నౌకారవాణా మంత్రిత్వ శాఖ
కొవిడ్-19ని ఎదుర్కోడానికి పోర్టులకు సంబంధించిన వారితో శ్రీ మన్సుఖ్ మాండవియా వీడియో కాన్ఫరెన్స్
నాడు పోస్టు చేయడమైనది:
03 APR 2020 7:34PM by PIB Hyderabad
ఓడరేవుల కార్యకలాపాలలో భాగస్వామ్యులయ్యే వినియోగదారులు, కొరియర్, కార్గో సర్వీసులు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కస్టమ్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్ల తో షిప్పింగ్ మంత్రి (ఇంచార్జి) శ్రీ మన్సుఖ్ మాండవియా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో లాక్డౌన్ కారణంగా ఓడ రేవుల కార్యకలాపాలపై ప్రభావం, ఎదురయ్యే సవాళ్లు, తీసుకుంటున్న చర్యలను ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారులు, అన్ని ప్రధాన ఓడరేవుల చైర్‌పర్సన్‌లు పాల్గొన్నారు
ఈ అసాధారణమైన సంక్షోభంలో ఓడరేవుల సంబంధిత అన్ని వ్యవస్థలు, వ్యక్తుల సహకారం కావాలని శ్రీ మన్సుఖ్ మాండవియా విజ్ఞప్తి చేశారు. ఈ సంక్షోభాన్ని పోర్ట్ ఆపరేషన్ కోసం అవకాశంగా మార్చడానికి ప్రయత్నాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు, తద్వారా వీటితో సంధానమై ఉన్న వ్యవస్థలు సజావుగా నడుస్తాయన్నారు.
ఓడరేవులు, నిర్వహణ, కార్మికుల భద్రత,c దాని వాటాదారులు ఎదుర్కొంటున్న ఇతర సవాళ్లకు సూచనలను శ్రీ మాండవియా ఆహ్వానించారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను నిర్వహించడానికి పోర్ట్ ఆపరేషన్ మరియు కంటైనర్ మేనేజ్‌మెంట్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై శ్రీ మాండవియా నొక్కి చెప్పారు.
అధిక పోర్టు ఆపరేషన్ వ్యయం, సరుకు రవాణా, ఓడరేవు రద్దీ, కార్మికుల కొరత, కార్మికులు, ట్రక్ డ్రైవర్ల కదలిక, సరఫరా నిర్వహణ, లాక్డౌన్ కారణంగా ఇతర ఇబ్బందులపై ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
****
(రిలీజ్ ఐడి: 1610906)
సందర్శకుల సూచీ సంఖ్య : : 181