హోం మంత్రిత్వ శాఖ

పేదలకు ఉచితంగా రేషన్‌ అందించే 'ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన'ను నవంబర్ వరకు పొడిగించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీని అభినందించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా


పేదల సంక్షేమానికి కట్టుబడిన ప్రధాని నిబద్ధతకు ఈ పథకం పొడిగింపు నిదర్శనం: అమిత్‌ షా

"ఈ పథకం కారణంగా ఎవరూ ఆకలితో నిద్రపోరు, విజయవంతంగా అమలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు": అమిత్‌ షా

కష్టజీవులైన రైతులకు, నిజాయతీగా పన్నులు చెల్లిస్తున్నవారికి కూడా కృతజ్ఞతలు తెలిపిన అమిత్‌ షా

నాడు పోస్టు చేయడమైనది: 30 JUN 2020 7:54PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు ఉచితంగా రేషన్‌ సరుకులు అందించే 'ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన'ను నవంబర్ వరకు పొడిగించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.

                రైతుల కష్టార్జితం, పన్ను చెల్లింపుదారుల నిబద్ధత, ఈ కష్ట సమయంలో అవసరార్థులను ఆదుకుంటున్నాయని ట్వీట్‌లో పేర్కొన్నారు.

                పేదల సంక్షేమానికి కట్టుబడిన ప్రధాని నిబద్ధతకు, 'ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన' పొడిగింపు ఒక నిదర్శనమని అమిత్‌ షా అభివర్ణించారు. పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ, దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా చూసినందుకు ప్రధాని మోదీకి హోంమంత్రి అమిత్‌ షా కృతజ్ఞతలు తెలిపారు.

 

 

 

*******


(రిలీజ్ ఐడి: 1635743) సందర్శకుల సూచీ సంఖ్య : : 290
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , Manipuri , Punjabi , Tamil