PIB Headquarters

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఇండియా పోస్ట్’ ప్రత్యేక కవర్ విడుదల

నాడు పోస్టు చేయడమైనది: 05 JUN 2017 7:41PM by PIB Hyderabad
Press Release photo

  ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీ నాడు ప్రపంచ పర్యావరణ దినం’’గా జరుపుకొంటున్నారు.  మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి చేపట్టదగిన కార్యాచరణపై ప్రపంచవ్యాప్తంగా జాగృతిని పెంపొందింపజేయడం కోసం ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు.  ప్రతి ఏటా ఒక ప్రత్యేక ఇతివృత్తాన్ని తీసుకొని దానికి సంబంధించి ప్రజలలో అవగాహనను పెంపొందిస్తున్నారు.  అలాగేఈ సంవత్సరం కనెక్టింగ్ పీపుల్ టు నేచర్ – ఇన్ ద సిటీ అండ్ ఆన్ ది ల్యాండ్ఫ్రమ్ ది పోల్స్ టు ది ఈక్వేటర్’’ ను ఇతివృత్తంగా ఎంచుకున్నారు. 

 

     ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా 2017 జూన్ 5న ఒక ప్రత్యేక కవర్ ను ఇండియా పోస్ట్ విడుదల చేసింది.  హైదరాబాద్ జనరల్ పోస్టాఫీసులో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ పోస్టల్  సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బ్రిగేడియర్ బి. చంద్రశేఖర్ ప్రత్యేక కవర్ ను విడుదల చేశారు.  ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన హైదరాబాద్ పత్రికా సమాచార కార్యాలయం అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పి.జె. సుధాకర్ కు ప్రత్యేక కవర్ ను హైదరాబాద్ ప్రాంత చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్  అందజేశారు.

***


(రిలీజ్ ఐడి: 1491847) సందర్శకుల సూచీ సంఖ్య : : 180
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English