ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రోజుకు 9 లక్షల పరీక్షలతో భారత్ సరికొత్త రికార్డు

ఒక్కరోజులోనే కోలుకున్నవారు అత్యధికంగా 57,584 మంది

మొత్తం కోలుకున్నవారి సంఖ్య 13 లక్షల పైమాటే

Posted On: 18 AUG 2020 1:21PM by PIB Hyderabad

కోవిడ్ పరీక్షల విషయంలో భారత్ మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒక రోజులో జరిపిన పరీక్షల సంఖ్య 9 లక్షలకు (కచ్చితంగా చెప్పాలంటే 8,99,864) చేరింది.  ఇలా ఒకే రోజులో జరిపిన పరీక్షల సంఖ్యలో ఇది అత్యధికం. దీంతో ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షలు 3,09,41,264 కు చేరింది.

అంత భారీ సంఖ్యలో పరీక్షలు జరిపినప్పటికీ, పాజిటివ్ గా గుర్తించిన కేసుల సంఖ్య మాత్రం . 8.81%  దగ్గరే ఉంది. వారపు జాతీయ సగటు 8.84% కంటే ఇది తక్కువ.

 

Image


గడిచిన 24 గంటల్లో 57,584 మంది కోలుకోవటంతో ఈ సంఖ్య కూడా అత్యధికంగా నమోదైంది. అదే కాలంలో పాజిటివ్ గా ధ్రువపడిన 55,079 మంది కంటే ఇది ఎక్కువ. మరింతమంది కోలుకుంటూ ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అవుతూ, స్వల్ప లక్షణాలున్న వారు హోమ్ ఐసొలేషన్ నుంచి బైటపడుతూ ఉండటంతో ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 19 లక్షలు పైబడింది. ( కచ్చితంగా చెప్పాలంటే 19,77,779). ఇలా కోలుకున్నవారి సంఖ్యకూ, చికిత్సలో ఉన్నవారి సంఖ్యకూ మధ్య అంతరం బాగా పెరుగుతూ ఈరోజు 13 లక్షలు దాటింది. కచ్చితంగా చెప్పాలంటే 13,04,613 కేసులు. 
రోజురోజుకూ కోలుకుంటున్నవారి సగటు సంఖ్య పెరుగుతూ ఉండటంతో భారత్ లో కోలుకున్నవారి శాతం 73.18% చేరింది.  అదే విధంగా పాజిటివ్ గా నమోదైన వారిలో మరణాలు 1.92% కు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమన్వయంతో చేస్తున్న కృషి ఫలితంగా   "పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు" అనే త్రిముఖ వ్యూహం బాగా పనిచేసింది. 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మరణాల శాతం జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. మెరుగైన పరీక్షా విధానం వలన తొలిదశలోనే గుర్తించి ఐసొలేషన్ లో ఉంచటం, తగిన ప్రామాణిక చికిత్స అందించటం సాధ్యమవుతూ వస్తోంది. దీనివలన మరణాల శాతం కనీస స్థాయిలో తగ్గుదలబాటలో ఉంది. 
ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 6,73,166 గా ఉండగా ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 24.91% . ఈ సంఖ్య కూడా మరణాల సంఖ్య తగ్గుదలబాటలో ఉన్నట్టు చూపుతోంది.

 పరీక్షల విషయంలో అనుసరించిన కీలకమైన వ్యూహం లాబ్ ల నెట్ వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తృతం చేయటం. దీంతో  ప్రస్తుతం లాబ్ ల సంఖ్య  1476  కి చేరింది. ఇందులో ప్రభుత్వ రంగంలో 971 లాబ్ లు ఉండగా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో 505ఉన్నాయి.
రకరకాల లాబ్ ల వివరాలు ఇలా ఉన్నాయి: 
తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ :  755(ప్రభుత్వ:  450  + ప్రైవేట్:  305)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 604 (ప్రభుత్వ: 487+ ప్రైవేట్: 117)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 117 (ప్రభుత్వ: 34  + ప్రైవేట్ 83 )
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

 

***



(Release ID: 1646659) Visitor Counter : 227