• Sitemap
  • Advance Search
Economy

యూపీఐ: భారతదేశ చెల్లింపుల రంగంలో నూతన శకం

प्रविष्टि तिथि: 24 AUG 2026 14:13 PM

గత దశాబ్ద కాలంలో భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అద్భుతమైన మార్పులకు లోనైంది. ప్రతి పౌరునికి అందుబాటులో ఉండేలా, సరళమైన, సురక్షితమైన చెల్లింపుల వ్యవస్థను రూపొందించాలనే లక్ష్యమే దీని విజయానికి మూలకారణం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), భారతదేశ డిజిటల్ చెల్లింపుల విప్లవానికి మూలస్తంభంగా నిలిచింది. నేడు 11 దేశాలలో యూపీఐ ఆమోదం పొందింది. భారతదేశపు ఈ రియల్-టైమ్ చెల్లింపుల వేదికను స్వీకరించిన తాజా దేశాల్లో గ్రీస్, మాల్దీవులు ఉన్నాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003XBS7.jpg

యూపీఐ పరిణామ క్రమం

పరస్పర అనుసంధానత, వాడుకలో సౌలభ్యం కారణంగా, యూపీఐ వ్యక్తులు, వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలు లావాదేవీలు జరిపే విధానాన్ని పూర్తిగా మార్చేసింది.

  • భాగస్వామ్య బ్యాంకు లేదా చెల్లింపు సేవా సంస్థకు చెందిన ఒకే మొబైల్యాప్ద్వారా పలు బ్యాంకు ఖాతాలను నిర్వహించే తక్షణ చెల్లింపు వ్యవస్థ.
  • ఒకే ప్లాట్ఫారమ్పై బ్యాంకింగ్ సేవలు, నిధుల బదిలీలు మరియు వ్యాపారి చెల్లింపుల ఏకీకరణ.
  • 24/7 డిజిటల్ చెల్లింపుల సదుపాయం.
  • లావాదేవీల భద్రత కోసం రెండంచెల ధృవీకరణ, ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్వినియోగం.

గత దశాబ్ద కాలంలో, యూపీఐ భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు వెన్నెముకగా ఎదిగింది. దీని పరిణామ క్రమంలోని కీలక ఘట్టాలు:

2016

  • ఏప్రిల్ 2016లో 21 సభ్య బ్యాంకులతో యూపీఐ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.
  • 2016 ఆగస్టులో, బ్యాంకులు తమ యూపీఐ-సామర్థ్యం గల మొబైల్ అప్లికేషన్లను గూగుల్ ప్లే స్టోర్లో విడుదల చేయడంతో ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
  • డిసెంబర్ 2016లో భీమ్ అప్లికేషన్ ప్రారంభమైంది. ఇది వినియోగదారులు నేరుగా బ్యాంకు నుండి బ్యాంకుకు సులభంగా లావాదేవీలు చేయడానికి వీలు కల్పించింది.

2017

  • డైనమిక్ క్యూఆర్ (QR) కోడ్ ఆధారిత రిటైల్ మర్చంట్ ప్లాట్ఫామ్ ప్రారంభమైంది. ఇది లావాదేవీ వివరాలను ఆటోమేటిక్గా నమోదు చేయడం ద్వారా, మాన్యువల్ ఎంట్రీ అవసరాన్ని తొలగించింది.

2018

  • మెరుగైన ఫీచర్లతో యూపీఐ 2.0 ప్రవేశపెట్టబడింది.
  • చెల్లింపులను ఆమోదించే ముందు వినియోగదారులు బిల్లులు లేదా ఇన్వాయిస్లను చూసేందుకు ఇన్బాక్స్లోని ఇన్వాయిస్ వెసులుబాటు కల్పించింది.
  • సంతకం చేసిన క్యూఆర్ కోడ్లు భద్రతను కాపాడుతూనే చెల్లింపు ఆమోదాన్ని సులభతరం చేశాయి.
  • యూపీఐ మాండేట్స్ ద్వారా పునరావృత చెల్లింపులు సాధ్యమయ్యాయి.
  • ఓవర్డ్రాఫ్ట్ ఖాతా అనుసంధానం ద్వారా, వినియోగదారులు తమ ఓవర్డ్రాఫ్ట్ ఖాతాలను ఉపయోగించి యూపీఐ లావాదేవీలు చేయడానికి వీలు కలిగింది.

2019

  • ఐపీఓ (IPO) దరఖాస్తులకు రిటైల్ ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ చెల్లింపు విధానంగా యూపీఐని ఉపయోగించుకోవడానికి సెబీ (SEBI) అనుమతించింది.
  • అక్టోబర్ 2019లో, యూపీఐ నెలకు వంద కోట్ల లావాదేవీల మైలురాయిని అధిగమించింది.

2020-2022

  • సబ్స్క్రిప్షన్లు, యుటిలిటీ బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, SIPలు మరియు EMIల చెల్లింపుల కోసం యూపీఐ ఆటోపే ప్రారంభమైంది.
  • యూపీఐ 123 పే ప్రారంభంతో ఫీచర్ ఫోన్ వినియోగదారులు (ఐవీఆర్, మిస్డ్ కాల్, వాయిస్ ఆధారిత చెల్లింపుల ద్వారా) డిజిటల్ చెల్లింపుల పరిధిలోకి వచ్చారు.
  • తక్కువ విలువ గల లావాదేవీల కోసం యూపీఐ లైట్ ప్రవేశపెట్టబడింది.
  • యూపీఐతో క్రెడిట్ కార్డుల అనుసంధానం అందుబాటులోకి వచ్చింది.
  • 202122 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ ద్వారా ఒక ట్రిలియన్అమెరికన్డాలర్లకు పైగా విలువైన లావాదేవీలు జరిగాయి. 2022 మార్చిలో నెలకు 500 కోట్ల లావాదేవీలను దాటింది.
  • భూటాన్లో ప్రారంభంతో యూపీఐ అంతర్జాతీయ విస్తరణ మొదలైంది.

2023

  • ముందుగా మంజూరైన బ్యాంక్ క్రెడిట్ లైన్లను అనుసంధానించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
  • 202324 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ డిజిటల్ చెల్లింపులలో సుమారు 70% యూపీఐ ద్వారానే జరిగాయి.

2024

  • యూపీఐ సర్కిల్ ద్వారా ప్రాథమిక వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాపై పరిమిత లావాదేవీలకు ద్వితీయ వినియోగదారులను అనుమతించే సౌకర్యం వచ్చింది.
  • పన్ను చెల్లింపుల పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు, యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని రూ. 5,000కు, అలాగే ప్రతి లావాదేవీ పరిమితిని రూ. 1,000కు పెంచారు. మూలధన మార్కెట్లు, ఐపీఓ చందాలు, రుణ వసూళ్లు, బీమా, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ఎంపిక చేసిన విభాగాలకు కూడా అధిక పరిమితులు వర్తిస్తాయి.
  • యూపీఐ 123 పే ప్రతి లావాదేవీ పరిమితిని రూ. 10,000కు పెంచారు.
  • యూపీఐ లైట్వాలెట్పరిమితిని ₹5 వేలకు, ఒక్కో లావాదేవీ పరిమితిని వెయ్యికి పెంచారు.

2025

  • యూపీఐ ఆన్-డివైస్ అథెంటికేషన్ ప్రవేశపెట్టబడింది, దీని ద్వారా స్మార్ట్ఫోన్ ఫింగర్ప్రింట్ లేదా ఫేస్ అన్లాక్తో చెల్లింపులు చేయవచ్చు.
  • ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ప్రారంభమవ్వడంతో, కొత్త వినియోగదారులకు యూపీఐ పిన్ ఆన్బోర్డింగ్ సులభతరమైంది.

ప్రస్తుతం యూపీఐ

వ్యక్తులు, వ్యాపారాలు, ఆర్థిక సంస్థల్లో యూపీఐ విస్తృతంగా స్వీకరించటం వల్ల, లావాదేవీల పరిమాణం, విలువ రెండింటిలోనూ అపూర్వమైన వృద్ధి నమోదైంది.

2016-17 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు:

  • వార్షిక లావాదేవీల పరిమాణం 2 కోట్ల నుండి 24,162 కోట్లకు పైగా పెరిగింది. ఇది సుమారు 12 వేల రెట్ల వృద్ధిని సూచిస్తుంది.
  • వార్షిక లావాదేవీల విలువ రూ. 0.07 లక్షల కోట్ల నుండి సుమారు రూ. 314 లక్షల కోట్లకు పెరిగి, 4 వేల రెట్లకు పైగా వృద్ధిని నమోదు చేసింది.

జూలై 2026 నాటికి:

  • యూపీఐ పర్యావరణ వ్యవస్థలో 741 క్రియాశీల బ్యాంకులు ఉన్నాయి.
  • యూపీఐ 2,365.8 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది, వీటి మొత్తం విలువ రూ. 29.87 లక్షల కోట్లు.

అంతర్జాతీయ స్థాయికి యూపీఐ

ప్రపంచవ్యాప్తంగా యూపీఐ ఒక ప్రముఖ రియల్-టైమ్ చెల్లింపుల వ్యవస్థగా ఆవిర్భవించింది. 2024 నాటికి, ప్రపంచవ్యాప్త రియల్-టైమ్ చెల్లింపుల లావాదేవీలలో యూపీఐ వాటా సుమారు 49%గా ఉందని ఐఎమ్ఎఫ్ నివేదిక పేర్కొంది.

 

యూపీఐ ప్రపంచవ్యాప్త విస్తరణ

  • భూటాన్, నేపాల్, సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్, ఖతార్లలో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి.
  • జూన్ 2026లో, కంబోడియాలో యూపీఐ ఆమోదాన్ని ప్రారంభించడానికి ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, ఏసీఎల్ఈడీఏ బ్యాంక్ పీఎల్సీ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
  • జూన్ 2026లో, గ్రీస్లో సరిహద్దుల మీదుగా డబ్బు బదిలీల కోసం యూపీఐ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా యూరోబ్యాంక్ ద్వారా గ్రీస్-భారతదేశం మధ్య తక్షణమే నగదు బదిలీ చేసుకోవచ్చు.
  • జూలై 30, 2026, మాల్దీవుల 'ఫవారా' వ్యవస్థ, భారతదేశపు యూపీఐ మధ్య సరిహద్దు చెల్లింపుల సేవలు ప్రారంభమయ్యాయి.
  • ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల స్వీకరణ లేదా సరిహద్దు నగదు బదిలీల కోసం 11 విదేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి.

డిజిటల్ పరివర్తన దశాబ్దం

యూపీఐ డిజిటల్ చెల్లింపులను సరళంగా, సురక్షితంగా, పరస్పర అనుసంధానంగా మార్చడం ద్వారా భారతదేశ లావాదేవీల సరళిని పూర్తిగా మార్చివేసింది. దీని వేగవంతమైన స్వీకరణ, నిరంతర ఆవిష్కరణలు, విస్తరిస్తున్న ప్రపంచవ్యాప్త ఉనికి, యూపీఐని భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలలో కీలక భాగంగా మార్చాయి.

References   

 Ministry of Electronics & Information Technology

https://www.digitalindia.gov.in/initiative/unified-payment-interface-upi/

https://www.digitalindia.gov.in/growth-story/

https://www.digitalindia.gov.in/initiative/upi-123pay/

 

Ministry of Finance

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1735075&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1810601&lang=2&reg=48

http://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2110407&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2088182&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2257087&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2200569&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2268591&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2279646&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2292288&reg=48&lang=2

 

National Payments Corporation of India (NPCI)

https://www.bhimupi.org.in/about-bhim.html

https://www.bhimupi.org.in/upi2.html

https://www.bhimupi.org.in/upiautopay.html

https://www.npci.org.in/product/upi/product-statistics

https://www.npci.org.in/product/upi/upi-lite

https://www.npci.org.in/product/upi-circle

https://www.npci.org.in/uploads/DFS_Secretary_Launches_Initiatives_to_Simplify_Digital_Payment_Experience_at_GFF_2025_c74afc4dd6.pdf

 

Ministry of Drinking Water & Sanitation

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1479881&reg=48&lang=2

 

RBI

https://rbi.org.in/scripts/BS_SpeechesView.aspx?Id=1034

https://rbi.org.in/scripts/BS_SpeechesView.aspx?Id=1327

https://www.rbi.org.in/Scripts/NotificationUser.aspx?Id=12532&Mode=0

https://rbi.org.in/scripts/BS_PressReleaseDisplay.aspx?prid=58449

https://rbidocs.rbi.org.in/rdocs/Speeches/PDFs/UPI170820182C164878486345FFBEC7D7A55B7B7892.PDF

 

Others

https://www.kotak.bank.in/en/stories-in-focus/accounts-deposits/current-account/what-is-upi-and-upi-full-form.html

https://www.bseindia.com/static/publicissues/unified-interface

https://razorpay.com/blog/what-is-upi-autopay-recurring-payments-razorpay-subscriptions/

https://bankingfrontiers.com/npci-launches-upi-platform-based-qr-codes/

 

********

(तथ्य सामग्री आईडी: 150969) आगंतुक पटल : 15


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , Urdu , Bengali , Telugu , Kannada , हिन्दी , Malayalam