ప్రధాన మంత్రి కార్యాలయం

ఆత్మనిర్భర భారత్ సృజనాత్మక సవాలుకు ప్రధాని శ్రీకారం

Posted On: 04 JUL 2020 5:06PM by PIB Hyderabad

ఆత్మనిర్భర భారత్ సృజనాత్మక యాప్ చాలెంజ్ పథకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. పౌరులు ఇప్పటికే వినియోగిస్తున్న వివిధ కేటగికీల యాప్ లలో ఉత్తమమైన వాటిని గుర్తించేందుకు, ఆయా రంగాల్లో అవి అభివృద్ధి చెందేందుకు గల అవకాశాలను అంచనా వేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి ప్రమాణాలతోస్వదేశీ పరిజ్ఞానంతో యాప్ లను రూపకల్పన చేసే విషయమై సాంకేతిక నిపుణులు, స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారని అన్నారు.  వారి సృజనాత్మక భావనలను, ఉత్పాదనలకు తగిన అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, అటల్ ఇన్నవేటివ్ మిషన్ ద్వారా ఆత్మనిర్భర భారత్ పేరిట సృజనాత్మక యాప్ చాలెంజిని ప్రారంభిస్తున్నట్టు ప్రధాని చెప్పారు.

 ఈ చాలెంజ్ మీకోసమేనని, యాప్ రూపంలో మీరు వినియోగ యోగ్యమైన ఉత్పాదనను కలిగి ఉన్నా, అలాంటి ఉత్పాదనలను రూపకల్పన చేసే దార్శనికత, నైపుణ్యం మీకు ఉన్నా ఈ యాప్ చాలెంజి మీకోసమేనని ప్రధాని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, స్టార్టప్ కంపెనీలకు పిలుపునిచ్చారు.. సాంకేతిక పరిజ్ఞాన రంగంలోని తన మిత్రులందరూ ఈ చాలెంజీలో భాగస్వాములు కావచ్చని ప్రధానమంత్రి ఆహ్వానం పలికారు.

 

******


(Release ID: 1636568)