• Sitemap
  • Advance Search
Social Welfare

భారత ట్రైబ్యునళ్ల వ్యవస్థలో సంస్కరణలు

प्रविष्टि तिथि: 12 AUG 2026 14:34 PM

ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లు–2026

 

ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లు–2026.. దేశంలో మరింత స్వతంత్రమైనపారదర్శకమైనవృత్తిపరంగా నిర్వహించే ట్రైబ్యునళ్ల వ్యవస్థను రూపొందించాలని ప్రతిపాదిస్తోంది. ట్రైబ్యునళ్లకు నియామకాలు చేపట్టడంతో పాటు వాటి పనితీరును పర్యవేక్షించే న్యాయవ్యవస్థ నేతృత్వంలోని జాతీయ ట్రైబ్యునళ్ల కమిషన్‌ ఏర్పాటుకు బిల్లు వీలు కల్పిస్తోంది. జవాబుదారీతనాన్ని బలోపేతం చేస్తూకార్యనిర్వాహక వ్యవస్థ విచక్షణాధికారాన్ని తగ్గించడం దీని లక్ష్యం. ట్రైబ్యునళ్ల పరిపాలనకు ఉమ్మడి సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా నియామకాలుపదవీకాలంపనితీరుకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు బిల్లు ప్రయత్నిస్తోంది. మద్రాస్‌ బార్‌ అసోసియేషన్‌ కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలకు ఇది కార్యరూపాన్ని ఇస్తుంది.

 

భారత ట్రైబ్యునళ్ల వ్యవస్థకు మరింత బలం

2026 ఆగస్టులో పార్లమెంట్‌ ఆమోదించిన ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లు–2026.. ట్రైబ్యునళ్ల వ్యవస్థను మరింత సమర్థంగాకార్యనిర్వాహక వ్యవస్థ నుంచి స్వతంత్రంగాపారదర్శకంగాఏకరీతిలో తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

ట్రైబ్యునళ్ల స్వతంత్రతపై సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులకు అనుగుణంగా ఈ బిల్లు రూపొందింది. మద్రాస్‌ బార్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా [(2026) 2 ఎస్‌సీసీ 1] కేసులో ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం–2021లోని కొన్ని నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. స్వతంత్ర జాతీయ ట్రైబ్యునళ్ల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది.

 

ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం–2021ను రద్దు చేయాలని 2026 బిల్లు ప్రతిపాదిస్తోంది. ప్రజలకు సేవలందించే ఈ వ్యవస్థ స్వతంత్రంగా ఉంటూనే జవాబుదారీతనంతో పనిచేసేలా కొత్త నిర్మాణాన్ని ప్రవేశపెడుతోంది.

 

బిల్లు పరిధిలోని ట్రైబ్యునళ్లువాటిని నియంత్రించే చట్టాలు

ఈ బిల్లు పరిధిలోకి వచ్చే ట్రైబ్యునళ్లుఅప్పిలేట్‌ ట్రైబ్యునళ్లుప్రాధికార సంస్థలతో పాటు వాటికి సంబంధించిన చట్టాలను బిల్లులో పేర్కొన్నారు. బిల్లు ప్రతిపాదించిన మార్పులు ఈ ట్రైబ్యునళ్లకు వర్తిస్తాయి.

క్రమ సంఖ్య

ట్రైబ్యునల్‌/అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌/ప్రాధికార సంస్థ

సంబంధిత చట్టం

1

కస్టమ్స్‌ఎక్సైజ్‌సేవా పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌

కస్టమ్స్‌ చట్టం–1962 (1962 నాటి 52వ చట్టం)

2

అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌

స్మగ్లర్లు–విదేశీ మారకద్రవ్య అక్రమ లావాదేవీలదారుల ఆస్తుల జప్తు చట్టం–1976 (1976 నాటి 13వ చట్టం)

3

కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌

పరిపాలనా ట్రైబ్యునళ్ల చట్టం–1985 (1985 నాటి 13వ చట్టం)

4

రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునళ్లు

పరిపాలనా ట్రైబ్యునళ్ల చట్టం–1985 (1985 నాటి 13వ చట్టం)

5

రైల్వే క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌

రైల్వే క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ చట్టం–1987 (1987 నాటి 54వ చట్టం)

6

సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌

భారత సెక్యూరిటీస్‌–ఎక్స్ఛేంజ్‌ బోర్డు చట్టం–1992 (1992 నాటి 15వ చట్టం)

7

రుణాల వసూలు ట్రైబ్యునల్‌

రుణాల వసూలు–దివాలా చట్టం–1993 (1993 నాటి 51వ చట్టం)

8

రుణాల వసూలు అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌

రుణాల వసూలు–దివాలా చట్టం–1993 (1993 నాటి 51వ చట్టం)

9

టెలికాం వివాదాల పరిష్కార–అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌

భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ చట్టం–1997 (1997 నాటి 24వ చట్టం)

10

విద్యుత్తు అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌

విద్యుత్తు చట్టం–2003 (2003 నాటి 36వ చట్టం)

11

సాయుధ దళాల ట్రైబ్యునల్‌

సాయుధ దళాల ట్రైబ్యునల్‌ చట్టం–2007 (2007 నాటి 55వ చట్టం)

12

జాతీయ హరిత ట్రైబ్యునల్‌

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ చట్టం–2010 (2010 నాటి 19వ చట్టం)

13

జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌

కంపెనీల చట్టం–2013 (2013 నాటి 18వ చట్టం)

14

జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌

వినియోగదారుల రక్షణ చట్టం–2019 (2019 నాటి 35వ చట్టం)

15

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పారిశ్రామిక ట్రైబ్యునల్‌

పారిశ్రామిక సంబంధాల కోడ్‌–2020 (2020 నాటి 35వ చట్టం)

16

ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌

ఆదాయపు పన్ను చట్టం–2025 (2025 నాటి 30వ చట్టం)

 

కొత్త జాతీయ ట్రైబ్యున‌ళ్ల క‌మిష‌న్‌

కొత్త జాతీయ ట్రైబ్యునళ్ల కమిషన్‌(ఎన్‌టీసీ) ఏర్పాటు ద్వారా ట్రైబ్యునళ్ల వ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించాలని 2026 బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. న్యాయవ్యవస్థలోని ఉన్నతస్థాయి సభ్యులకు ఈ కమిషన్‌లో ఆధిక్యం ఉంటుంది. ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం–2021 ప్రకారం కీలక నియామకాలుసేవా నిబంధనల బాధ్యతలు నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం స్థానంలో కమిషన్‌ పనిచేస్తుంది.

 

కమిషన్‌ నిర్మాణం

కమిషన్‌లో కింది సభ్యులు ఉంటారు:

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఛైర్‌పర్సన్‌గా ఉంటారు.

నలుగురు సభ్యులు ఉంటారు:

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లేదా న్యాయమూర్తిగా పనిచేసిన ఇద్దరు న్యాయ సభ్యులు

ప్రజా పరిపాలనఆర్థికంన్యాయశాస్త్రంఅకౌంటెన్సీబ్యాంకింగ్‌నిర్వహణ లేదా సాంకేతిక రంగాల్లో కనీసం 25 ఏళ్ల అనుభవం కలిగిన ఇద్దరు సాంకేతిక సభ్యులు

 

 

కమిషన్‌ ఛైర్‌పర్సన్‌న్యాయ సభ్యులను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నియమిస్తుంది. అయితేఈ నియామకాలకు ముందు భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించడం తప్పనిసరి.

 

కమిషన్‌ విధులు

ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లు–2026 ప్రకారం జాతీయ ట్రైబ్యునళ్ల కమిషన్‌ పలు కీలక బాధ్యతలను నిర్వహిస్తుంది:

ఎంపికల నిర్వహణ: సెర్చ్‌–క‌మ్‌-సెల‌క్ష‌న్‌ కమిటీల ద్వారా ట్రైబ్యునళ్ల ఛైర్‌పర్సన్లుసభ్యుల ఖాళీల భర్తీకి ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది.

పనితీరు సమీక్ష: ట్రైబ్యునళ్ల పనితీరును పర్యవేక్షించికేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సిన వార్షిక నివేదికలను సిద్ధం చేస్తుంది.

విచారణల పర్యవేక్షణ: ట్రైబ్యునల్‌ సభ్యులపై వచ్చిన ఫిర్యాదుల విచారణను పర్యవేక్షిస్తుంది.

సమాచార నిర్వహణ: 16 ట్రైబ్యునళ్లకు సంబంధించిన కేసుల సమాచారం మొత్తాన్ని భద్రపరిచే పోర్టల్‌గా జాతీయ ట్రైబ్యునళ్ల సమాచార గ్రిడ్‌ను అభివృద్ధి చేసినిర్వహిస్తుంది.

 

పదవీకాలం

కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ లేదా సభ్యుడు ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకుఏది ముందైతే అప్పటివరకు పదవిలో కొనసాగుతారు.

ట్రైబ్యునల్‌ సభ్యుడు ఐదేళ్లు లేదా 67 ఏళ్ల వయసు వచ్చే వరకుఏది ముందైతే అప్పటివరకు పదవిలో కొనసాగుతారు.

 

గత సేవపనితీరును ఎంపిక ప్రక్రియలో పరిగణనలోకి తీసుకొని పునర్నియామకం చేపట్టేందుకు కూడా ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుంది.

 

కొత్త సచివాలయం

జాతీయ ట్రైబ్యునళ్ల కమిషన్‌కు పరిపాలనా సహాయక వ్యవస్థగా సచివాలయం పనిచేస్తుంది. భారత ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. ఇతర అధికారులుఉద్యోగుల సంఖ్యవారి సేవా నిబంధనలను నియమాల ద్వారా నిర్దేశిస్తారు. కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సాధారణపరిపాలనా పర్యవేక్షణ కింద సచివాలయం పనిచేస్తుంది. ఇది కింది విధులను నిర్వహిస్తుంది:

 

నిపుణుల జాబితా: అభ్యర్థులను మదింపు చేసేందుకు సంబంధిత రంగాల నిపుణులను గుర్తించిజాబితాలో చేర్చుతుంది.

* సిఫార్సులు: సెర్చ్‌-క‌మ్‌-సెల‌క్ష‌న్‌ కమిటీ సిఫార్సులను మూడు రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది.

పరిపాలనా సహకారం: కమిషన్‌కు పరిపాలనా సహాయం అందించినిర్దేశించిన విధులను నిర్వహిస్తుంది.

వార్షిక నివేదికల తయారీ: కమిషన్‌ కార్యకలాపాలకు సంబంధించిన పూర్తివాస్తవ వివరాలతో ఏటా నివేదికను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది.

 

సెర్చ్‌-క‌మ్‌-సెల‌క్ట్‌ కమిటీలు

వివిధ ట్రైబ్యునళ్ల ఛైర్‌పర్సన్లుసభ్యుల ఎంపికను సెర్చ్‌-క‌మ్‌-సెల‌క్ట్‌ కమిటీల ద్వారా చేపడతారు. అభ్యర్థులను మదింపు చేసి ట్రైబ్యునల్‌ పదవులకు నియామకాలపై సిఫార్సులు చేయడం ఈ కమిటీల బాధ్యత.

 

ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లు–2026లోని సెక్షన్‌ 13 ప్రకారం సెర్చ్‌-క‌మ్‌-సెల‌క్ట్‌ కమిటీ నిర్మాణం ఇలా ఉంటుంది:

 

ట్రైబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌ ఎంపిక కోసం

1. జాతీయ ట్రైబ్యునళ్ల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌

2. కమిషన్‌ సాంకేతిక సభ్యుడు

3. కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నామినేట్‌ చేసే హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి

4. కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసే భారత ప్రభుత్వ కార్యదర్శి. రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌ నియామకం విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యుడిగా ఉంటారు.

5. అభ్యర్థులను మదింపు చేసిన జాబితాలోని ఇద్దరు నిపుణులు

6. కమిషన్‌ కార్యదర్శి—సభ్య కార్యదర్శి

 

ట్రైబ్యునల్‌ సభ్యుడి ఎంపిక కోసం:

1. జాతీయ ట్రైబ్యునళ్ల కమిషన్‌ న్యాయ సభ్యుడు—కమిటీ ఛైర్‌పర్సన్‌

2. కమిషన్‌ సాంకేతిక సభ్యుడు

3. కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నామినేట్‌ చేసే హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి

4. కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసే భారత ప్రభుత్వ కార్యదర్శి. రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ సభ్యుడి నియామకం విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యుడిగా ఉంటారు.

5. అభ్యర్థులను మదింపు చేసిన జాబితాలోని ఇద్దరు నిపుణులు

6. కమిషన్‌ కార్యదర్శి—సభ్య కార్యదర్శి

 

కమిటీ ఛైర్‌పర్సన్‌కు నిర్ణాయక ఓటు ఉంటుంది. సభ్య కార్యదర్శినిపుణ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. కమిటీ కింది విధులను నిర్వహిస్తుంది:

 

అభ్యర్థుల ఎంపిక: ఛైర్‌పర్సన్లుసభ్యుల ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది.

అభ్యర్థుల సిఫార్సు: ప్రతి ఖాళీకి ఒక అర్హత కలిగిన అభ్యర్థినినిరీక్షణ జాబితా కోసం మరో అభ్యర్థిని సిఫార్సు చేస్తుంది.

గత పనితీరు పరిశీలన: పునర్నియామకం కోరే అభ్యర్థుల గత సేవపనితీరును పరిగణనలోకి తీసుకుంటుంది.

సకాలంలో నియామకాలకు సహకారం: సిఫార్సులను సచివాలయం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. సచివాలయం వాటిని మూడు రోజుల్లోగా ప్రభుత్వానికి తెలియజేయాలి. ప్రభుత్వం సిఫార్సును పరిశీలించి మూడు నెలల్లోగా నియామకం చేపట్టాలి.

 

ప్రతిపాదిత జాతీయ ట్రైబ్యునళ్ల కమిషన్‌లో న్యాయ సభ్యులకు మెజారిటీ ఉంటుంది. సెర్చ్‌-క‌మ్‌-సెల‌క్ష‌న్‌ కమిటీలకు కూడా న్యాయ సభ్యులే నేతృత్వం వహిస్తారు. న్యాయ సభ్యుడైన ఛైర్‌పర్సన్‌కు నిర్ణాయక ఓటు ఉంటుంది. కమిటీ పేర్లతో కూడిన జాబితాకు బదులు ఒకే అభ్యర్థిని సిఫార్సు చేస్తుంది. దీనివల్ల కార్యనిర్వాహక వ్యవస్థ విచక్షణాధికారం పరిమితమైఎంపిక ప్రక్రియలో న్యాయవ్యవస్థ ప్రభావం బలోపేతమవుతుంది.

 

ఆర్థికపరిపాలనా స్వతంత్రత

ట్రైబ్యునళ్లకు మరింత ఆర్థికపరిపాలనా స్వయం ప్రతిపత్తి కల్పించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ వ్యవస్థ కింద ఒక్కో ట్రైబ్యునల్‌ నిధులుసిబ్బందిప్రాంగణాలకు సంబంధించిన అవసరాలను గుర్తిస్తుంది. కమిషన్‌ సచివాలయం ఈ అంచనాలను సమీకరిస్తుంది. మొత్తం కేటాయింపు అవసరాలను నిర్ణయించేందుకు కమిషన్‌ వాటిని నిష్పాక్షిక ప్రణాళిక ఆధారంగా మదింపు చేస్తుంది.

 

పార్లమెంట్‌ ఆమోదించిన కేటాయింపులకు అనుగుణంగా అవసరమైన గ్రాంట్లను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఆర్థిక జవాబుదారీతనంపారదర్శకత కోసం భారత కంప్ట్రోలర్ ఆండ్ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) కమిషన్‌ ఖాతాలను తనిఖీ చేసినివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను పార్లమెంట్‌ ఉభయ సభల ముందు ఉంచుతుంది.

 

మరింత స్వతంత్ర ట్రైబ్యునళ్ల వ్యవస్థ దిశగా

ట్రైబ్యునళ్ల వ్యవస్థలో న్యాయ స్వతంత్రతపారదర్శకతను నెలకొల్పాలని ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లు–2026 లక్ష్యంగా పెట్టుకుంది. న్యాయ స్వతంత్రతను బలోపేతం చేస్తూనే పార్లమెంటరీ పర్యవేక్షణ ద్వారా ఈ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండేలా సమతుల్యతను పాటిస్తోంది.

 

ప్రతిపాదిత జాతీయ ట్రైబ్యునళ్ల కమిషన్‌ నియామకాలుపనితీరు సమీక్షక్రమశిక్షణ పర్యవేక్షణ కోసం శాశ్వత సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. న్యాయవ్యవస్థ నేతృత్వంలోని ఎంపిక కమిటీలు నియామక ప్రక్రియలో న్యాయపరమైన ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేస్తాయి. నిపుణుల మదింపు వృత్తిపరమైన సామర్థ్యానికి మరింత ప్రాధాన్యం ఇస్తుంది. ఐదేళ్ల పదవీకాలం స్థిరత్వాన్ని పెంచుతుంది.

 

విభిన్నమైనకార్యనిర్వాహక వ్యవస్థ ఆధారిత ట్రైబ్యునల్‌ నిబంధనల నుంచి క్రమబద్ధమైన సంస్థాగత వ్యవస్థ దిశగా మార్పునకు ఈ బిల్లు నాంది పలుకుతోంది. సుప్రీంకోర్టు మద్రాస్‌ బార్‌ అసోసియేషన్‌ కేసుల్లో నిర్దేశించిన న్యాయ సూత్రాలకు అనుగుణంగా మరింత స్వతంత్రంగాపారదర్శకంగావృత్తిపరమైన నిర్వహణతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయడం దీని ప్రధాన లక్ష్యం.

 

References:

 

https://sansad.in/ls

https://prsindia.org/billtrack/prs-products/the-tribunal-system-in-india

https://www.indiacode.nic.in/handle/123456789/16901?view_type=browse

Reforming India’s Tribunal System

***

(तथ्य सामग्री आईडी: 150875) आगंतुक पटल : 7


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , Bengali , Kannada , हिन्दी , Assamese , Malayalam