Economy
భారత్‌లో ఆర్థిక సమ్మిళితత్వం: ప్రతి పౌరుడికీ బ్యాంకింగ్ సేవలు, ప్రతి కుటుంబానికీ సాధికారత
प्रविष्टि तिथि:
12 AUG 2026 16:23 PM
పరిచయం
సమాన అభివృద్ధి సాధించాలన్న భారత్ దార్శనికతలో ఆర్థిక సమ్మిళితత్వం కీలకంగా నిలుస్తోంది. గత దశాబ్ద కాలంలో బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, రుణాలు, బీమా, పింఛన్లు, పెట్టుబడి అవకాశాలను భారత్ విస్తృతంగా అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పౌర కేంద్రీకృత సంస్కరణలు ఈ పరివర్తనకు ఊతమిచ్చాయి. ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా కల్పించే దశను దాటి, వ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థలో ప్రజలు చురుగ్గా పాల్గొనే స్థాయికి భారత్ చేరుకుంది. ఈ పరివర్తన కోట్లాది కుటుంబాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలకు సాధికారత కల్పించింది.
భారత్‌లో ఆర్థిక సమ్మిళితత్వం, కీలక సూచికలు
దేశవ్యాప్తంగా ఆర్థిక సేవలు, మౌలిక సదుపాయాలు, ప్రజల భాగస్వామ్యాన్ని విస్తరించడంలో సాధించిన గణనీయ పురోగతిని పలు సూచికలు వెల్లడిస్తున్నాయి.

ఆర్బీఐ ఆర్థిక సమ్మిళితత్వ(ఎఫ్ఐ) సూచీ
ఆర్థిక సేవల అందుబాటు, వినియోగం, నాణ్యత ఆధారంగా ఆర్థిక సమ్మిళితత్వ స్థాయిని భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్థిక సమ్మిళితత్వ సూచీ(ఎఫ్ఐ ఇండెక్స్) కొలుస్తుంది. దేశవ్యాప్తంగా వ్యవస్థీకృత ఆర్థిక సేవల విస్తరణలో పురోగతిని తెలిపే సమగ్ర సూచికగా ఇది పనిచేస్తుంది. మూడు అంశాల్లోనూ విస్తృత పురోగతిని ప్రతిబింబిస్తూ ఈ సూచీ 2017 మార్చిలో 43.4 నుంచి 2026 మార్చిలో 70.0కు పెరిగింది.
ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఫిన్‌డెక్స్
ఆర్థిక సమ్మిళితత్వానికి సంబంధించిన సమాచారాన్ని అందించే ప్రపంచంలోని ప్రధాన వనరుగా గ్లోబల్ ఫిన్‌డెక్స్ డేటాబేస్ నిలుస్తోంది. వివిధ ఆర్థిక వ్యవస్థల్లో వయోజనులు ఆర్థిక సేవలను ఎలా పొందుతున్నారు, ఎలా వినియోగిస్తున్నారనే అంశాలను ఇది కొలుస్తుంది. ఆర్థిక సమ్మిళితత్వంలో భారత్ సాధించిన విశేష పురోగతిని గ్లోబల్ ఫిన్‌డెక్స్–2025 వెల్లడించింది. 2011 నుంచి బ్యాంకు ఖాతాలు కలిగిన వయోజనుల శాతం 89కు చేరింది. గత దశాబ్దంలో వ్యవస్థీకృత ఆర్థిక సేవల అందుబాటు, ఖాతాల చురుకైన వినియోగంలో గణనీయ పురోగతిని ఇది సూచిస్తోంది.
బ్యాంకింగ్ సేవల నెట్వర్క్
భారత వ్యవస్థీకృత బ్యాంకింగ్ వ్యవస్థకు బ్యాంకు శాఖలు పునాదిగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా పొదుపు, రుణాలు, ఇతర ఆర్థిక సేవలను ఇవి అందిస్తున్నాయి. 2026 జూలై 17 నాటికి భారత్‌లో 1.81 లక్షలకు పైగా బ్యాంకు శాఖలు ఉన్నాయి.
బ్యాంకు శాఖలు, బిజినెస్ కరస్పాండెంట్లు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) కేంద్రాల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయి. 2026 మార్చి 6 నాటికి దేశంలోని 99.92 శాతం గ్రామాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ కేంద్రం అందుబాటులో ఉంది.
1.65 లక్షలకు పైగా పోస్టాఫీసుల ద్వారా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ చివరి మైలు వరకు బ్యాంకింగ్ సేవలను బలోపేతం చేస్తోంది. 2026 జూలై 17 నాటికి 5.57 లక్షల గ్రామాలు, పట్టణాల్లో 11 కోట్లకు పైగా వినియోగదారులకు సేవలందిస్తోంది.
బ్యాంకింగ్ సేవలు లేని లేదా పరిమితంగా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో బిజినెస్ కరస్పాండెంట్లు ఇంటి వద్దకే సేవలను చేరవేస్తున్నారు. 2026 జూలై 17 నాటికి దేశవ్యాప్తంగా 17.36 లక్షలకు పైగా బిజినెస్ కరస్పాండెంట్లు ఈ సేవలకు మద్దతు అందిస్తున్నారు.
ఆర్థిక సమ్మిళితత్వానికి మూలస్తంభాలు
భారత్‌లో ఆర్థిక సమ్మిళితత్వ వ్యవస్థ పరస్పర అనుసంధానిత విధానాలు, సంస్థాగత మూలస్తంభాలపై ఆధారపడి ఉంది. వ్యవస్థీకృత ఆర్థిక సేవలు అందరికీ అందుబాటులోకి రావడంతో పాటు ప్రజలు వాటిని సమర్థంగా వినియోగించేలా ఇవి ప్రోత్సహిస్తున్నాయి.
అందరికీ బ్యాంకింగ్
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై)
* 2014లో ప్రారంభించిన పీఎంజేడీవై ద్వారా బ్యాంకు ఖాతా లేని ప్రతి వయోజనుడికీ కనీస నిల్వ అవసరం లేని ప్రాథమిక పొదుపు బ్యాంకు ఖాతా అందుబాటులోకి వచ్చింది.
* పొదుపు, నగదు బదిలీ, రుణాలు, బీమా, పింఛను, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ(డీబీటీ) సేవలు ఈ ఖాతా ద్వారా లభిస్తాయి.
* పీఎంజేడీవై ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డు, ప్రమాద బీమా రక్షణ అందిస్తారు. 2018 ఆగస్టు 28 తర్వాత తెరిచిన ఖాతాలకు ₹2 లక్షలు, ఆ తేదీకి ముందు తెరిచిన ఖాతాలకు ₹1 లక్ష ప్రమాద బీమా వర్తిస్తుంది. అర్హులైన ఖాతాదారులు ₹10 వేల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని కూడా పొందవచ్చు.
* ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(పీఎంఎస్బీవై), అటల్ పెన్షన్ యోజన(ఏపీవై)లో నమోదు కావడంతో పాటు ముద్ర రుణాలు పొందేందుకు ఈ పథకం వీలు కల్పిస్తుంది.

జామ్ త్రయం
* ఆర్థిక సమ్మిళితత్వాన్ని బలోపేతం చేసేందుకు జన్‌ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ అనుసంధానాన్ని జామ్ త్రయం ఏకీకృతం చేస్తుంది.
* ప్రభుత్వ ప్రయోజనాలను పారదర్శకంగా, సమర్థంగా అందించేందుకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీకి ఇది వీలు కల్పిస్తుంది. సంక్షేమ పథకాల అమలులో నిధుల లీకేజీని తగ్గించి, నకిలీ లబ్ధిదారులను తొలగిస్తూ మధ్యవర్తుల పాత్రను పరిమితం చేస్తుంది.
* వ్యవస్థీకృత బ్యాంకింగ్ సేవల అందుబాటును జామ్ త్రయం బలోపేతం చేయడంతో పాటు డిజిటల్ ఆర్థిక సేవలపై నమ్మకాన్ని పెంచుతోంది.
2026 ఆగస్టు 10 నాటికి
|
మొత్తం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ
|
పథకాల సంఖ్య
|
భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు
|
|
₹52,89,019 కోట్లు
|
320
|
56
|
అందరికీ సామాజిక భద్రత
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజేజేబీవై)
* 2015లో ప్రారంభించిన పీఎంజేజేబీవై ఏటా పునరుద్ధరించుకునే జీవిత బీమా పథకం. 18–50 ఏళ్ల వయసు వారికి ₹2 లక్షల జీవిత బీమా రక్షణ కల్పిస్తుంది.
* ఏటా ₹436 ప్రీమియంతో ఈ పథకం అందుబాటులో ఉంది. చందాదారుడి బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియం స్వయంచాలకంగా మినహాయిస్తారు.
* బీమా చేసిన వ్యక్తి మరణిస్తే కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తుంది.
* ప్రమాదవశాత్తు మరణానికి తక్షణమే బీమా రక్షణ వర్తిస్తుంది. ఇతర కారణాలతో మరణిస్తే 30 రోజుల నిరీక్షణ వ్యవధి ఉంటుంది.
2026 జూన్ 30 నాటికి
|
మొత్తం నమోదులు
|
అందిన క్లెయిమ్‌లు
|
చెల్లించిన క్లెయిమ్‌లు
|
|
27.78 కోట్లు
|
11,31,505
|
10,97,751
|
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(పీఎంఎస్బీవై)
* 2015లో ప్రారంభించిన పీఎంఎస్బీవై కూడా ఏటా పునరుద్ధరించుకునే ప్రమాద బీమా పథకం. 18–70 ఏళ్ల వయసు కలిగిన పొదుపు బ్యాంకు ఖాతాదారులకు ఇది వర్తిస్తుంది.
* ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తి వైకల్యానికి ₹2 లక్షలు, పాక్షిక వైకల్యానికి ₹1 లక్ష బీమా రక్షణ కల్పిస్తుంది.
* ఏటా ₹20 ప్రీమియంతో బీమా అందుబాటులో ఉంది. అనుసంధానిత బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియం ఆటో-డెబిట్ అవుతుంది.
2026 జూన్ 30 నాటికి
|
మొత్తం నమోదులు
|
అందిన క్లెయిమ్‌లు
|
చెల్లించిన క్లెయిమ్‌లు
|
|
58.66 కోట్లు
|
2,56,526
|
1,89,057
|
అటల్ పింఛను యోజన(ఏపీవై)
2015లో ప్రారంభించిన ఏపీవై.. అసంఘటిత రంగ కార్మికుల కోసం చందా ఆధారిత పింఛను పథకం.
60 ఏళ్ల వయసు పూర్తయిన తర్వాత నెలకు ₹1,000 నుంచి ₹5,000 వరకు హామీతో కూడిన పింఛను అందిస్తుంది.
పథకంలో చేరినప్పుడు చందాదారుడి వయసు, ఎంచుకున్న పింఛను మొత్తాన్ని బట్టి చందాను నిర్ణయిస్తారు.
బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా పథకంలో నమోదు చేసుకోవచ్చు. దీంతో అల్పాదాయ కార్మికులకు పింఛను రక్షణ విస్తరిస్తోంది.
2026 జూన్ 30 నాటికి
|
మొత్తం చందాదారులు
|
పురుషులు
|
మహిళలు
|
ట్రాన్స్‌జెండర్ చందాదారులు
|
|
9.29 కోట్లు
|
4.72 కోట్లు (50.8%)
|
4.56 కోట్లు (49.16%)
|
26,599 (0.028%)
|
సమ్మిళిత రుణ సదుపాయం
ప్రధానమంత్రి ముద్ర యోజన
* 2015లో ప్రారంభించిన ప్రధానమంత్రి ముద్ర యోజన కింద తయారీ, వాణిజ్యం, సేవలు, అనుబంధ వ్యవసాయ కార్యకలాపాల్లోని కార్పొరేటేతర, వ్యవసాయేతర సూక్ష్మ, చిన్న సంస్థలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా ₹20 లక్షల వరకు రుణాలు అందిస్తారు.
* ఆదాయ సముపార్జన, ఉపాధి కల్పనను ప్రోత్సహించే విస్తృత కార్యకలాపాలకు ముద్ర రుణాలు లభిస్తాయి.
* సంస్థ వృద్ధి దశ ఆధారంగా శిశు, కిశోర్, తరుణ్, తరుణ్ ప్లస్ అనే నాలుగు రుణ విభాగాలు ఉన్నాయి.
2026 మార్చి 27 నాటికి
|
మంజూరైన రుణాలు
|
మంజూరైన మొత్తం
|
|
57.79 కోట్లు
|
₹40.07 లక్షల కోట్లు
|
పీఎం స్వనిధి
* వీధి వ్యాపారులపై ప్రత్యేకంగా దృష్టి సారించిన, ప్రభుత్వ రుణ హామీ మద్దతుతో కూడిన తొలి తరహా సూక్ష్మ రుణ కార్యక్రమం పీఎం స్వనిధి.
* ఎలాంటి పూచీకత్తు లేకుండా మూడు దశల్లో వరుసగా ₹15 వేలు, ₹25 వేలు, ₹50 వేల రుణాలు అందిస్తుంది.
అర్హులైన వీధి వ్యాపారులకు వడ్డీ రాయితీ, రుణ హామీ మద్దతు లభిస్తాయి.
2026 మే నాటికి
|
మొత్తం లబ్ధిదారులు
|
పంపిణీ చేసిన రుణాలు
|
మొత్తం రుణ విలువ
|
|
75.5 లక్షలకు పైగా
|
1.12 కోట్లకు పైగా
|
₹17,800 కోట్లకు పైగా
|
కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ)
* బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా రైతులకు సకాలంలో, తగినంత రుణ సదుపాయాన్ని కిసాన్ క్రెడిట్ కార్డు అందిస్తుంది.
* ఏటీఎం సదుపాయం కలిగిన డెబిట్ కార్డు, ఒక్కసారి పత్రాల సమర్పణ, అవసరానికి అనుగుణంగా నగదు ఉపసంహరణ సదుపాయాలు లభిస్తాయి.
* పంట సాగు, కోత అనంతర అవసరాలు, మార్కెటింగ్, వ్యవసాయ క్షేత్ర నిర్వహణ, కుటుంబ ఖర్చులు, అనుబంధ కార్యకలాపాలకు రుణం అందిస్తుంది.
2026 ఆగస్టు 10 నాటికి కిసాన్ క్రెడిట్ కార్డు/వడ్డీ రాయితీ పథకం దరఖాస్తులు
|
వాణిజ్య బ్యాంకులు
|
గ్రామీణ బ్యాంకులు
|
సహకార బ్యాంకులు
|
|
763.6 లక్షలు
|
368.6 లక్షలు
|
1,242.0 లక్షలు
|
జన్ సమర్థ్
* రుణ అనుసంధానిత ప్రభుత్వ పథకాల కోసం రూపొందించిన ఏకీకృత డిజిటల్ వేదిక జన్ సమర్థ్.
* లబ్ధిదారులను రుణదాతలతో నేరుగా అనుసంధానిస్తూ ప్రభుత్వ మద్దతుతో కూడిన రుణ సదుపాయాన్ని సులభతరం చేస్తుంది.
* ఈ వేదికలో 16 రుణ పథకాలు, ఎనిమిది రుణ విభాగాలు, 300కు పైగా రుణదాతలు నమోదయ్యారు.
2026 జూన్ 1 నాటికి
|
దరఖాస్తుల సంఖ్య
|
దరఖాస్తుల మొత్తం
|
|
54.10 లక్షలు
|
₹3,00,951 కోట్లు
|
డిజిటల్ ఆర్థిక సమ్మిళితత్వం
యూపీఐ
* ఆర్థిక సమ్మిళితత్వం, డిజిటల్ లావాదేవీలకు ఊతమిస్తూ భారత్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు యూపీఐ వెన్నెముకగా అవతరించింది.
* 2016–17 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాల మధ్య లావాదేవీల సంఖ్య దాదాపు 12 వేల రెట్లు, లావాదేవీల విలువ దాదాపు 4 వేల రెట్లు పెరిగింది.
* లావాదేవీల సంఖ్య ఆధారంగా ప్రపంచంలోనే అతిపెద్ద తక్షణ చెల్లింపుల వ్యవస్థగా యూపీఐని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) గుర్తించింది. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల రంగంలో భారత్ నాయకత్వాన్ని ఇది చాటుతోంది.
2026 జూలై నాటికి
|
లావాదేవీల సంఖ్య
|
లావాదేవీల విలువ
|
యూపీఐలో సేవలందిస్తున్న బ్యాంకులు
|
|
2,365.8 కోట్లు
|
₹29,87,880.49 కోట్లు
|
741
|

ఆర్థిక అక్షరాస్యత
జాతీయ ఆర్థిక విద్యా కేంద్రం(ఎన్సీఎఫ్ఈ)
* ఆర్థిక విద్యకు సంబంధించిన జాతీయ వ్యూహం కింద సమాజంలోని అన్ని వర్గాల్లో ఆర్థిక విద్య, అవగాహనను ఈ కేంద్రం ప్రోత్సహిస్తుంది.
* ఆర్థిక అక్షరాస్యతను బలోపేతం చేసేందుకు సదస్సులు, కార్యశాలలు, శిక్షణ కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలను నిర్వహిస్తుంది.
* ఆర్థిక మార్కెట్లు, డిజిటల్ ఆర్థిక సేవలపై నిర్దిష్ట వర్గాల అవసరాలకు అనుగుణంగా విద్యా సామగ్రిని కూడా రూపొందిస్తుంది.
2026 ఆగస్టు 10 నాటికి
|
నిర్వహించిన కార్యశాలలు
|
లబ్ధిదారులు
|
పురుషులు
|
మహిళలు
|
|
31,082
|
10,68,571
|
3,73,999 (35%)
|
6,94,572 (65%)
|
వయోజనుల కోసం ఆర్థిక విద్యా కార్యక్రమం(ఎఫ్ఈపీఏ)
* వయోజనుల్లో ఆర్థిక అవగాహనను పెంపొందించేందుకు జాతీయ ఆర్థిక విద్యా కేంద్రం 2019 సెప్టెంబర్‌లో ఎఫ్ఈపీఏను ప్రారంభించింది.
* రైతులు, మహిళా సంఘాలు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాలు, ఉద్యోగులు, నైపుణ్యాభివృద్ధి శిక్షణార్థులను ఈ కార్యక్రమం పరిధిలోకి తీసుకొచ్చారు.
* ఆర్థిక విద్యకు సంబంధించిన జాతీయ వ్యూహానికి అనుగుణంగా ప్రత్యేక దృష్టి జిల్లాలపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
2026 ఆగస్టు 10 నాటికి
|
నిర్వహించిన కార్యశాలలు
|
లబ్ధిదారులు
|
|
19,266
|
6,48,512
|
దేశవ్యాప్త ఆర్థిక సమ్మిళితత్వ సంతృప్తస్థాయి ప్రచారం
* 2.70 లక్షల గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు ఆర్థిక సమ్మిళితత్వాన్ని విస్తరించేందుకు నాలుగు నెలల ప్రచారాన్ని 2025 జూలై 1న ప్రారంభించారు.
* ఈ ప్రచారంలో గ్రామాలు, పట్టణాల్లో 2.67 లక్షలకు పైగా శిబిరాలను నిర్వహించారు.
* 5.19 కోట్ల కేవైసీ పునఃధ్రువీకరణలు, 1.20 కోట్ల నామినేషన్ నవీకరణలను పూర్తి చేశారు. పీఎంజేజేబీవై/పీఎంఎస్బీవై కింద 92,066 క్లెయిమ్‌లను పరిష్కరించారు.
2025 అక్టోబర్ 31 నాటికి
|
ప్రారంభించిన పీఎంజేడీవై ఖాతాలు
|
పీఎంజేజేబీవై నమోదులు
|
పీఎంఎస్బీవై నమోదులు
|
ఏపీవై నమోదులు
|
|
1.11 కోట్లు
|
1.40 కోట్లు
|
2.86 కోట్లు
|
44.43 లక్షలు
|
అందుబాటు నుంచి సాధికారత దిశగా
ప్రజలకు బ్యాంకు ఖాతాలు అందించే దశ నుంచి ఆర్థిక వ్యవస్థలో అర్థవంతమైన భాగస్వామ్యాన్ని కల్పించే స్థాయికి భారత్ ఆర్థిక సమ్మిళితత్వ ప్రస్థానం చేరుకుంది. బ్యాంకుల బలమైన నెట్వర్క్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాలు వ్యవస్థీకృత ఆర్థిక సేవలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చాయి. పీఎంజేడీవై, జామ్ త్రయం, సామాజిక భద్రత, సమ్మిళిత రుణ సదుపాయాలు సమాజంలోని విభిన్న వర్గాలకు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచాయి. డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక అక్షరాస్యత ప్రజలు వ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థలో విశ్వాసంతో పాల్గొనేలా చేస్తున్నాయి. సమ్మిళిత వృద్ధికి మద్దతు ఇచ్చే మరింత అందుబాటులోని, స్థిరమైన, సమగ్ర ఆర్థిక వ్యవస్థను ఈ కార్యక్రమాలు సమష్టిగా నిర్మిస్తున్నాయి.
References
Ministry of Finance
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2293812®=48&lang=1&noshow=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2246857®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2293812®=48&lang=1&noshow=1
https://pmjdy.gov.in/scheme
https://pmjdy.gov.in/account
https://dbtbharat.gov.in/
https://dfs.dashboard.nic.in/DashboardF.aspx
https://www.jansamarth.in/home
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2188526®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2257087®=3&lang=1
NPCI
https://www.npci.org.in/product/upi/product-statistics
Ministry of Communications
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2138023®=48&lang=2
Ministry of Road Transport & Highways
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2086611®=48&lang=2
Ministry of Agriculture and Farmers Welfare
https://fasalrin.gov.in/
Ministry of Electronics and Information Technology
https://socialwelfare.vikaspedia.in/viewcontent/social-welfare/financial-inclusion/financial-literacy/national-centre-for-financial-education-ncfe?lgn=en
World Bank
https://www.worldbank.org/en/publication/globalfindex
PIB Backgrounders
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?ModuleId=3&NoteId=154980&lang=1®=3
https://www.pib.gov.in/FactsheetDetails.aspx?Id=149258®=48&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=158149&ModuleId=2®=20&lang=8
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?id=158322&NoteId=158322&ModuleId=3®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2266920®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2285236®=3&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=158466&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=158056&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2269253®=3&lang=1
Others
https://newsonair.gov.in/countrys-improvised-financial-inclusion-index-shows-continued-progress-in-financial-services-rbi/
Financial Literacy App by NCFE
https://ncfe.org.in/
Financial Inclusion in India: Banking Every Citizen, Empowering Every Household
****
(तथ्य सामग्री आईडी: 150892)
आगंतुक पटल : 130
Provide suggestions / comments