ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 8.3 లక్షల కోవిడ్ పరీక్షలు

ఇప్పటిదాకా జరిపిన పరీక్షలు 2.68 కోట్లు
పదిలక్షల్లో పరీక్షలు19,453 కి పెరుగుదల

Posted On: 13 AUG 2020 6:13PM by PIB Hyderabad

ఒకే రోజులో జరిపిన కోవిడ్ పరీక్షల సంఖ్యలో భారత్ మరో మైలు రాయి దాటింది. ఒక్క రోజు పరీక్షలు మొదటిసారిగా 8  లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,30,391  పరీక్షలు జరిగాయి. పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే త్రిముఖ వ్యూహం ఫలితంగా భారత్ లో రోజు వారీ పరీక్షల సంఖ్య  త్వరలోనే 10 లక్షలకు చేరుకోబోతోంది.

WhatsApp Image 2020-08-13 at 13.41.43.jpeg


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పట్టుదలతో పనిచేస్తూ దూకుడుగా పరీక్షలు జరపటం కారణంగా ముందు దశలోనే పాజిటివ్ కేసులను గుర్తించగలుగుతూ ఉన్నారు. రోజువారీ పరీక్షలు బాగా పెరుగుతూ ఉన్నాయి.  ఈ వారం రోజువారీ సగటు బాగా పెరిగింది. ప్రస్తుతం ఆ పెరుగుదల 2020  జులై మొదటివారంలో దాదాపు2.3  లక్షల నుంచి ఈ వారం 6.3  లక్షలకు చేరింది. 
గడిచిన 24  గంటల్లో రికార్డు స్థాయిలో రోజుకు జరిపే పరీక్షల సంఖ్య 8 లక్షలు దాటింది.ఇప్పటి వరకు జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య 2,68,45,688  కు చేరింది. దీంతో ప్రతి పది లక్షల్లో 19453 మందికి పరీక్షలు జరిపినట్టయింది. దేశవ్యాప్తంగాపరీక్షలు జరిపే లాబ్ ల నెట్ వర్క్ గణనీయంగా పెరగటం వలన జనవరిలో ఉన్న ఒక లాబ్ ఇప్పుడు 1433 లాబ్ లకు చేరింది. అందులో 947  ప్రభుత్వ రంగంలో ఉండగా 486 ప్రైవేట్ లాబ్ లు ఉన్నాయి. ఇది కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి సమన్వయ కృషికి నిదర్శనం.
రకరకాల లాబ్స్ ఇలా ఉన్నాయి. 
తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ :  733 (ప్రభుత్వ:  434  + ప్రైవేట్:  299)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 583  (ప్రభుత్వ: 480 + ప్రైవేట్: 103)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 117 (ప్రభుత్వ: 33  + ప్రైవేట్ 84 )
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
 

****



(Release ID: 1645581) Visitor Counter : 224