Farmer's Welfare

పప్పుధాన్యాల్లో ఆత్మనిర్భరతకు భారత‌దేశ‌ మిషన్

प्रविष्टि तिथि: 11 OCT 2026 12:29 PM

2030–31 నాటికి పప్పుధాన్యాల్లో భారత్‌ను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు ఆరేళ్ల ప్రణాళిక
 


దిగుమతులపై ఆధారపడే స్థితి నుంచి స్వయం సమృద్ధి దిశగా
ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం కలిగిన, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే పప్పుధాన్యాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. పప్పుధాన్యాల్లో 20–25 శాతం ప్రోటీన్లు ఉంటాయి. ఇది గోధుమలతో పోలిస్తే రెండు రెట్లకు పైగా, బియ్యంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికం. భారత వ్యవసాయ ఎగుమతుల్లో పప్పుధాన్యాలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి. పోషకాహార భద్రతను కల్పిస్తూ భారతీయుల ఆహారంలో కీలక భాగంగా నిలుస్తున్నాయి. ఈ ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 11న ‘మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్’ను ప్రారంభించింది. అక్టోబర్ 11న దేశం ఈ మిషన్ తొలి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, 2025–26 నుంచి 2030–31 వరకు ₹11,440 కోట్ల ఆర్థిక కేటాయింపుతో ఈ కీలక కార్యక్రమం వేగంగా ముందుకు సాగుతోంది. పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం ఈ మిషన్ లక్ష్యం. సమగ్ర విలువ గొలుసు విధానం ద్వారా దేశీయ ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారిస్తోంది.

స్పష్టమైన లక్ష్యంతో మిషన్
ఈ మిషన్ కింద 2030–31 నాటికి పప్పుధాన్యాల ఉత్పత్తిని దాదాపు 350 లక్షల టన్నులకు, హెక్టారుకు దిగుబడిని 1,130 కిలోలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాల సాధనకు చేపడుతున్న ప్రధాన వ్యూహాత్మక చర్యలు ఇవీ:
- కందులు, మినుములు, మసూర్ పప్పు ఉత్పత్తి పెంపుపై ప్రత్యేక దృష్టి
- వాతావరణ పరిస్థితులను తట్టుకునే విత్తనాలు, మెరుగైన నాణ్యత కలిగిన విత్తనాలకు ప్రోత్సాహం
- ఆరేళ్లలో 87.5 లక్షల ఉచిత విత్తన కిట్లు, 126 లక్షల క్వింటాళ్ల ధ్రువీకృత విత్తనాల పంపిణీ
- 2030–31 నాటికి మొత్తం పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని 310 లక్షల హెక్టార్లకు చేర్చేందుకు అదనంగా 35 లక్షల హెక్టార్లలో సాగు
- ఉత్పత్తిని పెంచేందుకు 489 జిల్లాల్లో క్లస్టర్ ఆధారిత విధానం
- 1,000 పప్పుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు
- ఆసక్తి చూపిన, నమోదిత రైతుల నుంచి ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్ ద్వారా కందులు, మినుములు, మసూర్ పప్పు కొనుగోలుకు హామీ
- దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడం

పప్పుధాన్యాల ఉత్పత్తిలో భారత్ సత్తా
2025–26లో దేశీయ ఉత్పత్తి, సాగు విస్తీర్ణం, పంట దిగుబడిలో భారత పప్పుధాన్యాల రంగం బలమైన వృద్ధిని నమోదు చేసింది. స్థిరమైన వ్యవసాయ పురోగతి, బలమైన దేశీయ ఉత్పత్తి దేశ పప్పుధాన్యాల ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తున్నాయి.
- దేశంలో మొత్తం పప్పుధాన్యాల ఉత్పత్తి 2024–25లో 256.83 లక్షల టన్నులు ఉండగా, 2025–26లో 274.09 లక్షల టన్నులకు పెరిగింది. ఇవి మూడో ముందస్తు అంచనాలు.
- పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం 2024–25లో 277.20 లక్షల హెక్టార్లు ఉండగా, 2025–26లో 286.46 లక్షల హెక్టార్లకు గణనీయంగా పెరిగింది.
- మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ పప్పుధాన్యాల సాగులో ప్రధాన రాష్ట్రాలుగా ఉన్నాయి.
- దేశవ్యాప్తంగా పప్పుధాన్యాల సగటు దిగుబడి 2024–25లో హెక్టారుకు 926 కిలోలు ఉండగా, 2025–26లో 957 కిలోలకు పెరిగింది.
- భారత పప్పుధాన్యాల దిగుమతులు 2024–25లో ₹46,427.60 కోట్లు ఉండగా, 2025–26లో ₹31,793.59 కోట్లకు తగ్గాయి. ఇది 31.52 శాతం క్షీణత.
- పప్పుధాన్యాల ఎగుమతులు 2024–25లో 855 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉండగా, 2025–26లో 969.53 మిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగాయి. ఇది 13.40 శాతం వృద్ధి. 2025–26లో మొత్తం ఎగుమతుల పరిమాణం 10.01 లక్షల టన్నులకు చేరింది.
- 2025–26లో చైనా, యూఏఈ, బంగ్లాదేశ్, అమెరికా, శ్రీలంక ప్రధాన ఎగుమతి గమ్యస్థానాలుగా ఉన్నాయి.



పెరుగుతున్న కనీస మద్దతు ధర.. కొనుగోలుకు హామీ
కనీస మద్దతు ధరలను గణనీయంగా పెంచడం ద్వారా పప్పుధాన్యాల రైతులకు ధరల భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. అధిక మద్దతు ధరలు రైతులకు సముచిత రాబడిని కల్పించడంతో పాటు ప్రధాన పప్పుధాన్యాల దేశీయ ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహం ఇస్తున్నాయి.
- 2024–25 మార్కెటింగ్ సీజన్‌లో మినుములకు క్వింటాలుకు ₹7,400 కనీస మద్దతు ధర నిర్ణయించారు. దీన్ని ₹800 మేర (10.81 శాతం) పెంచి 2026–27కు క్వింటాలుకు ₹8,200గా నిర్ణయించారు.
- 2024–25లో కందుల కనీస మద్దతు ధర క్వింటాలుకు ₹7,550 ఉండగా, ₹900 మేర (11.92 శాతం) పెంచి 2026–27లో క్వింటాలుకు ₹8,450గా నిర్ణయించారు.
- 2024–25లో మసూర్ పప్పుకు క్వింటాలుకు ₹6,700 కనీస మద్దతు ధర ఉండగా, ₹300 మేర (4.48 శాతం) పెంచి 2026–27కు క్వింటాలుకు ₹7,000గా సవరించారు.



ఈ మిషన్ కింద నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌సీసీఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్)కు నాలుగేళ్లపాటు(2025–26 నుంచి 2028–29 వరకు) కందులు, మసూర్ పప్పు, మినుములను 100 శాతం కొనుగోలు చేసేందుకు అధికారం ఇచ్చారు. 2026 జూన్ 17 నాటికి ఎన్‌సీసీఎఫ్ పల్సెస్ ప్రొక్యూర్‌మెంట్ డ్యాష్‌బోర్డ్‌లో నమోదైన ప్రధాన విజయాలు ఇవీ:
- తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్‌సీసీఎఫ్ మొత్తం 10.55 లక్షల టన్నుల పప్పుధాన్యాలను కొనుగోలు చేసింది. రైతులకు కనీస మద్దతు ధర కింద మొత్తం ₹7,047 కోట్లను నేరుగా చెల్లించింది. నమోదైన మొత్తం 7.74 లక్షల మంది రైతుల్లో 4.69 లక్షల మందికి ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం లభించింది.
- ఖరీఫ్ 2025–26లో ₹6,431 కోట్ల విలువైన 7.89 లక్షల టన్నుల పప్పుధాన్యాలను కొనుగోలు చేశారు. దీంతో 3.66 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు.
- రబీ 2026–27లో పప్పుధాన్యాల కొనుగోలు 23.51 లక్షల టన్నులకు చేరింది. కనీస మద్దతు ధర కింద ₹14,217 కోట్లు విడుదల చేయగా, 10.20 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు.
- పప్పుధాన్యాల కొనుగోలు 2024–25లో 18,39,504.77 టన్నులు ఉండగా, 2025–26లో 31,40,883.92 టన్నులకు పెరిగింది.

మిషన్ ప్రారంభ దశలో కీలక పురోగతి
మౌలిక సదుపాయాల నిర్మాణం, రైతులకు సహాయం విస్తరణలో మిషన్ సాధించిన ప్రారంభ పురోగతి స్థిరమైన వేగాన్ని సూచిస్తోంది. ఇప్పటివరకు సాధించిన ప్రధాన విజయాలు ఇవీ:
- మిషన్ కింద 1,000 పప్పుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తొలి దశలో ఇప్పటికే 528 యూనిట్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించారు.
- ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన (పీఎంకేఎస్‌వై) కింద క్రియేషన్ అండ్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ కెపాసిటీస్ (సీఈఎఫ్‌పీపీసీ) కోసం మొత్తం 23 పప్పుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి ఇచ్చారు. ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో 18 పప్పుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లు విజయవంతంగా పూర్తయ్యాయి.
- వరి కోత అనంతరం ఖాళీగా ఉండే భూముల్లో పప్పుధాన్యాల సాగును పెంచేందుకు ఆరేళ్లలో 87.5 లక్షల విత్తన కిట్లను పంపిణీ చేయాలని మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. రబీ 2025–26లో 9.25 లక్షల కిట్లను పంపిణీ చేశారు.

డిజిటల్ పర్యవేక్షణ.. విత్తనాల జాడ తెలుసుకునే వ్యవస్థ
అన్ని స్థాయుల్లో నిరంతర పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు సమీక్ష, లక్ష్య ఆధారిత అమలును నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధునిక డిజిటల్ వేదికలను వినియోగిస్తోంది:
- జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ప్రణాళిక, అమలు, పురోగతిని మూడు అంచెల స్టీరింగ్ కమిటీ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది.
- విత్తన రకాల ప్రదర్శనలు, దిగుబడులను కచ్చితంగా జియో-ఫెన్సింగ్ చేయడం, భూములను జియో-ట్యాగింగ్ చేయడం, ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కృషి మ్యాపర్ అప్లికేషన్ వీలు కల్పిస్తోంది.
- సీడ్ అథెంటికేషన్, ట్రేసబిలిటీ అండ్ హోలిస్టిక్ ఇన్వెంటరీ (సాథీ) పోర్టల్ వివిధ విత్తన తరాల్లో పూర్తి జీవనచక్రాన్ని సమగ్రంగా పర్యవేక్షిస్తుంది. విత్తనోత్పత్తి నుంచి ధ్రువీకరణ, విక్రయం వరకు మొత్తం సరఫరా గొలుసును ఆటోమేట్ చేయడం ద్వారా ఈ ప్రక్రియను అమలు చేస్తోంది.
- అగ్రిస్టాక్, డిజిటల్ క్రాప్ సర్వే: ఏకీకృత రైతు గుర్తింపు సంఖ్యలను సాయిల్ హెల్త్ కార్డ్ విశ్లేషణ, ధ్రువీకరించిన భూకమతాల సర్వేలతో అనుసంధానిస్తుంది. తద్వారా లక్ష్యానికి అనుగుణంగా పోషకాలు అందించడం, కచ్చితమైన పంట దిగుబడి అంచనాలు రూపొందించడం సాధ్యమవుతుంది.
- ఈ–సమృద్ధి, విస్తార్ వంటి ధ్రువీకరణ వేదికలు రైతులకు నేరుగా చెల్లింపులు, ఎప్పటికప్పుడు మార్కెట్ సమాచారం, దేశీయ ధరల స్థిరత్వాన్ని నిర్ధారిస్తున్నాయి.

నేడు విత్తనం.. రేపటికి భద్రత
మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ విధానపరమైన లక్ష్యాలను క్షేత్రస్థాయి అమలుతో విజయవంతంగా అనుసంధానిస్తున్నట్లు ప్రారంభ పురోగతి సూచిస్తోంది. ధరల మద్దతుకు హామీ కల్పించడం రైతుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించింది. సాథీ, ఈ–సమృద్ధి వంటి డిజిటల్ వేదికలు సరఫరా గొలుసులో పూర్తి పారదర్శకతను నిర్ధారిస్తున్నాయి. 2030–31 నాటికి 350 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం దిశగా భారత్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో, ఈ సమగ్ర విలువ గొలుసు విధానం దీర్ఘకాలిక జాతీయ ప్రోటీన్ భద్రత, విదేశీ మారకద్రవ్య ఆదాతో పాటు విస్తృత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో స్వయం సమృద్ధి సాధనకు అనుసరించదగిన నమూనాను అందిస్తోంది.

 

References

Ministry of Agriculture & Farmers Welfare

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2177847&reg=48&lang=2

https://www.niti.gov.in/sites/default/files/2025-09/Strategies-and-Pathways-for-Accelerating-Growth-in-Pulses-towards-the-Goal-of-Atmanirbharta.pdf

https://www.ibef.org/news/union-cabinet-approves-mission-for-aatmanirbharta-in-pulses-with-rs-11-440-crore-us-1-24-billion-outlay-to-achieve-self-sufficiency-by-2030-31

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2284230&reg=48&lang=1

https://upag.gov.in/dash-reports/progressivecropareasown

https://apeda.gov.in/Pulses

https://pulsesmission.da.gov.in/pulseswebinar.aspx

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2239790&reg=48&lang=2

https://www.pmindia.gov.in/en/news_updates/union-cabinet-approves-mission-for-aatmanirbharta-in-pulses-for-2025-26-to-2030-31/

 

PIB Backgrounders

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155497&ModuleId=3&reg=48&lang=1

Click here to see PDF

***

(तथ्य सामग्री आईडी: 151123) आगंतुक पटल : 3


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , हिन्दी , Bengali , Kannada