రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రేపు, ఆగస్టు 15 శనివారం, స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా కోవిడ్ -19 మహమ్మారి దృష్ట్యా ఎర్రకోట వద్ద రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది

Posted On: 14 AUG 2020 10:56AM by PIB Hyderabad

 

ఎర్రకోట వద్ద ఆగస్టు 15,2020న  స్వాతంత్య్ర  దినోత్సవం  సందర్బంగా పతాక ఆవిష్కరణను  రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.   ఒకవైపు మహమ్మారికి సంబంధించిన ముందుజాగ్రత్తలు తీసుకుంటూ జాతీయ ఉత్సవ  పవిత్రతకు మరియు హోదాకు భంగం కలుగకుండా చూస్తున్నారు.  

అంతరాయం లేకుండా జనం కదిలే విధంగా ఎక్కడా జనం గుమికూడకుండా కూర్చునే చోట్లను ఆవరణలుగా విడగొట్టారు.  వాటి మధ్యలో నడిచేందుకు చెక్కలపై తివాచీలు పరిచి దారులు ఏర్పాటు చేశారు.   ఆహ్వానితులందరూ తమకు కేటాయించిన చోట్లకు సులభంగా వెళ్లేందుకు వీలుగా  ప్రతిచోటా మెటల్ డిటెక్టర్లతో అదనపు ద్వారాలు ఏర్పాటు చేశారు. వీలయినంతవరకు  అనేక పార్కింగ్ స్థలాల వద్ద వాహనాలు సులభంగా వచ్చి పోయేందుకు వీలుగా ఇటుకలు పరచి దారులను గుర్తించారు.    

భద్రత కోసం గౌరవ వందనం సమర్పించే బృందం సభ్యులను క్వారెంటైన్ లో ఉంచడం జరిగింది.  

సీట్ల ఏర్పాటు / అమరికకు సంబంధించి  "రెండు గజాల దూరం"  (ఉత్సవ సమయంలో ఇద్దరు అతిధుల మధ్య ఆరు అడుగుల ఎడం) ఉండాలన్న నియమాన్ని పాటించారు.

స్వాతంత్య్ర దినోత్సవాలకు ఆహ్వానం ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు.   ఆహ్వానం లేనివారు వేదిక వద్దకు రావద్దని అభ్యర్ధించారు.  
అధికారులు, దౌత్యవేత్తలు, ప్రజలు, మీడియా తదితరులకు దాదాపు 4000 ఆహ్వానాలు పంపారు.  

 భద్రత కోసం  ఎన్ ఎన్ సి కేడెట్లను ఉత్సవానికి (స్కూలు పిల్లలకు బదులు)  ఆహ్వానించారు.   వారు కూర్చునేందుకు జ్ఞానపథ్ వద్ద స్థలం కేటాయించారు.    

 కోవిడ్ సంబంధ జాగ్రత్తలను తెలియజేసేందుకు ప్రతి ఆహ్వానంతో పాటు కోవిడ్ మార్గదర్శకాలను పాటించవలసిందిగా  ప్రత్యేక సూచనలను జారీచేయడం జరిగింది.   ఉత్సవం ముగిసిన తరువాత బయటికి వెళ్ళేటప్పుడు నిగ్రహంతో, ఓపికతో వేచి ఉండవలసిందినంగా  ఆహ్వానితులను  కోరుతూ అన్ని సీట్ల వద్ద  విజ్ఞప్తి కార్డులను ఉంచుతారు.  ఇందుకు సంబంధించి కార్యక్రమ వ్యాఖ్యాన కేంద్రాల నుంచి తరచుగా ప్రకటన చేస్తారు.  ట్రాఫిక్ పోలీసుల సూచనలలో కూడా ఇది ఉంటుంది.   రద్దీ ఏర్పడి తొక్కిడి కాకుండా క్రమ పద్ధతిలో బయటికి వెళ్లడాన్ని నియంత్రించేందుకు వివిధ ఆవరణలలో అధికారులు ఉంటారు.   ఇందుకు సంబంధించి
ఆహ్వానితులందరి సహకారాన్ని మనఃపూర్వకముగా మరియు ఏకరీతిలో కోరడం జరుగుతోంది.  

ఉత్సవ సంబంధమైన అభ్యాసాలకు  (డ్రిల్లు) కూడా  ఇతర ముందుజాగ్రత్త చర్యల వలనే  భౌతిక దూరం పాటిస్తూ సిద్ధం కావడం జరిగింది.  

ప్రవేశ ద్వారాల వద్ద పరీక్షలు జరుపుతున్నప్పుడు ఉత్సవానికి వచ్చిన వారిలో ఎవరికైనా కోవిడ్ -19 వ్యాధి లక్షణాలు కన్పిస్తే చికిత్స చేయడానికి నాలుగు చోట్ల తగిన రీతిలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది.   వాటిని ఎర్రకోట బురుజుల వద్ద ఒకటి,  మాధ వదాస్ పార్కు వద్ద ఒకటి,  పంద్రాగస్టు పార్కు వద్ద రెండు ఏర్పాటు చేశారు.  ఈ నాలుగు చోట్ల అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచుతున్నారు.  

అన్ని ప్రవేశ ద్వారాలు/ పాయింట్ల వద్ద ఆహ్వానితుల శరీర ఉష్ణోగ్రతను  పరీక్షిస్తారు.  క్రమం తప్పకుండా ఎర్రకోట లోపల, బయట శుద్ధిచేస్తున్నారు.  

ఆహ్వానితులను మాస్కు ధరించవలసిందిగా కోరడం జరిగింది.  అంతేకాక వేదిక వద్ద వివిధ చోట్ల తగిన సంఖ్యలో యోగ్యమైన మాస్కులను సిద్ధంగా ఉంచుతున్నారు.  అదేవిధంగా ముందుగా నిర్ధారించిన చోట్ల చేతులను శుద్ధి చేసుకునే శానిటైజర్లను,   ఈ విషయాన్ని ఆహ్వానితులకు జాగ్రత్తగా తెలిపే సూచికలను ఉంచుతున్నారు.  

జ్ఞానపథ్ వద్ద ఆ ప్రాంతాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దడానికి ఎన్ ఎన్ సి కేడెట్లు కూర్చున్న స్థలం వెనుక ప్రాంతాన్ని పూలతో  అలంకరిస్తున్నారు.  

***



(Release ID: 1645737) Visitor Counter : 240