Rural Prosperity
విస్తరిస్తున్న అభివృద్ధి పరిధి
प्रविष्टि तिथि:
13 AUG 2026 12:21 AM
గ్రామీణ, గిరిజన సముదాయాల సంక్షేమం, సమ్మిళిత ప్రగతి, సాధికారతకు భరోసా
భారత అభివృద్ధి ప్రస్థానం గ్రామీణ, గిరిజన సముదాయాల మారుమూల ప్రాంతాలకూ విస్తరిస్తూ ప్రజలకు సేవలు, అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాలను అందిస్తోంది. మౌలిక సేవలు, విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల నుంచి జీవనోపాధి, నైపుణ్యాలు, విద్య, ఆర్థిక భద్రత వరకు సమ్మిళిత వృద్ధికి పునాదులను విస్తరించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మహిళలు, గిరిజన సముదాయాలు, బలహీన వర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం ద్వారా గౌరవప్రద జీవనం, సాధికారతకు మార్గాలు మరింత బలోపేతమవుతున్నాయి. విస్తృత అవకాశాలు, పటిష్ఠ సముదాయాలు, సమాన అభివృద్ధి ద్వారా ఈ కార్యక్రమాలు గ్రామీణ భారత ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి.
సంక్షేమ పథకాల అమలు నుంచి వికేంద్రీకృత భాగస్వామ్యాల దిశగా
* గ్రామ పంచాయతీలకు ప్రత్యక్ష ఆర్థిక బదిలీలు పెరిగాయి. 15వ ఆర్థిక సంఘం (2021–26) కింద ₹2.36 లక్షల కోట్లుగా ఉన్న ఈ మొత్తాన్ని 16వ ఆర్థిక సంఘం (2026–31) కింద ₹4.35 లక్షల కోట్లకు పెంచారు.
* గ్రామీణాభివృద్ధికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులు 2016–17లో ₹87,765 కోట్ల నుంచి 2026–27లో ₹2.73 లక్షల కోట్లకు పెరిగాయి.
* గిరిజన వ్యవహారాలకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులు 2016–17లో ₹4,826 కోట్ల నుంచి 2026–27లో ₹15,421.97 కోట్లకు పెరిగాయి.
గౌరవప్రద జీవనానికి పునాదులు: అందరికీ అందుబాటులోకి ప్రాథమిక అవసరాలు
జల్ జీవన్ మిషన్
* ఇళ్లకు కుళాయి నీటి సదుపాయం 2019 ఆగస్టులో 3.23 కోట్ల నుంచి 2026 ఆగస్టు 12 నాటికి 15.91 కోట్లకు పైగా పెరిగింది.
* 2026 ఆగస్టు 12 నాటికి హర్ ఘర్ జల్ కార్యక్రమం కింద 2.89 లక్షల గ్రామాలు నూటికి నూరు శాతం కుళాయి నీటి సదుపాయం సాధించినట్లు నివేదించాయి.
స్వచ్ఛ భారత్ అభియాన్–గ్రామీణ్
* 2026 ఆగస్టు 12 నాటికి 12.19 కోట్లకు పైగా వ్యక్తిగత గృహ మరుగుదొడ్లను నిర్మించారు.
* 2019లో భారత్‌ను బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా ప్రకటించారు.
* 2018–19 ఆర్థిక సంవత్సరంలో 14 గోబర్‌ధన్ బయోగ్యాస్ ప్లాంట్లు పనిచేయగా, 2026 ఆగస్టు 11 నాటికి వాటి సంఖ్య 1,288 దాటింది.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన
* 2026 ఆగస్టు 12 నాటికి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలకు 10.57 కోట్లకు పైగా ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు అందించారు.
* భారత్‌లో మొత్తం ఎల్‌పీజీ కనెక్షన్ల సంఖ్య 2014లో 14.52 కోట్ల నుంచి 2026లో 33.39 కోట్లకు పెరిగింది.
గ్రామాలన్నింటికీ విద్యుదీకరణ
* ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య) కింద విద్యుత్ కనెక్షన్ కోరుకున్న కుటుంబాలన్నింటికీ దేశవ్యాప్తంగా 2019 మార్చి నాటికి నూటికి నూరు శాతం విద్యుత్ సదుపాయం కల్పించారు.
* దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన కింద 2025 నాటికి గ్రామాలన్నింటికీ విద్యుత్ సదుపాయం కల్పించారు.
ఆయుష్మాన్ భారత్
* 2026 ఆగస్టు 12 నాటికి 45.51 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేశారు.
* 2026 ఆగస్టు 12 నాటికి 96.43 కోట్ల ఆభా ఖాతాలను రూపొందించారు.
* 2026 ఆగస్టు 12 నాటికి 1.86 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు సేవలందిస్తున్నాయి.
అందరికీ ఆహార భద్రత
* ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద 81.35 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాలు అందుతున్నాయి.
* 2026 జూలై 29 నాటికి ప్రజా పంపిణీ వ్యవస్థ కింద 99.8 శాతం చౌకధరల దుకాణాలను ఆధార్ ఆధారిత పంపిణీకి అనుగుణంగా ఆటోమేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు.
* 2026 జూలై 29 నాటికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రేషన్ కార్డులను నూటికి నూరు శాతం డిజిటలీకరించారు.
* 2026 జూలై 29 నాటికి ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు కింద 221 కోట్లకు పైగా పోర్టబిలిటీ లావాదేవీలు నమోదయ్యాయి.

సమగ్ర శిక్షా అభియాన్ (సర్వశిక్షా అభియాన్)
* 2018–19 నుంచి 2025–26 మధ్య 4,073 పాఠశాలలను ఉన్నతీకరించారు. 1.49 లక్షల ఐసీటీ, డిజిటల్ కార్యక్రమాలను అమలు చేశారు. మరో 25 వేల పాఠశాలలను నైపుణ్య విద్య పరిధిలోకి తీసుకొచ్చారు.
* 97.3 శాతం పాఠశాలల్లో బాలికలకు వినియోగయోగ్యమైన పారిశుద్ధ్య సదుపాయాలు ఉన్నాయి.
* ప్రాథమిక పాఠశాల స్థాయిలో బాలికల చదువు మానివేత రేటు 2013–14లో 4.6 శాతం నుంచి 2025–26లో 0.1 శాతానికి తగ్గింది. మాధ్యమిక పాఠశాల స్థాయిలో ఈ రేటు 2013–14లో 14.5 శాతం నుంచి 2025–26లో 8 శాతానికి తగ్గింది.
ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, మెరుగైన నమోదు స్థాయులు
* ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ వర్గాల పరిధిలో లేని అభ్యర్థులకు 2019లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించారు. ఈ నిర్ణయంతో సాధారణ వర్గంలోని ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతోంది.
* 2025–26లో స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్) ప్రాథమిక స్థాయిలో 89.4గా, మాధ్యమిక స్థాయిలో 81.5గా నమోదైంది. ఉన్నత మాధ్యమిక స్థాయిలో జీఈఆర్ 2014–15లో 46.4 నుంచి 2025–26లో 61.7కు పెరిగింది.
బేటీ బచావో–బేటీ పఢావో
* మాధ్యమిక స్థాయిలో (9–10 తరగతులు) బాలికల స్థూల నమోదు నిష్పత్తి 2014–15లో 75.5 శాతం నుంచి 2025–26లో 83.4 శాతానికి పెరిగింది.
కస్తూర్బా బాలికా విద్యాలయాలు, పీఎం ఈ-విద్య
* మంజూరైన పాఠశాలల సంఖ్య 2014–15లో 3,609 నుంచి 2024–25లో 5,639కు పెరిగింది. 2024–25 నాటికి 5,133 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు పనిచేస్తున్నాయి.
* విద్యార్థినుల నమోదు 2014–15లో 3.52 లక్షల నుంచి 2024లో 7.11 లక్షలకు పెరిగింది.
* స్వయం పోర్టల్(భారతదేశ మాసీవ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్ ప్లాట్‌ఫార్మ్)లో 2026 ఆగస్టు 12 నాటికి 6.5 కోట్లకు పైగా నమోదులు జరిగాయి.
* 2026 ఆగస్టు 12 నాటికి దీక్ష వేదికలో 2.35 కోట్ల మంది నమోదిత యూజర్లు ఉన్నారు.
అభివృద్ధికి వెన్నెముక: మౌలిక సదుపాయాలు, అనుసంధానం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్

* పీఎంఏవై–జీ కింద 2026 ఆగస్టు 12 నాటికి 3.91 కోట్లకు పైగా ఇళ్లకు మంజూరు ఇవ్వగా, 3.13 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది.
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన
* 2026 జూన్ నాటికి అర్హత కలిగిన ఆవాస ప్రాంతాల్లో 99.6 శాతానికి అన్ని కాలాల్లో రాకపోకలకు అనువైన రహదారి సదుపాయం కల్పించారు.
* పూర్తయిన రహదారుల పొడవు 2000 మే నుంచి 2014 మే మధ్య 3.86 లక్షల కిలోమీటర్లు కాగా, 2014 మే నుంచి 2026 ఆగస్టు 12 మధ్య 4.13 లక్షల కిలోమీటర్లకు పెరిగింది.
* 2014 మే నుంచి 2026 ఆగస్టు 12 మధ్య పూర్తయిన వంతెనల సంఖ్య 484 నుంచి 10,404కు పెరిగింది.
గ్రామ పంచాయతీల డిజిటలీకరణ
* భారత్‌నెట్ కింద 2026 మే నాటికి 2.19 లక్షల గ్రామ పంచాయతీలకు అనుసంధానం కల్పించారు.
* ఈ-గ్రామ్‌స్వరాజ్ ద్వారా 2026 జూన్ నాటికి ₹3 లక్షల కోట్లకు పైగా చెల్లింపులను నిర్వహించారు.
* 2026 జూన్ నాటికి 1.28 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలు సమావేశాల సారాంశాలను రూపొందించేందుకు సభాసార్ వేదికను వినియోగిస్తున్నాయి.
శ్రేయస్సుకు మార్గాలు: జీవనోపాధి, నైపుణ్యాలు, ఆర్థిక భద్రత

దీనదయాళ్ అంత్యోదయ యోజన–జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై–ఎన్‌ఆర్‌ఎల్‌ఎం)
* 2026 ఆగస్టు 12 నాటికి 10.19 కోట్ల కుటుంబాలను 94.46 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సమీకరించారు.
* 2026 జూలై 29 నాటికి 3.46 కోట్ల మంది లఖ్‌పతి దీదీలు రూపుదిద్దుకున్నారు.
పథకాల ప్రయోజనాలను చివరి మైలుకు చేరవేయడంలో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల పాత్ర
* ప్రస్తుతం 9 లక్షలకు పైగా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు వ్యవసాయం, బ్యాంకింగ్, బీమా, పోషకాహారం వంటి అంశాల్లో సేవలందిస్తున్నారు.
* వీరిలో 50,548 మందికి పైగా బ్యాంక్ సఖీలు, 1.91 లక్షల కృషి సఖీలు, 2,012 మంది మత్స్య సఖీలు, 1.70 లక్షల పశు సఖీలు ఉన్నారు.
స్వయం సహాయక మహిళా ఔత్సాహికుల మార్ట్(షీ మార్ట్) ప్రారంభం
* కోటి మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో కేంద్ర బడ్జెట్ 2026–27లో ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు.
* స్వయం సహాయక సంఘాల వ్యవస్థలోని మహిళల కోసం సముదాయాల యాజమాన్యంలోని రిటైల్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం దీని లక్ష్యం.
దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన
* శిక్షణ పొందిన అభ్యర్థుల సంఖ్య 2014–15లో 43,038 నుంచి 2026 ఆగస్టు 11 నాటికి 18.45 లక్షలకు పెరిగింది.
* ఉపాధి పొందిన అభ్యర్థుల సంఖ్య 2014–15లో 21,446 నుంచి 2026 ఆగస్టు 11 నాటికి 12.35 లక్షలకు పెరిగింది.
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన
* పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2026 జూన్ వరకు 1.64 కోట్లకు పైగా యువత నైపుణ్య శిక్షణ పొందారు.
వికసిత్ భారత్–రోజ్‌గార్, ఆజీవికా మిషన్ (గ్రామీణ్)కు హామీ
* 2006–07 నుంచి 2013–14 ఆర్థిక సంవత్సరాల మధ్య మొత్తం 1,660 కోట్ల పనిదినాలు లభించగా, 2014–15 నుంచి 2024–25 మధ్య ఈ సంఖ్య 3,029 కోట్లకు పెరిగింది.
* మహిళల భాగస్వామ్యం 2013–14లో 48 శాతం నుంచి 2024–25లో 58.19 శాతానికి పెరిగింది.
ఈ-శ్రమ్ పోర్టల్
* నమోదుల సంఖ్య 2021 డిసెంబరులో 14.40 కోట్ల నుంచి 2026 ఆగస్టు 12 నాటికి 31.87 కోట్లకు పెరిగింది.
పీఎం విశ్వకర్మ యోజన
* 2026 ఆగస్టు 12 నాటికి 30 లక్షలకు పైగా సంప్రదాయ చేతివృత్తుల నిపుణులు నమోదు చేసుకున్నారు.
* 2026 ఆగస్టు 12 నాటికి 24.32 లక్షల మంది చేతివృత్తుల నిపుణులు నైపుణ్య శిక్షణ పొందగా, 17.70 లక్షల మందికి పనిముట్ల కిట్లు అందాయి.
పీఎం స్వనిధి
* లబ్ధిదారుల సంఖ్య 2021 నవంబరులో 26.37 లక్షల నుంచి 2026 ఆగస్టు 12 నాటికి 78.17 లక్షలకు పెరిగింది.
* 2026 ఆగస్టు 12 నాటికి ₹18,971.18 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. లబ్ధిదారుల్లో 46 శాతం మంది మహిళలు.
ప్రధానమంత్రి ముద్రా యోజన
* మంజూరైన మొత్తం రుణాల సంఖ్య 2016లో 3.49 కోట్ల నుంచి 2026 జూలై నాటికి 59.14 కోట్లకు పైగా పెరిగింది.
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన
* లబ్ధిదారుల సంఖ్య 2015 ఆగస్టులో 17.9 కోట్ల నుంచి 2026 ఆగస్టు 12 నాటికి 58.90 కోట్లకు పెరిగింది.
సామాజిక భద్రత పరిధి విస్తరణ
* జాతీయ పింఛను వ్యవస్థ కింద లబ్ధిదారుల సంఖ్య 2016–17లో 1.05 కోట్ల నుంచి 2025–26లో 2.17 కోట్లకు పెరిగింది.
* అటల్ పెన్షన్ యోజన కింద లబ్ధిదారుల సంఖ్య 2016–17లో 48.80 లక్షల నుంచి 2026 జూన్ నాటికి 9.29 కోట్లకు పెరిగింది.
* 2026 జూలై వరకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద 27.90 కోట్ల మందికి బీమా రక్షణ కల్పించారు.
* 2026 జూలై 1 నాటికి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద 58.78 కోట్ల మందికి బీమా రక్షణ కల్పించారు.
* 2026 జూలై నాటికి ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పథకం కింద అసంఘటిత రంగానికి చెందిన 54 లక్షల మందికి పైగా కార్మికులు నమోదు చేసుకున్నారు.
సమగ్ర కార్యక్రమాలతో గిరిజనాభివృద్ధికి వేగం
ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం-జన్‌మన్)
* 2026 ఆగస్టు 5 నాటికి 540 వన్‌ధన్ వికాస్ కేంద్రాలకు మంజూరు ఇచ్చారు. వీటి ద్వారా ప్రత్యేకంగా బలహీన గిరిజన సమూహాలకు చెందిన 46,042 మంది ప్రయోజనం పొందుతున్నారు.
ప్రధానమంత్రి జనజాతి వికాస్ మిషన్(పీఎం-జేవీఎం)
* ఈ పథకం కింద 2026 ఆగస్టు నాటికి 4,172 వన్‌ధన్ వికాస్ కేంద్రాలకు మంజూరు ఇవ్వగా, 12.48 లక్షల మంది గిరిజనులు ప్రయోజనం పొందుతున్నారు.

ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్(పీఎం-జుగా)
గిరిజన జనాభా అధికంగా ఉన్న గ్రామాలు, ప్రత్యేకంగా బలహీన గిరిజన సమూహాల ఆవాసాల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న లోటుపాట్లను పరిష్కరించేందుకు 17 మంత్రిత్వ శాఖల కృషిని ఈ కార్యక్రమం సమన్వయం చేస్తుంది. పీఎం జుగా కింద విడివిడిగా కార్యక్రమాలు చేపట్టే విధానం నుంచి రంగాలు, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో మిషన్ పద్ధతిలో సేవలు అందించే దిశగా ప్రాధాన్యం పెరిగింది. గత 12 ఏళ్లలో—
* 7.60 లక్షల గిరిజన గృహాల నిర్మాణం పూర్తయింది. 28,303 గిరిజన గ్రామాలకు తాగునీటి సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
* 59,812 గిరిజన కుటుంబాలు, ప్రభుత్వ సంస్థలకు విద్యుత్ సదుపాయం కల్పించారు. గిరిజన ప్రాంతాల్లో 657 అంగన్‌వాడీ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
* గిరిజన విద్యార్థుల కోసం 692 వసతిగృహాలకు కూడా మంజూరు ఇచ్చారు.
ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన(పీఎం-అజయ్)
* 2026 ఆగస్టు 12 నాటికి షెడ్యూల్డ్ కులాలకు చెందిన 4.16 లక్షలకు పైగా గృహాలను నిర్మించారు. 4.17 లక్షలకు పైగా ఎస్సీ కుటుంబాలను ఆరోగ్య రక్షణ పథకాల పరిధిలోకి తీసుకొచ్చారు. 3.57 లక్షలకు పైగా ఎస్సీ కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి.
* 2026 ఆగస్టు 12 నాటికి 17,578 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించారు.
ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలు(ఈఎంఆర్ఎస్)
* పనిచేస్తున్న పాఠశాలల సంఖ్య 2014–15లో 129 నుంచి 2026 ఆగస్టు 12 నాటికి 511కు పెరిగింది.
* 2026 ఆగస్టు 12 నాటికి ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల్లో 1.68 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
పీఎం–యశస్వి
* 2024–25 ఆర్థిక సంవత్సరంలో 20.61 లక్షల మంది విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలు, 24.53 లక్షల మంది విద్యార్థులు పోస్ట్-మెట్రిక్ ఉపకార వేతనాలు పొందారు.
షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు ఉపకార వేతనాలు
* 2024 ఏప్రిల్ నుంచి 2026 ఆగస్టు 12 మధ్య ప్రీ-మెట్రిక్ ఉపకార వేతన పథకం ద్వారా 28.99 లక్షల మందికి పైగా గిరిజన విద్యార్థులు ప్రయోజనం పొందారు.
* ఎస్టీ విద్యార్థుల జాతీయ పరిశోధన ఉపకార వేతన పథకం 2025–26లో 2,961 మంది పరిశోధక విద్యార్థులకు మద్దతు అందించింది. లబ్ధిదారుల్లో 56 శాతం మంది మహిళలు.
యువ ప్రతిభావంతుల ఉన్నత విద్యకు ఉపకార వేతన పథకం(శ్రేయస్)
* ఎస్సీ విద్యార్థులకు అత్యున్నత స్థాయి విద్య పథకం ద్వారా 2025–26లో 8,571 మంది విద్యార్థులు ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీలు, ఎయిమ్స్ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో చదివే అవకాశం పొందారు.
యాంత్రిక పారిశుద్ధ్య వ్యవస్థకు జాతీయ కార్యాచరణ(నమస్తే)
* 2026 జూలై నాటికి 89,915 మంది మురుగునీటి కాలువలు, సెప్టిక్ ట్యాంకుల కార్మికులతో పాటు 2.81 లక్షల మందికి పైగా వ్యర్థాలను సేకరించే కార్మికుల వివరాలను ధ్రువీకరించారు.
డీనోటిఫైడ్ తెగల ఆర్థిక సాధికారత పథకం(సీడ్)
* 2025–26లో 4,485 మంది డీనోటిఫైడ్ తెగల విద్యార్థుల విద్యా సాధికారతకు ₹26.75 కోట్లు పంపిణీ చేశారు.
* ఆరోగ్య విభాగం కింద 2025–26లో డీనోటిఫైడ్ తెగల కుటుంబాలకు 73,569 ఆయుష్మాన్ భారత్ కార్డులు జారీ చేశారు.
References
Ministry of Jal Shakti
https://gobardhan.sbm.gov.in/
https://ejalshakti.gov.in/jjmreport/jjmindia.aspx
https://sbm.gov.in/sbmgdashboard/statesdashboard.aspx
Ministry of Housing & Urban Affairs
https://pmsvanidhi.mohua.gov.in/Home/PMSDashboard
Ministry of Health & Family Welfare
https://dashboard.nha.gov.in/public/
https://dashboard.abdm.gov.in/abdm/
https://aam.mohfw.gov.in/
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2294278®=48&lang=1
Ministry of Consumer Affairs, Food & Public Distribution
https://sansad.in/getFile/lsapps/loksabhaquestions/annex/188/AU1711_fUMnpm.pdf?source=lsapps
https://dfpd.gov.in/pradhan-mantri-garib-kalyan-anna-yojana/en
Ministry of Finance
https://sansad.in/getFile/annex/271/AS91_36800U.pdf?source=pqars
https://pmjdy.gov.in/
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2287200®=1&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2287200®=48&lang=2
Ministry of Education
https://diksha.gov.in/data/
https://swayam.gov.in/
https://dashboard.udiseplus.gov.in/#
https://sansad.in/getFile/loksabhaquestions/annex/1711/AS444.pdf?source=pqals
PIB Backgrounders
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=158809&ModuleId=3®=3&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=157341&ModuleId=3®=3&lang=1
Ministry of Rural Development
https://lokos.dord.gov.in/home#/
https://pmgsy.dord.gov.in/dbweb
https://x.com/MoRD_GoI/status/2063930187511922850
https://dashboard.dord.gov.in/dashboardnew/mgnrega.aspx
https://pmayg.gov.in/netiay/PBIDashboard/PMAYGDashboard.aspx
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2297790®=48&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2288999®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2290658®=48&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2112680®=48&lang=2
Ministry of Panchayati Raj
https://x.com/mopr_goi/status/2067496574595575823
Ministry of Labour & Employment
https://eshram.gov.in//dashboard
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2293891®=48&lang=1
Ministry of MSMEs
https://pmvishwakarma.gov.in/
Ministry of Tribal Affairs
https://pmagy.gov.in/
https://nests.tribal.gov.in/
https://dashboard.tribal.gov.in/
https://dbttribal.gov.in/PrePostRPT.aspx?Ret=VGB==
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2286362®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2209488®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2253348®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2294712®=6&lang=1
Ministry of Petroleum & Natural Gas
https://www.pmuy.gov.in/index.aspx
Niti Aayog
https://niti.gov.in/sites/default/files/2026-05/School-Education-System-in-India.pdf
Click here to see PDF
PIB Research
***
(तथ्य सामग्री आईडी: 150939)
आगंतुक पटल : 108
Provide suggestions / comments