ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

"స్వయం సమృద్ధం"గా ముందుకు దూసుకెళ్తున్న ఇండియా

కేవలం ఒక్క నెల రోజుల్లో 23 లక్షల వ్యక్తిగత సంరక్షణ సాధనాలు (పి పి ఇలు) ఎగుమతి చేసి ప్రపంచ స్థాయికి చేరిక

రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు 1.28 కోట్ల పి పి ఇలు పంపిణీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Posted On: 14 AUG 2020 2:52PM by PIB Hyderabad

కోవిడ్ - 19 పర్యవేక్షణలో  కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కలసి సమన్వయంతో ఉన్నతస్థాయి చర్యలు తీసుకుంటున్నది.    దేశవ్యాప్తంగా వైద్య మౌలిక సదుపాయాలను నిరంతరం పెంచుకుంటూ క్రమపద్ధతిలో విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది.  
కరోనా మహమ్మారి పుట్టిన తొలిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్ 95 రకం మాస్కులు,  పి పి ఇ కిట్లు,  వెంటిలేటర్లు మొదలగు అన్నిరకాల వైద్య ఉత్పత్తులకు కొరత ఉండింది.  మొదట్లో అవి ఇండియాలో తయారయ్యేవి కావు.   వైద్య ఉత్పత్తుల తయారీలో  అంశీభూతంగా ఉండే విడిపరికరాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి ఉండెడిది.  ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో విదేశీ మార్కెట్లలో కూడా ఆ పరికరాలకు కొరత ఏర్పడింది.  

మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితిని అవకాశంగా మలచుకొని  దేశీయ మార్కెట్ ను వైద్య చికిత్సకు అవసరమైన సరంజామా, సాధనాలు తయారీకి అనువుగా అభివృద్ధికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.   కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు  ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం,  జవుళి,  ఔషధ తయారీ,  పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్యంతో పాటు   రక్షణ శాఖకు చెందిన  రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డి ఆర్ డి ఓ)  తదితర సంస్థల సమన్వయంతో కృషిచేసిన ఇండియా ఉత్పత్తి సామర్ధ్యాన్ని భారీగా పెంచింది.  

దేశీయ ఉత్పత్తి సామర్ధ్యం బాగా పెరగడంతో పాటు  పి పి ఇ కిట్ల దేశీయ అవసరాలు  కూడా తీరడం వల్ల  పి పి ఇల ఎగుమతి నిబంధనలను సడలిస్తూ  విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్  సవరించిన నోటిఫికేషన్ జారీచేశారు.  ఫలితంగా ఒక్క జూలై నెల లోనే ఇండియా ఐదు --  అమెరికా, బ్రిటన్, యు ఏ ఇ,  సెనెగల్, స్లోవేనియా -- దేశాలకు 23 లక్షల పి పి ఇలను ఎగుమతి చేసింది.  దీనివల్ల పి పి ఇల ఎగుమతి మార్కెటులో ఇండియా హోదా పెరిగేందుకు ఎంతగానో తోడ్పడింది.  

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమంలో  'మేక్ ఇన్ ఇండియా'  స్ఫూర్తి మమేకమైపోయింది.  దానివల్ల పి పి ఇలతో సహా వివిధ రకాల వైద్య సామాగ్రిఉత్పత్తిలో మన దేశం స్వయం సమృద్ధిని సాధించగలిగింది.   ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పి పి ఇలు,  ఎన్ 95 రకం మాస్కులు,  వెంటిలేటర్లు మొదలగు వాటిని  రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు సరఫరా చేస్తుండగా మరొకవైపు రాష్ట్రాలు నేరుగా వాటిని సమకూర్చుకుంటున్నాయి.  2020 మార్చి నుంచి ఆగస్టు మధ్య కాలంలో తమ బడ్జెట్ వనరుల నుంచి దేశీయంగా తయారైన 1.40 కోట్ల పి పి ఇలను సేకరించాయి.  అదే సమయంలో  కేంద్రం  1.28 కోట్ల పి పి ఇలను రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలు/ కేంద్ర సంస్థలకు ఉచితంగా పంపిణీ చేసింది.  

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు మరియు సలహాలకు సంబంధించిన యదార్ధ మరియు  తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ and @MoHFW_INDIA. సందర్శించండి.  

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక ప్రశ్నలను  technicalquery.covid19[at]gov[dot]in కు మరియు ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in మరియు  @CovidIndiaSevaకు పంపి తెలుసుకోవచ్చు.  

కోవిడ్-19 కు సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉంటె ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్  లైన్ నెంబరు  +91-11-23978046 లేక 1075  (టోల్ ఫ్రీ)  కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.  రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్  లైన్ నెంబర్లను  https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  దర్శించి పొందవచ్చు.



(Release ID: 1645899) Visitor Counter : 210