ఆర్థిక మంత్రిత్వ శాఖ
సావరిన్ గోల్డ్ బాండ్ల పథకం 2020-21 (సిరీస్-4) - ధర ప్రకటన
నాడు పోస్టు చేయడమైనది:
04 JUL 2020 12:32PM by PIB Hyderabad
2020 ఏప్రిల్ 13న భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ నం. F.No.4(4)-B/(W&M)/2020 ప్రకారం, 2020-21 సావరిన్ గోల్డ్ బాండ్ల అమ్మకం (సిరీస్-4) ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఈనెల 14వ తేదీని సెటిల్‌మెంట్ తేదీగా నిర్ణయించారు. సబ్‌స్క్రిప్షన్ గడువులో బంగారం ధరను గ్రాముకు రూ.4,852 గా నిర్ణయించారు. జులై 3వ తేదీన రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన పత్రికా ప్రకటనలోనూ దీనిని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేసేవారికి గ్రాముకు రూ.50 చొప్పున తగ్గిస్తారు. వీరికి గ్రాముకు రూ.4,802 చొప్పున గోల్డ్ బాండ్లను పొందుతారు.
***
(రిలీజ్ ఐడి: 1636484)
సందర్శకుల సూచీ సంఖ్య : : 303