గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పి.ఎం. స్వనిధి పథకం కింద 5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి

ఈ పథకం కింద ఒక లక్ష కు పైగా రుణాలను మంజూరు చేశారు.

Posted On: 12 AUG 2020 12:56PM by PIB Hyderabad

ప్రధానమంత్రి వీధి విక్రేతల ఆత్మ నిర్భర్ నిధి (పి.ఎం-స్వనిధి) పథకం 2020 జులై, 2వ తేదీన ప్రారంభమైన నాటి నుండి 41 రోజుల్లో రికార్డు సంఖ్యలో 5 లక్షలకు పైగా దరఖాస్తుల అందాయి. వాటిలో రికార్డు సంఖ్యలో లక్ష మందికి పైగా లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడం జరిగింది.  కోవిడ్-19 లాక్ ‌డౌన్ తర్వాత తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించడానికి సరసమైన వర్కింగ్ క్యాపిటల్ రుణాల లభ్యత కోసం చూస్తున్న వీధి విక్రేతలలో పి.ఎమ్-స్వనిధి పథకం గణనీయమైన ఉత్సాహాన్ని సృష్టించింది.

‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ఆధ్వర్యంలో పి.ఎం-స్వనిధి పథకాన్ని కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.  కోవిడ్-19 లాక్ ‌డౌన్ తర్వాత వారి వ్యాపారాలను తిరిగి ప్రారంభించడానికి వీలుగా పట్టణ పరిసర ప్రాంతాలు / గ్రామీణ ప్రాంతాల వారితో సహా పట్టణ ప్రాంతాలలో సుమారు 50 లక్షల మంది వీధి విక్రేతలకు ఒక సంవత్సర కాలంలో, ఒక్కొక్కరికీ 10,000 రూపాయల వరకు భాగస్వామ్య ఉచిత వర్కింగ్ క్యాపిటల్ రుణాలను అందుబాటులోకి తీసుకురావడం దీని లక్ష్యం.  క్రమం తప్పకుండా ఋణాలు తిరిగి చెల్లించిన వారికి 7 శాతం వడ్డీ రాయితీ తో పాటు, నిర్ణీత డిజిటల్ లావాదేవీలను చేపట్టినవారికి సంవత్సరానికి 1,200 రూపాయల మేర క్యాష్ బ్యాక్ రూపంలో ప్రోత్సాహకాలతో పాటు తిరిగి రుణాలు పొందడానికి అర్హత లభిస్తుంది.  

షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు అదనంగా రుణాలు ఇచ్చే సంస్థలుగా నాన్-బ్యాంకింగ్ ఆర్ధిక సంస్థలు (ఎన్.‌బి.ఎఫ్.‌సి) తో పాటు, ప్రభుత్వ, ప్రైవేట్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, స్వయం సహాయక బ్యాంకులు మొదలైనవాటితో సహా సూక్ష్మ-ఆర్ధిక సంస్థలు (ఎం.ఎఫ్.‌ఐ) లను నిమగ్నం చేయడం ద్వారా ఈ 'నానో-వ్యవస్థాపకులు' యొక్క 'ఇంటి ముంగిటకు బ్యాంకులు' తీసుకురావాలని పి.ఎమ్-స్వనిధి పథకం సంకల్పించింది.  అధికారిక పట్టణ ఆర్థిక వ్యవస్థలో భాగం కావడానికి విక్రేతల క్రెడిట్ ప్రొఫైల్‌ను రూపొందించడానికి డిజిటల్ చెల్లింపు వేదికలపై విక్రేతల బోర్డింగ్ చాలా ముఖ్యమైన భాగం.

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సి.ఐ.డి.బి.ఐ) ఈ పథకానికి అమలు భాగస్వామి.  వీధి విక్రేతలకు రుణాలు ఇవ్వడాన్ని ప్రోత్సహించడానికి క్రెడిట్ అండ్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సి.జి.టి.ఎం.ఎస్.ఈ) ద్వారా ఈ రుణ సంస్థలకు పోర్ట్‌ఫోలియో ప్రాతిపదికన గ్రేడెడ్ గ్యారెంటీ కవర్ అందించబడుతుంది.

వీధి విక్రేతలు ఎక్కువగా తమ వ్యాపారాలను చాలా తక్కువ లాభంతో  నిర్వహిస్తారు.  ఈ పథకం కింద అందజేసే మైక్రో-క్రెడిట్ మద్దతు అటువంటి అమ్మకందారులకు పెద్ద ఉపశమనం కలిగించడంతోపాటు, ఆర్థికంగా బలపడడానికి కూడా సహాయపడుతుంది. కనీస ప్రభుత్వం మరియు గరిష్ట పాలన లక్ష్యంతో సమాజంలోని ఈ విభాగానికి దాని పరిధిని మరియు ప్రయోజనాలను విస్తరించడంతో పాటు ఈ పథకాన్ని మరింతగా ఉపయోగించుకునేందుకు వీలుగా ఏకీకృత ఐ.టి. వేదిక (pmsvanidhi.mohua.org.in), వెబ్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ ను  అందుబాటులో ఉంచడం జరిగింది. 

 

*****



(Release ID: 1645312) Visitor Counter : 261