రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌


కరోనా వైరస్‌ నియంత్రణ, కొవిడ్‌-19 తర్వాతి పరిస్థితులపై చర్చ
ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని కొనసాగించేందుకు సంసిద్ధత

Posted On: 26 MAY 2020 3:28PM by PIB Hyderabad

    కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి లిండా రేనాల్డ్స్‌తో ఫోన్‌లో సంభాషించారు. కొవిడ్‌ మహమ్మారి నియంత్రణకు తమ తమ దేశాల్లో చేపడుతున్న చర్యలపై ఇరువురూ చర్చించారు. కరోనా వైరస్‌కు కళ్లెం వేసేందుకు చేస్తున్న ప్రపంచ ప్రయత్నాల్లో భారత్‌ సహకారాన్ని శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌, లిండా రేనాడ్డ్స్‌కు వివరించారు. ఈ పోరాటంలో పరస్పరం సహకరించుకోదగిన అంశాలపైనా మాట్లాడుకున్నారు. కొవిడ్‌ సంక్షోభం ముగిసిన తర్వాత ఉత్పన్నమయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్‌-ఆస్ట్రేలియా అనుసరించే వ్యూహాత్మక భాగస్వామ్యం రెండు దేశాలు కలిసి పనిచేయడానికి మంచి పునాది అవుతుందని ఇరువురూ అంగీకరించారు. ఇదే అంశంలో, ఇతర దేశాలతో భాగస్వామ్యాల విషయంలోనూ ఇది మార్గంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

    భారత్‌-ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా, ద్వైపాక్షిక రక్షణ సహకార కార్యక్రమాలను కొనసాగించేందుకు ఇరువురు రక్షణ మంత్రులు తమ నిబద్ధతను తెలియజేశారు.


(Release ID: 1626965)