Social Welfare
పట్టణాల నుంచి గ్రామాల వరకు విద్యలో సమానత్వం దిశగా కేవీఎస్, ఎన్‌వీఎస్
Posted On:
10 NOV 2025 2:03PM
కీలకాంశాలు
- 2025 అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా 1290 కేంద్రీయ విద్యాలయాలు(కేవీ) ఉన్నాయి.
- దాదాపు రూ.5,862.55 కోట్ల వ్యయంతో రానున్న తొమ్మిదేళ్లలో 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల(కేవీ) ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
- 2025 అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా 662 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.
- 2024-25లో నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్) పాఠశాలలకు రూ.5370.79 కోట్లు గ్రాంట్‌గా ప్రభుత్వం కేటాయించింది.
- పీఎం శ్రీ పథకం కింద 913 కేవీఎస్, 620 ఎన్‌వీఎస్‌లు ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చెందాయి.
పరిచయం
దేశ భవిష్యత్తు నిర్మాణంలో భారతీయ విద్యా వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, విలువలను పెంపొందిస్తూ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో మూలస్తంభంగా పనిచేస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వంలోని విద్యాశాఖ కింద కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్), జవహర్ నవోదయ విద్యాలయ(జేఎన్‌వీ) స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా నాణ్యమైన, సమాన విద్యను ఇవి అందజేస్తున్నాయి.
ఒకే రకమైన, నాణ్యమైన విద్యను అందించడంపై కేవీఎస్ దృష్టి సారిస్తోంది. ప్రాథమికంగా బదిలీ అయ్యే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు సహా రక్షణ, పారామిలిటరీ సేవలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, ఇతర కేటగిరి ప్రజలు, ఒకే సంతానంగా ఉన్న బాలికలు, ఇలా క్రమ పద్ధతిలో పిల్లలకు అవకాశం అందిస్తోంది. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020కి అనుగుణంగా జాతీయ సమైక్యత, విద్యా ప్రావీణ్యాన్ని ప్రోత్సహిస్తోంది.
మరోవైపు గ్రామీణ పిల్లలను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి ఉచిత వసతితో కూడి విద్యను ఎన్‌వీఎస్ అందిస్తోంది. పట్టణ-గ్రామీణ విద్యా అంతరాలను తగ్గించి, విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడం ఎన్‌వీఎస్ లక్ష్యం. ఎన్ఈపీ 2020కి అనుగుణంగా ఎన్‌వీఎస్ పనిచేస్తోంది.
సమష్ఠిగా ఈ విద్యాసంస్థలు వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 15 లక్షల మంది విద్యార్థులకు సేవలు అందిస్తూ భారతదేశ పాఠశాల విద్యా వ్యవస్థ సమ్మిళిత అభివృద్ధి, సమానత్వానికి దోహదపడుతున్నాయి.
చరిత్రాత్మక పరిశీలన
కేంద్రీయ విద్యాలయాలే(కేవీ)గా ఎక్కువగా పిలిచే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరోవైపు నవోదయ విద్యాలయాలు(ఎన్‌వీ)గా పిలిచే నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలోని పాఠశాలలు ఉచిత వసతితో కూడిన విద్యను అందించడం ద్వారా గ్రామీణ ప్రతిభను పెంపొందిస్తున్నాయి. ఈ రెండూ సీబీఎస్ఈ విధానాన్ని పాటిస్తూ సమగ్ర అభ్యాసం, జాతీయ సమైక్యతను ప్రోత్సహిస్తున్నాయి.
కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్)
1963 నవంబర్‌లో ప్రారంభమైన(2025కి 62వ సంవత్సరం) కేవీఎస్ సెంట్రల్ స్కూల్స్ ఆర్గనైజేషన్(సీఎస్ఓ) నుంచి ఏర్పడింది. ఒకే రకమైన విద్యను అందించడం ద్వారా తరచూ బదిలీ అయ్యే, బదిలీ కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా అవసరాలు తీర్చడం కేవీ పాఠశాలల లక్ష్యం.

మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రతిపాదల ద్వారా నిరంతర విస్తరణ, వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ద్వారా గత కొన్నేళ్లుగా కేవీలు జాతీయస్థాయి వ్యవస్థగా ఆవిర్భవించాయి.
అన్ని కేంద్రీయ విద్యాలయాలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)కి అనుబంధంగా పనిచేస్తాయి. నేషనల్ కరికలం ఫ్రేమ్‌వర్క్(ఎన్‌సీఎఫ్)-2023, ఇటీవలి మార్గదర్శకాలకు అనుగుణంగా బలవాటికా 1, 2, 3తో పాటు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠ్యాంశాలు అందిస్తాయి. విద్య, కో-కరికులర్ కార్యక్రమాలు, నైపుణ్య ఆధారిత అభ్యాసంపై ప్రత్యేక దృష్టితో విద్యార్థుల సమగ్రాభివృద్ధి కోసం ఈ కరికలం రూపొందింది.
నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్)
విద్యపై జాతీయ విధానం-1986 కింద నవోదయ విద్యాలయ సమితి ప్రారంభమైంది. వసతితో కూడిన విద్య, సీబీఎస్ఈకి అనుబంధంగా కో-ఎడ్యుకేషన్ సౌకర్యాలతో ప్రయోగాత్మకంగా 2 పాఠశాలలతో ఎన్‌వీఎస్ ప్రారంభమైంది. సామాజిక, ఆర్థిక నేపథ్యాలతో సంబంధం లేకుండా గ్రామీణ నేపథ్యం కలిగిన ప్రతిభావంతులైన పిల్లలకు ఉచితంగా, నాణ్యమైన విద్యను అందించడం దీని లక్ష్యం.

2025 అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా 622 నవోదయ విద్యాలయాలు పనిచేస్తున్నాయి.
అన్ని నవోదయ విద్యాలయ సమితి పాఠశాలలు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్ఈ పాఠ్య ప్రణాళిక అమలు చేస్తున్నాయి. నేషనల్ కరికలం ఫ్రేమ్‌వర్క్(ఎన్‌సీఎఫ్) మార్గదర్శకాలకు అనుగుణంగా బహుభాషలను, సాంస్కృతిక సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించేందుకు త్రిభాషా విధానాన్ని(ప్రాంతీయ భాష, హిందీ/ఆంగ్లం, విద్యార్థికి సంబంధించి మూడో ఆధునిక భారతీయ భాష) అమలు చేస్తున్నాయి.
కేవీఎస్, ఎన్‌వీస్‌లో మౌలిక సదుపాయాలు
కేంద్రీయ విద్యాలయ సంఘటన్, నవోదయ విద్యాలయ సమితి సీబీఎస్ఈ నిబంధనల మేరకు సైన్స్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, క్రీడా మైదానాలు వంటి సౌకర్యాలను కలిగి ఉంటాయి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు వాటి ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తాయి. అంటే, పట్టణ ప్రాంతాల్లో ఉండే కేవీఎస్ అధునాతన సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహిస్తుండగా, ఎన్‌వీఎస్ గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సమృద్ధి కోసం అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నాయి.
|
అంశం
|
కేవీ(కేంద్రీయ విద్యాలయాలు)
|
ఎన్‌వీ(నవోదయ విద్యాలయాలు)
|
|
పాఠశాలల సంఖ్య
|
1,290 [2]
|
689 మంజూరు(జిల్లాకు ఒక ఆశ్రమ పాఠశాల)
|
|
విద్యార్థుల సామర్థ్యం
|
13,71,306[3]
|
3,10,517(30.09.2025 వరకు)
|
|
సౌకర్యాలపై దృష్టి
|
డిజిటల్ భాషా ల్యాబ్‌లు, ఈ-తరగతిగదులు
|
స్మార్ట్ తరగతి గదులు, డిజిటల్ భాషా ల్యాబ్‌లు
|
|
భౌగోళిక విస్తరణ
|
అర్బన్/సెమీ అర్బన్
|
గ్రామీణ ప్రాంతాలు(మారుమూల జిల్లాలు)
|
నిధులు: వ్యూహాత్మక కేటాయింపులతో సుస్థిర వృద్ధి
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల మద్దతుతో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పాఠశాలలు నిరంతరాయంగా పనిచేయడంతో పాటు విస్తరిస్తున్నాయి.


ఎన్‌వీల కోసం 2024-25లో రూ.5,370.79 కోట్ల కేటాయింపుతో వసతిగృహాల నిర్వహణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలకు ప్రాధాన్యతను ఇస్తోంది. దీనికి అదనంగా 2024 ఏప్రిల్ 1 నాటికి నిల్వ ఉన్న రూ.585.34 కోట్లను 2024-25లో సంవత్సరంలో వినియోగించేందుకు అనుమతి ఉంది. దీంతో పాటు రూ.44.70 కోట్ల అంతర్గత ఆదాయం వచ్చింది. మొత్తంగా 2024-25లో ఎన్‌వీలకు రూ.6,000.83 కోట్లు అందుబాటులో ఉన్నాయి.
2025 మైలురాళ్లు: విస్తరణ, డిజిటల్ ప్రోత్సాహం
జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020 లక్ష్యాల మేరకు 2025లో కేవీఎస్, ఎన్‌వీఎస్ వృద్ధి, సాంకేతికత వినియోగాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ కార్యక్రమాలు కేవలం భౌతిక వసతులను పెంచడమే కాకుండా విద్యార్థులను భవిష్యత్తుకు తగ్గట్టుగా సిద్ధం చేలా నూతన బోధనా పద్ధతులను అమలు చేస్తున్నాయి.
2026-27 నుంచి తొమ్మిదేళ్ల కాలంలో దాదాపు రూ.5,862.55 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 57 కొత్త కేవీలు స్థాపించేందుకు 2025 అక్టోబర్ 1న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మొత్తం నిధుల్లో రూ.2,585.52 కోట్లు మూలధన వ్యయం(భూమి, భవనాలు, సామాగ్రి)కి కాగా, రూ.3,277.03 కోట్లు నిర్వహణ ఖర్చులకు కేటాయించనుంది. ఈ నిర్ణయం వెనుకబడిన జిల్లాలే లక్ష్యంగా విద్యార్థులకు విద్యాలయాలు అందుబాటులోకి తేవడంతో పాటు బహుభాషావాదం, నైపుణ్యాభివృద్ధి వంటి జాతీయ విద్యా విధాన లక్ష్యాలను బలోపేతం చేస్తుంది. దీంతో పాటు పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎం శ్రీ) కింద 913 కేవీల ఆధునికీకరణ జరిగింది. యాక్టివిటీ బేస్ట్ అభ్యాస ప్రదేశాలు, డిజిటల్ వనరుల కేంద్రాలు వంటి ప్రత్యేకతలు ఎన్ఈపీ సంకల్పానికి అనుగుణంగా నాయకత్వ కార్యక్రమాలతో ఈ పాఠశాలలు ఆదర్శ విద్యాసంస్థలుగా మారాయి.
2024-2025 నుంచి 2028-2029 వరకు ఐదేళ్ల కాలంలో రూ.2,359.82 కోట్ల వ్యయంతో 28 కొత్త ఎన్‌వీల స్థాపనకు 2024 డిసెంబర్ 6న ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో రూ.1,944.19 కోట్లు మూలధన వ్యయం కాగా, రూ.415.63 కోట్లు నిర్వహణ ఖర్చులు.
డిజిటల్ వినియోగం: సాంకేతికత ద్వారా తరగతి గదులు శక్తివంతం
పీఎం శ్రీ పథకం ద్వారా 2025లో కేంద్రీయ విద్యాలయ సంఘటన్, నవోదయ విద్యాలయ సమితి పాఠశాలలు అధునాతన డిజిటల్ కార్యక్రమాలను చేపట్టాయి. 2025 అక్టోబర్‌లో నవీకరించిన కేవీఎస్ సమగ్ర ఐసీటీ చట్రం ద్వారా 90 శాతం పాఠశాలల్లో స్మార్ట్ తరగతిగదులు, ఏఐ ఆధారిత అభ్యాస పరికరాలు, వర్చువల్ ల్యాబ్‌లు, ఎన్ఈపీ అనుబంధ కంటెంట్‌తో కూడిన దీక్ష వేదిక ద్వారా హైబ్రిడ్ తరగతులు ఏర్పాటయ్యాయి.

స్మార్ట్ తరగతి గదులతో నవోదయ విద్యాలయ సైతం డిజిటల్‌గా మారుతున్నాయి. నవోదయ పాఠశాలల్లో ఇప్పటివరకు 9,417 స్మార్ట్ తరగతి గదులు, ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి. 311 పాఠశాలలకు ప్రత్యేక ఇంటర్నెట్ సరఫరా ఉంది. మిగతా నవోదయ పాఠశాలలకు సైతం బ్రాండ్‌బాండ్ ఇంటర్నెట్ ఉంది. శాశ్వత ప్రాంగణాల్లో ఉన్న అన్ని నవోదయ విద్యాలయల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్నాయి. ఐటీ మౌలిక సదుపాయాల బలోపేతం కోసం ప్రతి పాఠశాలకు ఎన్‌వీఎస్ డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లు అందజేస్తోంది. ప్రస్తుం ప్రతి పాఠశాలకు దాదాపు 40 డెస్క్‌టాప్‌లు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో కలిపి 26,118 డిస్క్‌టాప్‌లు ఉన్నాయి. పీఎం శ్రీ ప్రాజెక్టు కింద 312 డిజిటల్ భాషా ప్రయోగశాలలు సైతం ఏర్పాటయ్యాయి. సీబీఎస్ఈ సీఎస్ఆర్ ప్రాజెక్టు కింద 100 ఆంగ్ల, 100 హిందీ భాషా ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి.
పీఎం శ్రీ పథకం: ఉత్తమ విద్యాసంస్థల దిశగా ప్రయాణం
2025లో విస్తరణ, డిజిటల్ విధానాల అమలు కొనసాగడంతో పాటు ఎంపిక చేసిన కేవీఎస్, ఎన్‌వీఎస్ పాఠశాలలను నవీకరిస్తూ జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020కి నమూనాగా మార్చేందుకు ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎం శ్రీ) పథకం పరివర్తనాత్మక శక్తిగా పనిచేస్తోంది. 2022లో ప్రారంభమైన ఈ పథకం 2022-2027 మధ్యకాలంలో ఐదేళ్ల పాటు రూ.27,360 కోట్లతో 2027 నాటికి 14,500కు పైగా పాఠశాలలను సమగ్ర అభ్యాస కేంద్రాలుగా మార్చడం లక్ష్యం. ఈ పాఠశాలలు సమీ విద్యాసంస్థలు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా సమానమైన, నాణ్యమైన విద్య, ఆవిష్కరణల దిశగా మార్గదర్శకంగా పనిచేస్తాయి. బహుళ విధాన పాఠ్యాంశాలు, అనుభవపూర్వక అభ్యాసం, స్థిరమైన పద్ధతుల ద్వారా పీఎం శ్రీ పథకం మౌలిక సదుపాయాలు, బోధనా అంతరాలను తగ్గిస్తూ కేవీఎస్ పాఠశాలలు పట్టణ దృష్టితో స్థిరత్వం, ఎన్‌వీ పాఠశాలలు గ్రామీణ సాధికారత దిశగా పనిచేసేలా, సమ్మిళత విద్య కోసం జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేలా దోహదపడుతోంది.
సమష్టి బలాలు: కేవీఎస్, ఎన్‌వీఎస్‌లపై పీఎం శ్రీ ప్రభావం
913 కేంద్రీయ విద్యాలయాల్లో అధునాతన బోధనా పద్ధతులను చేర్చడం ద్వారా బదిలీ అయ్యే, బదిలీ కానీ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు సేవలందించడంలో కేవీఎస్ పాత్రను పీఎం శ్రీ పథకం నవీకరిస్తోంది. క్రియాశీలక అభ్యాస పద్ధతులు, డిజిటల్ వనరులు, నాయకత్వ అభివృద్ధి అవకాశాలు కల్పించడం ద్వారా క్రియాశీల అభ్యాస వాతావరణాలను పెంపొందిస్తోంది. ఎకో-క్లబ్‌లు, వొకేషనల్ ల్యాబ్‌లు వంటి వసతులు ఎన్ఈపీ లక్ష్యాలకు మద్దతు ఇస్తున్నాయి. ఇప్పుడు మెజారిటీ పీఎం శ్రీ కేవీల్లో స్మార్ట్ తరగతి గదులు, ఏఐ సాధనాలు ఉన్నాయి. ఇవి పట్టణ ప్రాంతాల్లో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులకు మేలు చేస్తున్నాయి.
జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం దాదాపు అన్ని(620) నవోదయ విద్యాలయాలు, పీఎం శ్రీ పాఠశాలలుగా గుర్తింపు పొందాయి. ఇవి నమూనా విద్యాసంస్థలు పనిచేస్తూ మిగతా పాఠశాలలు పాటించేలా బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తున్నాయి. ఎన్ఈపీ లక్ష్యాలకు అనుగుణంగా ఈ పథకం గ్రామీణ ప్రతిభను పెంపొందిస్తూ పాఠశాలలను డిజిటల్ నైపుణ్య కేంద్రాలు, సాంస్కృతిక మార్పిడీ కార్యక్రమాలతో ఆవిష్కరణ కేంద్రాలుగా మారుస్తోంది. ఈ భాగస్వామ్యం విద్యాపరమైన ఫలితాలు మెరుగుపర్చడంతో పాటు జాతీయ సమైక్యతను ప్రోత్సహిస్తోంది. నైపుణ్య, సమైక్య భారత్ నిర్మాణంలో కేవీఎస్, ఎన్‌వీఎస్‌ను నాయకత్వం వహించేలా మారుస్తోంది.
పునాదులే ప్రథమం: ఈసీసీఈతో కేవీఎస్, ఎన్‌వీఎస్, బాల్‌వాటికల కోసం అభ్యాసం
ఉన్నత విద్యలో డిజిటల్, మౌలిక సదుపాయాలు పెరుగుతున్నందున ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్(ఈసీసీఈ) పునాదిగా మారింది. 3-8 ఏళ్ల మధ్య పిల్లల్లో అభిజ్ఞా, సామాజిక-భావోద్వేగ, శారీరక వృద్ధిని పెంపొందించాలనే ఎన్ఈపీ 2020 దృష్టితో ఈసీసీఈ పనిచేస్తుంది. నేషనల్ కరికలర్ అండ్ పెడగాజికల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్(ఎన్‌సీపీఎఫ్ఈసీసీఈ) ద్వారా ఆటల ఆధారిత, బహుభాషా ఈసీసీఈ పాఠ్యాంశాలను ఎన్ఈపీ తప్పనిసరి చేసింది. తద్వారా 2030 నాటికల్లా 3వ గ్రేడ్ నాటికి ప్రాథమిక అక్షరాస్యత, అంకెలను నేర్చుకునేలా ఆనందకరమైన అభ్యాస విధానాన్ని నెలకొల్పడం దీని లక్ష్యం. కేంద్రీయ పాఠశాల వ్యవస్థల్లో ఏకీకృతమై, ప్రాథమిక స్థాయిలో విద్యా సమానత్వం సాధించడానికి సహాయపడుతోంది.

చిన్నారుల్లో మేధస్సు పెంపొందించడం: కేవీఎస్, ఎన్‌వీఎస్‌లో ఈసీసీఈ అమలులో బాలవాటికల పాత్ర

505 పాఠశాలల్లో బాలవాటిక కార్యక్రమం అమలు ద్వారా ఈసీసీఈలో కేవీఎస్ అగ్రగామిగా నిలుస్తోంది. క్రియాశీలక అభ్యాస పద్ధతుల ఆధారంగా, ఆటలు, కళలు, ప్రాథమిక అక్షరాస్యతను సమన్వయం చేస్తూ చిన్నారుల్లో నైపుణ్యాలను పెంపొందిస్తోంది. వేలాది మంది చిన్నారులకు సంప్రదాయ విద్య కాకుండా ఒత్తిడి లేని ప్రీస్కూల్ విద్యను అందిస్తోంది. 2025లో ఆమోదించి 57 కొత్త కేవీల్లో బాలవాటికలు ప్రారంభ దశ నుంచే భాగంగా ఉండనున్నాయి. తద్వారా ప్రతి పాఠశాలలో 240 మంది విద్యార్థులు అనే నిబంధన ప్రకారం సుమారు 13,680 మంది విద్యార్థులకు బాలవాటిక 1, 2, 3 తరగతులు లభిస్తాయి. ఇది జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020లోని 5+3+3+4 విద్యా విధానంతో అనుసంధానమై ఉంటుంది. కాగా, బాలవాటికల్లో దివ్యాంగులైన పిల్లలకు 3 శాతం రిజర్వేషన్లు కూడా అమలులో ఉంటాయి.
ఎన్‌వీఎస్ పాఠశాలలు సాధారణంగా 6 నుంచి 12వ తరగతి వరకు విద్యను అందిస్తున్నప్పటికీ ఈసీసీఈ ఉద్దేశాలను ప్రాథమిక స్థాయి పాఠ్యాంశాల్లో జోడిస్తున్నాయి. వొకేషనల్, డిజిటల్ విధానాల ద్వారా ప్రాథమిక నైపుణ్యాలు నిర్మించడంలో గ్రామీణ అంతరాలను తగ్గించాలనే ఎన్ఈపీ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి. తద్వారా బాలవాటికలో చదివిన విద్యార్థులు సుస్థిర సమగ్ర వృద్ధి కోసం భవిష్యత్తులో మెరిట్ ఆధారిత నవోదయ ప్రవేశాలను సులభంగా దక్కించుకునే అవకాశం కల్పిస్తు్ననాయి. ఈ సమగ్ర వ్యవస్థ దేశవ్యాప్తంగా 15 లక్షలకు పైగా విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు అందించడంతో పాటు వారు జ్ఞాన ఆధారిత భవిష్యత్తులో ముందంజలో నిలిచేందుకు దోహదపడుతోంది.
ముగింపు: భారతదేశ భవిష్యత్తు కోసం ఏకీకృత విద్యా వ్యవస్థ నిర్మాణం
సమాన, పరివర్తనాత్మక విద్య అందించాలనే భారత ప్రభుత్వ నిబద్ధతను కేవీఎస్, ఎన్‌వీఎస్‌లు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచడం, గ్రామీణ ప్రాంతాల సాధికారతను సమన్వయం చేయడం ద్వారా 2025 నాటికి సుమారు 16.5 లక్షల మంది విద్యార్థులను శక్తివంతులను చేస్తున్నాయి. 1963లో ప్రారంభమైన కేవీఎస్ నిరంతరాయ విద్యను అందిస్తుండగా, 1986లో ప్రారంభమైన ఎన్‌వీఎస్ గ్రామీణ భారత్‌లో ప్రతిభ ఆధారిత అవకాశాలను ముందుకు తీసుకెళ్తున్నాయి. బలమైన మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక నిధుల కేటాయింపు, 57 కొత్త కేవీలు, 28 ఎన్‌వీలతో ప్రణాళికబద్ధమైన 2025 విస్తరణ నిర్ణయాల ద్వారా ఈ రెండు సంస్థలు సమగ్ర, నైపుణ్యాల కల్పనపై దృష్టితో అభ్యాసం వంటి ఎన్ఈపీ 2020 సంకల్పం దిశగా రెండు నడుస్తున్నాయి. పీఎం శ్రీ పథకం ద్వారా 1,213 పాఠశాలల ఆధునికీకరణ, బాలవాటికల ద్వారా ఈసీసీఈ విధానం అమలుతో డిజిటల్ అంతరాలను తగ్గించడంతో పాటు జాతీయ సమైక్యతను ప్రోత్సహిస్తున్నాయి. భవిష్యత్తు నాయకులను తయారుచేయడంతో పాటు ప్రతి చిన్నారి భవిష్యత్తులో భారతదేశ సమృద్ధి, సమగ్రతకు తోడ్పడేలా చేస్తున్నాయి.
References:
Press Information Bureau:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2173548
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2081688
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2091737
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1857410
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2173548#:~:text=State/UTs/Ministries/Departments,13.62%20lakh%20(approx.)
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2081688#:~:text=As%20on%20date%2C%20there%20are,education%20is%20accessible%20to%20all
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1857409
Kendriya Vidyalay Sangathan:
https://www.facebook.com/KVSHQ/
https://kvsangathan.nic.in/%e0%a4%95%e0%a5%87-%e0%a4%b5%e0%a4%bf-%e0%a4%b8%e0%a4%82-%e0%a4%aa%e0%a4%b0%e0%a4%bf%e0%a4%95%e0%a4%b2%e0%a5%8d%e0%a4%aa%e0%a4%a8%e0%a4%be-%e0%a4%8f%e0%a4%b5%e0%a4%82-%e0%a4%89%e0%a4%a6%e0%a5%8d/
https://cdnbbsr.s3waas.gov.in/s32d2ca7eedf739ef4c3800713ec482e1a/uploads/2024/02/2024021425.pdf
https://cdnbbsr.s3waas.gov.in/s32d2ca7eedf739ef4c3800713ec482e1a/uploads/2023/11/2023112463.pdf
https://kvsangathan.nic.in/%e0%a4%aa%e0%a5%80%e0%a4%8f%e0%a4%ae-%e0%a4%b6%e0%a5%8d%e0%a4%b0%e0%a5%80-%e0%a4%b8%e0%a5%8d%e0%a4%95%e0%a5%82%e0%a4%b2/
https://kvsangathan.nic.in/en/bal-vatika/
https://kvsangathan.nic.in/en/admission-guidelines/
https://kvsangathan.nic.in/en/ict-infrastructure/
https://kvsangathan.nic.in/en/pm-shri-schools/
https://kvsangathan.nic.in/
https://kvsangathan.nic.in/en/kvs-vision-and-mission/
https://kvsangathan.nic.in/en/syllabus/?_archive=1
https://balvatika.kvs.gov.in/participated-kendriya-vidyalaya
https://bsfbagafa.kvs.ac.in/en/bal-vatika/#:~:text=Balvatika%20in%20Kendriya%20Vidyalayas%20(KVs,foundational%20base%20for%20lifelong%20learning
https://balvatika.kvs.gov.in/participated-kendriya-vidyalaya
https://cdnbbsr.s3waas.gov.in/s3kv059b7bb73d948b38d0ac3e1f8f5515/uploads/2024/07/2024070674.pdf
Navodaya Vidyalaya Samiti:
https://navodaya.gov.in/nvs/nvs-school/GODDA/en/academics/Computer-education-ICT/
https://navodaya.gov.in/nvs/en/About-Us/Establishment-of-JNVs/
https://navodaya.gov.in/nvs/en/Academic/Student-Profile/
https://navodaya.gov.in/nvs/nvs-school/DHANBAD/en/academics/Computer-education-ICT/
https://navodaya.gov.in/nvs/en/Academic/Academic-Excellance/
https://navodaya.gov.in/nvs/en/About-Us/Vision-Mission/#:~:text=Navodaya%20Vidyalaya%20Scheme,the%20best%20of%20rural%20talent
PM Shri:
https://pmshrischools.education.gov.in/
Ministry of Education:
https://dsel.education.gov.in/en/pm-shri-schools
Central Board of Secondary Education:
https://cbseacademic.nic.in/web_material/Curriculum16/SrSecondary/Initial%20pages.pdf
Others:
https://news.samsung.com/in/samsung-smart-school-to-take-digital-education-to-less-privileged-students-in-remotest-parts-of-india-with-smart-classes-at-80-more-navodaya-schools#:~:text=JNV%20schools%20are%20run%20by,digital%20literacy%20to%20rural%20India.%E2%80%9D
From Urban Hubs to Rural Heartlands
****
(Backgrounder ID: 155995)
Visitor Counter : 3
Provide suggestions / comments