ఆర్థిక మంత్రిత్వ శాఖ

క్యాపెక్స్‌ పై సి.పి.ఎస్.ఈ.ల 3 వ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన - కేంద్ర ఆర్థిక మంత్రి.

Posted On: 14 AUG 2020 5:17PM by PIB Hyderabad

ఈ ఆర్ధిక సంవత్సరంలో మూలధన వ్యయంపై సమీక్ష నిర్వహించడానికి గాను, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఈ రోజు, షిప్పింగ్, రోడ్డు రవాణా, రహదారులు, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలూ, రక్షణ, టెలికమ్యూనికేషన్సు మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో పాటు, ఈ మంత్రిత్వ శాఖలకు చెందిన 7 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లతో,  వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.   కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం కోసం కేంద్ర ఆర్థిక మంత్రి వివిధ భాగస్వాములతో జరుపుతున్న వరుస సమావేశాలలో ఇది మూడవ సమీక్షా సమావేశం. 

2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ 7 ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం క్యాపెక్స్ లక్ష్యం 1,24,825 కోట్ల రూపాయలు.  2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ 7 ప్రభుత్వరంగ సంస్థల మొత్తం క్యాపెక్స్ లక్ష్యం 1,29,821 కోట్ల రూపాయలు కాగా,  సాధించినది 1,14,730 కోట్ల రూపాయలు, అంటే 88.37 శాతం.  2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సాధించినది 20,172 కోట్ల రూపాయలు (15.53 శాతం) కాగా,  2020-21 ఆర్ధిక సంవత్సరంలో 2020, జూలై వరకు సాధించినది 24,933 కోట్ల రూపాయలు (20 శాతం).

2020-21 ఆర్ధిక సంవత్సరం రెండవ త్రైమాసికం ముగిసే నాటికి మూలధన వ్యయంలో 50 శాతం వరకు మూలధన వ్యయాన్ని నిర్ధారించడానికీ, దాని కోసం తగిన ప్రణాళికలను రూపొందించడానికీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును నిశితంగా పరిశీలించాలని, కేంద్ర ఆర్థిక మంత్రి సంబంధిత కార్యదర్శులను కోరారు.

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పెంపొందించడంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ముఖ్యమైన పాత్రను కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రస్తావిస్తూ, వారి లక్ష్యాలను సాధించడానికి మెరుగైన పనితీరును ప్రదర్శించాలని ప్రోత్సహించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను వారికి సమకూర్చిన మూలధన వ్యయాన్ని సరిగ్గా, సకాలంలో ఖర్చు చేయాలని సూచించారు. కోవిడ్-19 ప్రభావం నుండి ఆర్ధిక వ్యవస్థ కోలుకోవడానికి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మెరుగైన పనితీరు, పెద్ద ఎత్తున సహాయపడుతుందని ఆమె అన్నారు.

ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా వారు ఎదుర్కొంటున్న అవరోధాలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈ సందర్భంగా చర్చించాయి.  అసాధారణ పరిస్థితికి అసాధారణ ప్రయత్నాలు అవసరమని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. సమిష్టి ప్రయత్నాలతో, మనం మెరుగైన పనితీరును కనబరచడంతో పాటు, భారత ఆర్థిక వ్యవస్థ మంచి ఫలితాలను సాధించడానికి కూడా సహాయం చేయగలుగుతామని ఆమె సూచించారు. 

*****



(Release ID: 1645882) Visitor Counter : 208