• Sitemap
  • Advance Search
Economy

వ్యాపార అనుకూల భారతదేశ‌ నిర్మాణం

प्रविष्टि तिथि: 13 AUG 2026 16:55 PM

సులభతర వ్యాపార నిర్వహణకు ప్రోత్సాహం, సంస్థలకు సాధికారత
 


వ్యాపార‌ వృద్ధికి అనుకూల వాతావరణం
భారత్‌ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్న వేళ స్వావలంబన, స్థిరత్వం, వృద్ధితో కూడిన ఆర్థిక వ్యవస్థకు పునాదులను దేశం నిరంతరం బలోపేతం చేస్తోంది. నిబంధనల అమలు భారాన్ని తగ్గించడం, పారదర్శకతను పెంచడం, ఔత్సాహికతను ప్రోత్సహించడం, అన్ని పరిమాణాల సంస్థలకు మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టింది.

డిజిటల్ సింగిల్‌-విండో వ్యవస్థలు, సరళీకృత సంస్థల ఏర్పాటు ప్రక్రియలు, విస్తృత మార్కెట్ సౌల‌భ్యం, మెరుగైన ఆర్థిక సహాయం, విశ్వాస ఆధారిత నియంత్రణ ద్వారా సులభతర వ్యాపార నిర్వహణను ఈ ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్తున్నాయి.

భారతదేశ‌ వ్యాపార వాతావరణంలో సంస్కరణలు
డిజిటల్ సింగిల్‌-విండో అనుమతుల నుంచి భారీ స్థాయి నియంత్రణ ప్రక్షాళన వరకు అంచనా వేయగలిగే, వ్యాపారాలకు సహకరించే వాతావరణాన్ని సృష్టించడంపై సంస్కరణలు దృష్టి సారిస్తున్నాయి.

* నేష‌న‌ల్‌ సింగిల్ విండో సిస్ట‌మ్‌ (ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌): వ్యాపార అవసరాలకు అనుగుణంగా అవసరమైన అనుమతులను గుర్తించి, దరఖాస్తు చేసుకోవడంలో మార్గదర్శనం చేసే సింగిల్ విండో డిజిటల్‌ వేదిక ఇది. 32 కేంద్ర మంత్రిత్వ శాఖలు, 34 రాష్ట్రాలకు సంబంధించిన అనుమతులను ఈ వ్యవస్థ సమీకరిస్తోంది. 686కు పైగా కేంద్ర అనుమతులు, 7,498 రాష్ట్ర అనుమతులను పొందేందుకు అవకాశం కల్పిస్తోంది. 2021లో ప్రారంభమైనప్పటి నుంచి 2025 నవంబరు నాటికి ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌ 8.29 లక్షలకు పైగా అనుమతులను మంజూరు చేసింది.
* స్టార్టప్‌ ఇండియా (2016): ఔత్సాహికులకు సహాయం అందిస్తూ పటిష్ఠ అంకుర సంస్థల వ్యవస్థను నిర్మించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఉద్యోగాల కోసం వెతికే వారికి బదులుగా ఉద్యోగాలను సృష్టించే దేశంగా భారత్‌ను మార్చాలని ఇది ఆకాంక్షిస్తోంది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం గుర్తించిన అంకుర సంస్థల సంఖ్య 2016లో 502 నుంచి 2026 ఆగస్టు 12 నాటికి 2.47 లక్షలకు పైగా పెరిగింది.


* స్పైస్‌+ ఫారం (2020): వెబ్‌ ఆధారిత ఈ ఫారం మూడు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 11 సేవలను సమీకరిస్తోంది. పేరు న‌మోదు, సంస్థ ఏర్పాటు, డైరెక్టర్‌ గుర్తింపు సంఖ్య కేటాయింపు, పాన్‌ జారీ, టాన్‌ జారీ, ఈపీఎఫ్‌వో నమోదు, ఈఎస్‌ఐసీ నమోదు, వృత్తి పన్ను నమోదు, బ్యాంకు ఖాతా ప్రారంభం, జీఎస్టీఐఎన్‌ కేటాయింపు వంటి 10 ముఖ్యమైన ప్రక్రియలను ఇది ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. దిల్లీలో కొత్తగా ఏర్పాటయ్యే అన్ని కంపెనీలకు దుకాణాలు, వాణిజ్య సంస్థల తొలి నమోదును కూడా అందిస్తోంది. దీంతో ప్రక్రియల భారం, సమయం, వ్యాపార సంస్థల నిబంధనల అమలు ఖర్చులు తగ్గుతున్నాయి.
* ఎంసీఏ21 వీ3: భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన ఎంసీఏ21 ప్రాజెక్టు భారత కార్పొరేట్‌ రంగంలో పారదర్శకతను గణనీయంగా పెంచుతోంది. కంపెనీలు, పరిమిత బాధ్యత భాగస్వామ్య సంస్థల నమోదుతో పాటు సంస్థల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి స్థాయి సేవలకు ఈ వేదిక ఉపయోగపడుతోంది. 2021–2025 మధ్య ఈ వేదిక 3.84 కోట్ల దాఖలాలను నిర్వహించగా, 3.33 కోట్ల ఫైలింగ్స్‌కు స్వయంచాలక ప్రక్రియ ద్వారా ఆమోదం లభించింది.
* ఉద్యం నమోదు (2020): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఉచితంగా, కాగిత రహితంగా, స్వీయ ప్రకటన ఆధారంగా నమోదు చేసుకొనే వ్యవస్థను ఇది అందిస్తోంది. ఉద్యం పోర్టల్‌లో ఎంఎస్‌ఎంఈ నమోదులు 2020 అక్టోబరులో 0.10 లక్షల నుంచి 2026 ఆగస్టు 13 నాటికి 9.27 లక్షలకు పైగా పెరిగాయి.
* వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బీఆర్ఏపీ): 2015లో ప్రారంభించిన ఈ ప్రణాళిక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిబంధనలను సరళీకరించడం, పారదర్శకతను మెరుగుపరచడం ద్వారా సులభతర వ్యాపార నిర్వహణను ప్రోత్సహిస్తోంది. ఏకగవాక్ష అనుమతులు, భూమి, కార్మిక వ్యవహారాలు, తనిఖీలు, పన్నులు, పర్యావరణ అనుమతులు తదితర రంగాల్లోని సంస్కరణలు ఇందులో ఉన్నాయి.

సంస్థల వృద్ధికి ఆర్థిక వనరుల అందుబాటు
రుణ హామీలు, డిజిటల్‌ రుణాలు, వాణిజ్య బకాయిలకు ఆర్థిక సహాయం ద్వారా ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలకు వ్యవస్థీకృత ఆర్థిక వనరుల అందుబాటు విస్తరిస్తోంది.

* ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై): కార్పొరేట్‌ పరిధిలో లేని, వ్యవసాయేతర ఆదాయ కార్యకలాపాలకు సహాయం అందించేందుకు ఎలాంటి పూచీకత్తు లేకుండా ₹20 లక్షల వరకు రుణాలను అందిస్తూ ఆర్థిక వనరుల అందుబాటులోని అంతరాన్ని 2015లో ప్రారంభించిన ఈ పథకం తగ్గిస్తోంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2026 మార్చి 27 నాటికి 57.79 కోట్ల రుణాల ద్వారా ₹40.07 లక్షల కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసింది.
* క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌: పూచీకత్తు లేదా మూడో వ్యక్తి హామీ లేకుండానే సూక్ష్మ, చిన్న సంస్థలు రుణాలు పొందేందుకు ఇది వీలు కల్పిస్తోంది. ₹10 కోట్ల వరకు రుణ సదుపాయాలకు సహాయం అందిస్తోంది. 2026 మార్చి నాటికి సూక్ష్మ, చిన్న సంస్థల రుణ హామీ నిధి ట్రస్టు ₹13.67 లక్షల కోట్ల సంచిత హామీ పరిధికి ఆమోదం తెలిపింది. దీని ద్వారా 1.41 కోట్ల హామీలు ప్రయోజనం పొందాయి.
* క్రెడిట్ అసెస్‌మెంట్ మోడ‌ల్ (సీఏఎం): ప్రభుత్వ రంగ బ్యాంకులు 2025లో ప్రారంభించిన ఈ నమూనా స్వయంచాలక ఎంఎస్‌ఎంఈ రుణ మదింపు కోసం డిజిటల్‌గా సేకరించిన, ధ్రువీకరించగల సమాచారాన్ని వినియోగిస్తుంది. 2025 ఏప్రిల్‌–డిసెంబరు మధ్య ఈ నమూనా కింద ₹52,300 కోట్లకు పైగా విలువైన 3.96 లక్షలకు పైగా ఎంఎస్‌ఎంఈ దరఖాస్తులకు రుణాలు మంజూరు చేశారు.
* ట్రెడ్స్ (ట్రేడ్ రిసీవ‌బుల్స్ డిస్కౌంటింగ్ సిస్ట‌మ్‌): పలు ఆర్థిక సంస్థల ద్వారా ఎంఎస్‌ఎంఈల వాణిజ్య బకాయిలకు ఆర్థిక సహాయం, డిస్కౌంటింగ్‌ సదుపాయం కల్పించే ఎలక్ట్రానిక్‌ వేదికే ట్రెడ్స్‌. ఇన్‌వాయిస్‌ డిస్కౌంటింగ్‌కు రుణ హామీ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల లావాదేవీల్లో దీని వినియోగం వంటి ట్రెడ్స్‌ను బలోపేతం చేసే చర్యలను కేంద్ర బడ్జెట్‌ 2026–27 ప్రతిపాదించింది. ఈ వేదికలో ఇన్‌వాయిస్‌ డిస్కౌంటింగ్‌ 2021–22లో ₹40 వేల కోట్ల నుంచి 2025–26లో ₹3.47 లక్షల కోట్లకు పెరిగింది.

నిబంధనల అమలు నుంచి విశ్వాస ఆధారిత పాలన దిశగా
కేవలం ప్రక్రియలను డిజిటలీకరించే దశను దాటి అనవసర నిబంధనలను తగ్గించడం, చిన్న నేరాలను నేరపూరిత పరిధి నుంచి తొలగించడం, వ్యాపార సంస్థలకు మరింత స్పష్టత కల్పించే దిశగా భారత నియంత్రణ సంస్కరణలు సాగుతున్నాయి.

జన్‌ విశ్వాస్ (నిబంధనల సవరణ) చట్టం–2026: 23 మంత్రిత్వ శాఖల పరిధిలోని 79 కేంద్ర చట్టాల్లో 717 నిబంధనలను నేరపూరిత పరిధి నుంచి తొలగిస్తూ 784 నిబంధనలను ఈ చట్టం సవరిస్తోంది. చిన్న, సాంకేతిక ఉల్లంఘనలకు నేర బాధ్యతను తగ్గించడం ద్వారా విశ్వాస ఆధారిత పాలనను పటిష్ఠం చేస్తోంది.
నియంత్రణ నిబంధనల అమలు భారం: నిబంధనలను సరళీకరించడం, అనవసర అవసరాలను తగ్గించడం ద్వారా అమలు ఖర్చులను తగ్గిస్తూ సులభతర వ్యాపార నిర్వహణను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. 2025 నవంబరు నాటికి 47 వేలకు పైగా నిబంధనల అమలు అవసరాలను తగ్గించారు. వీటిలో 16,108 నిబంధనలను సరళీకరించారు, 22,287 నిబంధనలను డిజిటలీకరించారు, 4,458 నిబంధనలను నేరపూరిత పరిధి నుంచి తొలగించారు, అనవసరంగా మారిన 4,270 నిబంధనలను రద్దు చేశారు.
జీఎస్టీ 2.0: 2017లో ప్రవేశపెట్టిన జీఎస్టీ పలు పరోక్ష పన్నుల స్థానంలో ఏకీకృత జాతీయ పన్ను వ్యవస్థను తీసుకొచ్చింది. 2025 సెప్టెంబరులో ప్రకటించిన సంస్కరణలు పన్ను రేట్లను మరింత హేతుబద్ధీకరించాయి. సరళీకృత రెండు రేట్ల నిర్మాణం దిశగా అడుగులు వేయడం ద్వారా నిబంధనల అమలు, లావాదేవీల ఖర్చులను తగ్గించాయి. నమోదిత పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2017లో దాదాపు 60 లక్షల నుంచి 2026 జూలై 31 నాటికి 1.68 కోట్లకు పైగా పెరిగింది. ఆర్థిక వ్యవస్థ మరింత వ్యవస్థీకృతమవుతున్నట్లు ఇది సూచిస్తోంది.
ముఖాముఖి ప్రమేయం లేని మదింపు పథకం: పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారుల మధ్య ప్రత్యక్ష సంప్రదింపులను ఈ పథకం తొలగిస్తోంది. కేసుల స్వయంచాలక ఎంపిక, యాదృచ్ఛిక కేటాయింపు, పన్ను చెల్లింపుదారులతో సమాచార మార్పిడి కోసం కేంద్ర విభాగం ద్వారా కార్యాలయాలకు పలుమార్లు వెళ్లాల్సిన అవసరం, వేచి ఉండే సమయం తగ్గుతున్నాయి. ప్రామాణికమైన, నిష్పాక్షికమైన, స్థిరమైన పన్ను మదింపులను ఈ విధానం ప్రోత్సహిస్తోంది. దీంతో పన్ను నిబంధనల అమలు మరింత సమర్థంగా, పారదర్శకంగా మారుతోంది.

భారత వ్యాపార సంస్థలకు మార్కెట్ల విస్తరణ
భారత డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాలు వ్యాపార సంస్థలకు కొత్త మార్కెట్లను అందుబాటులోకి తెస్తున్నాయి. లాజిస్టిక్స్‌, బహుళ రవాణా అనుసంధానంలో పెట్టుబడులు వస్తువులను మరింత వేగంగా, సమర్థంగా తరలించేందుకు వ్యాపార సంస్థలకు తోడ్పడుతున్నాయి.

* గవర్నమెంట్‌ ఈ-మార్కెట్‌ప్లేస్ (జెమ్‌) (2016): ప్రజా సేకరణను డిజిటలీకరిస్తూ విభిన్న వ్యాపార సంస్థలకు మార్కెట్‌ అందుబాటును జెమ్‌ విస్తరిస్తోంది. 2026 ఆగస్టు 6 నాటికి 1.37 లక్షలకు పైగా ప్రభుత్వ కొనుగోలు సంస్థలను దాదాపు 25 లక్షల మంది విక్రేతలు, సేవా సంస్థలతో జెమ్‌ అనుసంధానిస్తోంది. ₹20 లక్షల కోట్లకు పైగా విలువైన‌ కొనుగోళ్లకు ఈ వేదిక సహకరించింది. 2025–26లో 75 లక్షలకు పైగా ఆర్డర్లను పూర్తి చేశారు.

 


* పీఎం గతిశక్తి (2021): ఏకీకృత డిజిటల్‌ వేదిక ద్వారా సమగ్ర మౌలిక సదుపాయాల ప్రణాళిక, బహుళ రవాణా అనుసంధానానికి ఇది వీలు కల్పిస్తోంది. 3,291 సమాచార పొరలతో 58 మంత్రిత్వ శాఖలు/విభాగాలు, 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను ఈ వేదిక ఒకే చోటకు తీసుకొస్తోంది. 2026 ఫిబ్రవరి నాటికి నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ గ్రూప్‌ ₹16.10 లక్షల కోట్ల విలువైన 352 ప్రాజెక్టులను మదింపు చేసింది. వీటిలో 201 ప్రాజెక్టులకు మంజూరు ఇవ్వగా, 167 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. తగిన ప్రాంతాలను గుర్తించడం, పెట్టుబడులను ప్రణాళికాబద్ధంగా చేపట్టడం, ముందస్తుగానే బహుళ రవాణా అనుసంధానం, మౌలిక సదుపాయాలను పొందడంలో ఈ కార్యక్రమం వ్యాపార సంస్థలకు సహకరిస్తోంది. సులభతర వ్యాపార నిర్వహణను కూడా బలోపేతం చేస్తోంది.
ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (2022): బహిరంగ డిజిటల్‌ వాణిజ్య వ్యవస్థలను ప్రోత్సహిస్తూ వ్యక్తిగత వేదికలపై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తోంది. 616కు పైగా నగరాల్లో 7.64 లక్షలకు పైగా విక్రేతలు ఈ వ్యవస్థలో ఉన్నారు. విస్తృతమైన, మరింత సమ్మిళిత మార్కెట్‌ అందుబాటుకు ఇది సహకరిస్తోంది.

ప్రపంచ వ్యాపార రంగంలో భారత్‌ ఉనికికి మరింత బలం
మెరుగైన లాజిస్టిక్స్‌, డిజిటల్‌ వాణిజ్య సదుపాయాలు, బలమైన దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలతో ఎగుమతుల ప్రోత్సాహాన్ని అనుసంధానించడం ద్వారా ప్రపంచ మార్కెట్లలో భారత్‌ తన స్థానాన్ని పటిష్ఠం చేసుకుంటోంది.

ఎగుమతుల ప్రోత్సాహక మిషన్‌ (2025): ఎంఎస్‌ఎంఈలు, తొలిసారి ఎగుమతులు చేపట్టేవారు, అధిక కార్మిక అవసరం కలిగిన రంగాలు, దేశంలోని అంతర్గత ప్రాంతాలు, తక్కువ ఎగుమతి సాంద్రత కలిగిన ప్రాంతాల ఎగుమతిదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ భారత ఎగుమతి పోటీతత్వాన్ని మెరుగుపరిచేందుకు ఈ మిషన్‌ను రూపొందించారు. ఆర్థిక, ఆర్థికేతర సహాయాన్ని ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావడం ద్వారా ఎగుమతులకు ఉన్న అడ్డంకులను ఈ మిషన్‌ తగ్గిస్తోంది. వ్యాపార సంస్థలు ప్రపంచ మార్కెట్లను చేరుకోవడాన్ని సులభతరం చేస్తోంది.
* ట్రేడ్‌ కనెక్ట్‌ ఈ-ప్లాట్‌ఫామ్‌: ఎంఎస్‌ఎంఈలతో సహా ఎగుమతిదారులకు వాణిజ్య సమాచారం, మార్కెట్‌ అవకాశాలు, ప్రపంచ కొనుగోలుదారులను చేరుకొనే సదుపాయాన్ని అందిస్తోంది. 2026 ఆగస్టు నాటికి నమోదిత వినియోగదారుల సంఖ్య 20 లక్షలు దాటగా, 40 లక్షలకు పైగా మూల ధ్రువపత్రాలను జారీ చేశారు.
ఐస్‌గేట్ (ఇండియన్‌ కస్టమ్స్‌ ఎలక్ట్రానిక్‌ గేట్‌వే): ఎలక్ట్రానిక్‌ దాఖలు, సుంకాల చెల్లింపు, పత్రాల సవరణలు, సందేహాల పరిష్కారం, రీఫండ్‌ల ప్రక్రియకు ఐస్‌గేట్‌ వీలు కల్పిస్తోంది. దీంతో సరిహద్దుల మధ్య వాణిజ్యం మరింత సమర్థంగా మారుతోంది. బిల్స్‌ ఆఫ్‌ ఎంట్రీ దాఖలాలు 2020 ఏప్రిల్‌లో 1.43 లక్షలకు పైగా ఉండగా, 2026 జూన్‌లో 6.14 లక్షలకు పైగా పెరిగాయి. డిజిటల్‌ కస్టమ్స్‌ ప్రక్రియ, వాణిజ్య కార్యకలాపాల్లో వృద్ధిని ఇది ప్రతిబింబిస్తోంది.

సంస్థలకు అనుకూలమైన వ్యాపార వ్యవస్థ నిర్మాణం
భారతదేశ‌ సులభతర వ్యాపార నిర్వహణ ప్రస్థానం వ్యక్తిగత ప్రక్రియల సరళీకరణ దశ నుంచి మరింత స్పందనాత్మకమైన, సంస్థల అనుకూల వ్యవస్థ నిర్మాణ దిశగా పరిణామం చెందుతోంది. బలమైన డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, మార్కెట్లు, ఆర్థిక వనరులకు విస్తృత అందుబాటు, నియంత్రణల్లో మెరుగైన స్పష్టతతో వ్యాపార సంస్థలు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, సుస్థిరంగా విస్తరించడానికి, ప్రపంచస్థాయిలో పోటీపడటానికి మరింత అనుకూల స్థితిలో ఉన్నాయి.

 

 

References

Ministry of Commerce & Industry

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2090097&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2154136&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2204665&reg=1&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2253019&reg=3&lang=2

https://www.startupindia.gov.in/content/sih/en/about-startup-india-initiative.html

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2201280&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2168993&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2244401&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2246226&reg=3&lang=2

Ministry Of Finance

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2216047&reg=3&lang=2

https://www.icegate.gov.in/services/statistics-reports

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643250&reg=3&lang=2

Ministry of Corporate Affairs

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2099226&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656755&reg=3&lang=2

MSME

https://udyamregistration.gov.in/

PIB Archives

https://www.pib.gov.in/FactsheetDetails.aspx?id=150812&NoteId=150812&ModuleId=16&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2236804&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2269961&reg=48&lang=2

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154772&ModuleId=3&reg=3&lang=2

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2026/apr/doc202648842601.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2236804&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2232079&reg=3&lang=1

Click here to see Pdf

PIB Research

 

***

(तथ्य सामग्री आईडी: 150951) आगंतुक पटल : 59


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , Assamese , हिन्दी , Malayalam , Bengali , Kannada , Urdu