Farmer's Welfare
2026-27 రబీ సీజన్‌కు ఎరువుల సబ్సిడీ రేట్లు
प्रविष्टि तिथि:
12 NOV 2026 19:05 PM
అందుబాటు ధరల్లో ఎరువులు లభించేలా భరోసా, సమతుల్య వినియోగానికి ప్రోత్సాహం
పోషక-ఆధారిత సబ్సిడీ పథకం: సమతుల్య ఎరువుల వినియోగానికి ప్రోత్సాహం
నేల ఆరోగ్యాన్ని కాపాడటంలో, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో, దీర్ఘకాలం సాగు నిలకడగా కొనసాగేలా చేయడంలో సమతుల్య ఎరువుల వినియోగం కీలకం. దీన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం న్యూట్రియెంట్-బేస్డ్ సబ్సిడీ (ఎన్‌బీఎస్) స్కీమ్‌ను 01 ఏప్రిల్ 2010 నుంచి అమలు చేస్తోంది.
ఈ పథకం కింద ఎరువులపై సబ్సిడీ వాటిలోని పోషకాల పరిమాణంతో ముడిపడి ఉంటుంది. ఈ పోషకాల్లో నత్రజని (ఎన్), భాస్వరం (పీ), పొటాషియం (కే), గంధకం (ఎస్) ఉన్నాయి. ఫాస్ఫేటిక్, పొటాసిక్ (పీ&కే) ఎరువుల 28 గ్రేడ్‌లకు వర్తించేలా ఖరీఫ్, రబీ సీజన్లకు ఏడాదిలో రెండుసార్లు ఈ పోషకాల సబ్సిడీ రేట్లను నిర్ణయిస్తారు.
ప్రధాన పోషకాలు అందుబాటు ధరల్లో రైతులకు లభించేలా చేయడం ద్వారా ఎరువులను అవసరానికి తగినట్లు వాడటాన్ని ఈ విధానం ప్రోత్సహిస్తుంది. నేల, పంట అవసరాలకు అనుగుణంగా సమతుల్య నిష్పత్తుల్లో పోషకాలను వినియోగించేలా రైతులకు తోడ్పడుతుంది.
పీ&కే ఎరువుల రంగంలో ధరలపై ప్రత్యక్ష నియంత్రణ లేదు. ప్రభుత్వ పర్యవేక్షణకు లోబడి తయారీదారులు, దిగుమతిదారులు సహేతుకమైన స్థాయిలో ఎంఆర్‌పీని నిర్ణయించవచ్చు. అందువల్ల రైతులు ఈ ఎరువులను కొనుగోలు చేసేటప్పుడే సబ్సిడీ ప్రయోజనాన్ని నేరుగా పొందుతారు.
ఎన్‌బీఎస్ పథకం గురించి మరింత తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
రబీ 2026-27కు ఎన్‌బీఎస్ రేట్లు
అంతర్జాతీయంగా ఎరువులు, వాటి తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరల్లో ఇటీవలి ధోరణులను దృష్టిలో ఉంచుకుని, రబీ 2026-27కు ఫాస్ఫేటిక్, పొటాసిక్ (పీ&కే) ఎరువుల న్యూట్రియెంట్-బేస్డ్ సబ్సిడీ (ఎన్‌బీఎస్) రేట్లకు ప్రభుత్వం 11 నవంబర్ 2026న ఆమోదం తెలిపింది. ఈ రేట్లు 1 అక్టోబర్ 2026 నుంచి 31 మార్చి 2027 వరకు వర్తిస్తాయి.
రబీ 2026-27కు అంచనా కేటాయింపు సుమారు ₹62,370.02 కోట్లు. రబీ 2025-26కు కేటాయించిన ₹37,952.29 కోట్ల కంటే ఇది 64%కు పైగా అధికం. ఈ పథకం కింద ప్రభుత్వం ఆమోదించి, ప్రకటించిన రేట్ల ప్రకారం ఎరువుల కంపెనీలకు సబ్సిడీలు అందుతాయి. వివరాలు:
|
పోషకం
|
ఎన్
|
పీ
|
కే
|
ఎస్
|
|
రబీ 2026-27 (₹/కిలోగ్రాము)
|
94.21
|
66.11
|
2.38
|
10.42
|
రైతులకు అందుబాటు ధరల్లో ఎరువులు లభించేలా ఈ సబ్సిడీ సాయం తోడ్పడుతుంది.
ప్రధాన ఎరువుల లభ్యతకు భరోసా కల్పించేందుకు, దేశీయ ఉత్పత్తికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను కూడా కొనసాగించింది. అవి:
1. డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ)కు ప్రత్యేక నిబంధనలు
సాధారణ ఎన్‌బీఎస్ సబ్సిడీకి అదనంగా, బస్తాకు ₹1,350 స్థిర ధరతో డీఏపీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను కొనసాగిస్తుంది. దిగుమతి చేసుకున్న, దేశీయంగా తయారైన ట్రిపుల్ సూపర్‌ఫాస్ఫేట్ (టీఎస్‌పీ), దిగుమతి చేసుకున్న మోనోఅమ్మోనియం ఫాస్ఫేట్ (ఎంఏపీ)కు కూడా ఈ నిబంధనలను విస్తరించారు.
2. సింగిల్ సూపర్‌ఫాస్ఫేట్ (ఎస్‌ఎస్‌పీ)కు రవాణా సబ్సిడీ
రబీ 2026-27లో ఎస్‌ఎస్‌పీకి రవాణా సబ్సిడీని ప్రభుత్వం కొనసాగిస్తుంది. డై-అమ్మోనియం ఫాస్ఫేట్‌కు అందుబాటు ధరలో ప్రత్యామ్నాయంగా సింగిల్ సూపర్‌ఫాస్ఫేట్‌ను ప్రోత్సహించడం దీని లక్ష్యం.
3. అమ్మోనియం సల్ఫేట్‌కు సబ్సిడీ
రబీ 2026-27లో దిగుమతి చేసుకున్న, దేశీయంగా ఉత్పత్తి చేసిన అమ్మోనియం సల్ఫేట్‌పై సబ్సిడీ కొనసాగుతుంది.
4. దేశీయ ఉత్పత్తికి సల్ఫర్ ప్యాకేజీ
సల్ఫర్ ప్యాకేజీ కింద దేశంలో గంధకం, సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారు చేసే సంస్థలకు మాత్రమే సాయం అందిస్తారు. ఈ ప్యాకేజీ కింద:
- గంధకం: టన్నుకు 800 అమెరికా డాలర్ల కనీస ధర షరతుకు లోబడి, తయారీదారులకు వాస్తవ కొనుగోలు వ్యయంలో 20% అందిస్తారు.
- సల్ఫ్యూరిక్ ఆమ్లం: టన్నుకు 266.67 అమెరికా డాలర్ల కనీస ధర షరతుకు లోబడి, తయారీదారులకు వాస్తవ కొనుగోలు వ్యయంలో 20% అందిస్తారు.
రబీ 2026-27 ఎన్‌బీఎస్ రేట్లతో ప్రధాన ప్రయోజనాలు
రబీ 2026-27కు సవరించిన ఎన్‌బీఎస్ రేట్లు, ప్రత్యేక నిబంధనలు రైతులకు, దేశీయ ఉత్పత్తికి తోడ్పడుతూ అందుబాటు ధరల్లో ఎరువుల లభ్యతకు భరోసా కల్పిస్తాయి. ప్రధాన ప్రయోజనాలు:
- అందుబాటు ధరల్లో ఎరువులు: రైతులకు సబ్సిడీతో, సహేతుకమైన ధరల్లో ఎరువులు లభించేలా చేస్తాయి.
- సబ్సిడీ హేతుబద్ధీకరణ: అంతర్జాతీయంగా ఎరువులు, ముడి పదార్థాల ధరల్లో ఇటీవలి ధోరణులకు అనుగుణంగా పీ&కే ఎరువుల సబ్సిడీలను సర్దుబాటు చేస్తాయి.
- దేశీయ ఉత్పత్తికి ఊతం: దేశీయ ఎరువుల ఉత్పత్తికి మద్దతు ఇస్తాయి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయి.
- ప్రత్యామ్నాయాలకు ప్రోత్సాహం: డై-అమ్మోనియం ఫాస్ఫేట్‌కు బదులుగా సింగిల్ సూపర్‌ఫాస్ఫేట్, యూరియాకు బదులుగా అమ్మోనియం సల్ఫేట్ వంటి అందుబాటు ధరల్లోని ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తాయి. సమతుల్య పోషకాల వినియోగానికీ తోడ్పడతాయి.
- రైతులకు, ఆహార భద్రతకు తోడ్పాటు: రబీ సీజన్ అంతటా వ్యవసాయ అవసరాల ఖర్చులను స్థిరంగా ఉంచడం ద్వారా ఆహార భద్రతకు, రైతుల ఆదాయానికి తోడ్పడతాయి. రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వ విధానాన్ని బలోపేతం చేస్తాయి.

ఎన్‌బీఎస్ పథకంలో పురోగతి
దేశవ్యాప్తంగా ఎరువుల సబ్సిడీ సాయం పెరగడం, నిల్వల లభ్యత మెరుగుపడటం ఎన్‌బీఎస్ పథకం ప్రభావాన్ని చాటుతున్నాయి.
ఎరువుల సబ్సిడీ విడుదల
2022-23 నుంచి 2025-26 మధ్య న్యూట్రియెంట్-బేస్డ్ సబ్సిడీ (ఎన్‌బీఎస్) స్కీమ్ కింద దేశీయంగా తయారైన, దిగుమతి చేసుకున్న ఫాస్ఫేటిక్, పొటాసిక్ (పీ&కే) ఎరువులకు ప్రభుత్వం ₹2.79 లక్షల కోట్లకు పైగా సబ్సిడీని విడుదల చేసింది.
ఎరువుల నిల్వల లభ్యత
ప్రధాన ఎరువుల మొత్తం నిల్వలు 10 నవంబర్ 2025న 173.46 లక్షల టన్నుల నుంచి 10 నవంబర్ 2026న 235.21 లక్షల టన్నులకు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది సుమారు 35.6% పెరుగుదల.
|
ఉత్పత్తి
|
10.11.2025 నాటికి నిల్వలు (లక్షల టన్నుల్లో)
|
10.11.2026 నాటికి నిల్వలు (లక్షల టన్నుల్లో)
|
|
యూరియా
|
72.14
|
103.12
|
|
డీఏపీ
|
24.86
|
28.65
|
|
ఎన్‌పీకేలు
|
42.44
|
60.87
|
|
ఎంఓపీ
|
10.78
|
20.08
|
|
ఎస్‌ఎస్‌పీ
|
23.24
|
22.49
|
|
మొత్తం నిల్వలు
|
173.46
|
235.21
|
రైతులు, సుస్థిర వ్యవసాయానికి కొనసాగుతున్న ప్రభుత్వ నిబద్ధత
సమతుల్య ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంలో, రైతులకు అందుబాటు ధరల్లో పోషకాలు లభించేలా చూడటంలో న్యూట్రియెంట్-బేస్డ్ సబ్సిడీ స్కీమ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. రబీ 2026-27 సబ్సిడీ రేట్లు, కొనసాగుతున్న ప్రత్యేక నిబంధనలు ఎరువుల లభ్యతకు, దేశీయ ఉత్పత్తికి, అందుబాటు ధరల్లో ప్రత్యామ్నాయాలకు తోడ్పడుతున్నాయి. పెరిగిన సబ్సిడీ విడుదలలు, అధిక ఎరువుల నిల్వలు ప్రభుత్వ నిరంతర కృషిని చాటుతున్నాయి. అందుబాటు ధరల్లో ఎరువుల లభ్యత, సమతుల్య పోషకాల వినియోగం, వ్యవసాయ అవసరాల ఖర్చుల్లో మరింత స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తూ ఈ చర్యలన్నీ రైతులకు తోడ్పడుతున్నాయి.
References
Cabinet
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2334972®=48&lang=2
Ministry of Chemicals and Fertilizers
https://sansad.in/getFile/annex/271/AS248_EPp7zO.pdf?source=pqars
https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AS84_A9tlRY.pdf?source=pqals
PIB Backgrounders
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=156820&ModuleId=3®=1&lang=1
Click here to see PDF
***
(तथ्य सामग्री आईडी: 151192)
आगंतुक पटल : 15
Provide suggestions / comments