంబాలకు అందుబాటులో ఉండగా, 2026 ఆగస్టు 10 నాటికి దాదాపు 15.91 కోట్ల కుటుంబాలకు చేరాయి.
* జల్‌ జీవన్‌ మిషన్‌ 2.0కు 2026 మార్చిలో ఆమోదం లభించింది. ₹8.69 లక్షల కోట్ల పెరిగిన వ్యయంతో ఈ కార్యక్రమాన్ని 2028 డిసెంబర్‌ వరకు పొడిగించారు.
* ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–పట్టణ(పీఎంఏవై-యూ) కింద 2026 ఆగస్టు 12 నాటికి 99.25 లక్షల గృహాల నిర్మాణం పూర్తయింది. పీఎంఏవై–యూ 2.0 కింద దాదాపు 96 శాతం గృహాలను మహిళలకు కేటాయించారు.
* ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–గ్రామీణ(పీఎంఏవై-జీ) కింద మంజూరైన 3.91 కోట్ల గృహాల్లో 3.13 కోట్ల గృహాల నిర్మాణం 2026 ఆగస్టు 12 నాటికి పూర్తయింది. ఈ పథకం కింద మంజూరైన గృహాల్లో దాదాపు 75 శాతం మహిళల పేరిట లేదా ఉమ్మడి యాజమాన్యంలో ఉన్నాయి.
* 2019లో ప్రారంభించిన స్వామిహ్‌ నిధి ద్వారా 2026 జూన్‌ నాటికి 63 వేలకు పైగా గృహాలను అందించారు. దీంతో దాదాపు 2.52 లక్షల మంది ప్రయోజనం పొందారు.
* అమృత్‌, అమృత్‌ 2.0 కింద 2015 నుంచి దాదాపు ₹2.79 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేశారు.
* స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ కింద 2026 మార్చి నాటికి ₹1,56,257 కోట్ల విలువైన 7,790 ప్రాజెక్టులు పూర్తయ్యాయి.

బలమైన, భవిష్యత్తుకు సిద్ధమైన భారత్‌ కోసం మౌలిక సదుపాయాలు
భారత్‌ మౌలిక సదుపాయాల ప్రస్థానం జాతీయాభివృద్ధి విస్తృతి, ఆకాంక్షల్లో వచ్చిన నిర్ణయాత్మక మార్పును ప్రతిబింబిస్తోంది. వేగంగా వృద్ధి చెందుతున్న నేటి ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంతో పాటు భవిష్యత్తు అవసరాలను ముందుగానే అంచనా వేయగల స్థిరమైన, అధిక సామర్థ్యం కలిగిన వ్యవస్థల నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ సమష్టిగా మరింత సమర్థమైన, సమ్మిళితమైన, భవిష్యత్తుకు సిద్ధమైన భారత్‌కు బలమైన పునాదులను నిర్మిస్తున్నాయి.

 

References

Prime Minister's Office
 

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1703457&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2133723&reg=3&lang=2

https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-implementation-of-the-pradhan-mantri-awaas-yojana-gramin-pmay-g-during-fy-2024-25-to-2028-29/

 

Cabinet
 

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2295480&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2292445&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2292433&reg=48&lang=2

 

 

Ministry of Defence

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1796961&reg=3&lang=2

 

 

Ministry of Finance

https://www.indiabudget.gov.in/doc/eb/sbe87.pdf

https://www.indiabudget.gov.in/doc/eb/sbe87.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2257087&reg=3&lang=1


Ministry of Civil Aviation
 

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2267024&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2245471&reg=1&lang=1


Ministry of Railways
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2256054&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2248962&v=1&v=1fdkfdkfmdskf&regv=s11%60&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1882109&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2209846&reg=1&lang=1


Ministry of Housing & Urban Affairs

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2223878&reg=3&lang=1

https://pmayg.dord.gov.in/netiayHome/Home.aspx

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2293938&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2231861&reg=6&lang=1

https://pmay-urban.gov.in/

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2266262&reg=48&lang=2


Ministry of Information & Broadcasting
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2098788&reg=3&lang=2


Ministry of Commerce and Industry
https://indiaindustriallandbank.gov.in/login1

https://pmgatishakti.gov.in/pmgatishakti/login

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2131526&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2225808&reg=3&lang=2

 

Ministry of Jal Shakti
https://www.jalshakti-dowr.gov.in/static/uploads/2026/02/71facba772426d78db2d39f8c0c2a34b.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2295509&reg=3&lang=1

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=158959&ModuleId=3&reg=48&lang=1


Ministry of Power
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2215761&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2157549&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2215761&reg=3&lang=2

 

Ministry of Road Transport & Highways

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2223330&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2220128&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2290493&reg=48&lang=2


Ministry of Health and Family Welfare
https://nextgen.ehospital.gov.in/dashboard/

 

Ministry of Ports, Shipping and Waterways

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2202412&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2249113&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2227665&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2297606&reg=48&lang=1


Ministry of Electronics and Information Technology (MeitY)
https://www.digilocker.gov.in/web/statistics

https://pmwani.gov.in/wani

 

Ministry of Rural Development

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2201070&reg=3&lang=1

https://pmgsy.dord.gov.in/dbweb

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2288999&reg=48&lang=2

 

Press Information Bureau

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154355&ModuleId=3&reg=3&lang=2

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2022/jul/doc20227169101.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2214872&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2278422&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2293256&reg=48&lang=1

India’s Infrastructure Transformation: From Connectivity to Capacity

 

***

(तथ्य सामग्री आईडी: 150863) आगंतुक पटल : 16


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , हिन्दी , Malayalam , Bengali , Kannada