ప్రధాన మంత్రి కార్యాలయం
"ఇండియా గ్లోబల్ వీక్ 2020" కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ
30 దేశాల నుంచి పాల్గొనే 5 వేల మంది ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని
Posted On:
08 JUL 2020 5:40PM by PIB Hyderabad
"ఇండియా గ్లోబల్ వీక్ 2020" కార్యక్రమం తొలిరోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. "బీ ది రివైవల్: ఇండియా అండ్ ఏ బెటర్ న్యూ వరల్డ్" అంశంపై మూడు రోజులపాటు ఈ కార్యక్రమం వర్చువల్ విధానంలో జరగనుంది. ఇండియా గ్లోబల్ వీక్ 2020 కార్యక్రమంలో 30 దేశాల నుంచి ఐదు వేలమంది పాల్గొంటారు. 75 సెషన్లలో 250 మంది ప్రసంగిస్తారు.
భారత విదేశీ వ్యవహారాల మంత్రి డా.ఎస్.జైశంకర్, రైల్వే శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, జమ్ము&కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ను, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్, యూకే విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్, భారత్‌లో అమెరికా రాయబారి కేన్ జస్టర్ వంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
'ఆత్మనిర్భర్ భారత్' అంశంపై మధు నటరాజ్‌చే ప్రత్యేక ప్రదర్శన, సితార్ విద్వాంసుడు పండిత్ రవిశంకర్ వందో జయంతి సందర్భంగా, ఆయన ముగ్గురు ప్రముఖ శిష్యులచే నివాళి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.
****
(Release ID: 1637336)
Read this release in:
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam