ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

పూణె సీరమ్ ఇన్ స్టిట్యూట్ లో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయపు 2,3 దశల పరీక్షలకు అనుమతి

భారత్ లో 2.11% కు తగ్గిన మరణాల శాతం

మొత్తం కోలుకున్నవారు 11.8 లక్షల పై మాటే

Posted On: 03 AUG 2020 1:10PM by PIB Hyderabad

భారత్ లో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం వారి కరోనా వాక్సిన్ ట్రయల్స్ ను అనుమతి లభించింది. పూణెలోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ లో కోవిడ్-19 వాక్సిన్  ట్రయల్స్ జరపటానికి డ్రంగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి మంజూరు చేసింది. దీనివలన కరోనా వాక్సిన్ వెలువడే సమయం బాగా దగ్గరవుతుంది.


భారత్ లో పాజిటివ్ కేసులలో మరణాల సంఖ్య బాగా తగ్గిపోతోంది. ప్రపంచ స్థాయిలో అతి తక్కువ మరణాలతో తన స్థానాన్ని చాటుకోగలుగుతోంది. ఇప్పుడున్న మరణాల శాతం బాగా తగ్గిపోయి 2.11%  వద్ద  నిలిచింది. పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స చెయ్యి అనే త్రిసభ్య సూత్రాలను సమర్థంగా అమలు చేయటం వలన సాధ్యమైంది. 


కోవిడ్-19 మీద చికిత్సకు నిరంతరం ఏర్పాట్లు కొనసాగుతూ, పాజిటివ్ కేసులను త్వరగా గుర్తించటం, ఎక్కువ రిస్క్ ఉన్న జనాభాకు ప్రాధాన్యమివ్వటం, వాళ్ళకు గుర్తించటానికి క్షేత్ర స్థాయి సిబ్బందిని వాడుకోవటం లాంటి చర్యలు సత్ఫలితాలిచ్చాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 40,574 కరోనా బాధితులు కోలుకోగా ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 11,86,203  కు చేరింది. ఆవిధంగా చూసినప్పుడు పాజిటివ్ గా తేలినవాళ్లలో కోలుకున్నవారి శాతం 65.77% కు పెరిగింది.


రోజువారీ కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండటంతో చికిత్సలో ఉన్న బాధితుల సంఖ్యకూ, కోలుకున్నవారి సంఖ్యకూ మధ్య అంతరం బాగా పెరిగి 6  లక్షలు దాటింది. ప్రస్తుతం కోలుకున్నవారి సంఖ్య 6,06,846. దీనివలన చికిత్సలో ఉన్నవారి సంఖ్య 5,79,357 అయింది. వీళ్ళందరికీ వైద్యుల పర్యవేక్షణలోనో, ఇళ్లలోనే ఐసొలేషన్ లోనో చికిత్స అందుతోంది.


విదేశాలనుంచి భారత్ కు వచ్చే ప్రయాణీకుల విషయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ  2020 మే 24న ఇచ్చిన మార్గదర్శకాలను సవరించి తాజా మార్గదర్శకాలు రూపొందించింది. ఇవి 2020 ఆగస్టు 8వ తేదీ ఉదయం( తెల్లవారు జాము గం. 00.01 ని. నుండి ) అమలులోకి వస్తాయి. మరిన్ని వివరాల కోసం చూడాల్సిన వెబ్ సైట్: https://www.mohfw.gov.in/pdf/RevisedguidelinesforInternationalArrivals02082020.pdf


కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు

కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

 

****



(Release ID: 1643155) Visitor Counter : 262