వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలలో ఎన్ఎఫ్ఎస్ఏ కింద కొత్తగా సుమారు 60.7 లక్షల లబ్ధిదారులు నమోదు; ఈ కొత్త లబ్ధిదారులకు పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి పథకాలు కూడా వర్తిస్తాయి

ఎన్ఎఫ్ఎస్ఏ, పీఎం-జీకేఏవై కింద 2020 ఏప్రిల్ నుండి సగటున దాదాపు 94% లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు అందాయి

ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద వలసదారులకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీకి మరింత పొడిగింపు ను కానీ, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద కవరేజ్ డిమాండ్‌ను కానీ ఏ రాష్ట్ర / యుటి ప్రభుత్వం సూచించలేదు.

Posted On: 19 AUG 2020 9:26PM by PIB Hyderabad

జాతీయ ఆహార భద్రత చట్టం, 2013 (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ (టిపిడిఎస్) ద్వారా రెండు వర్గాల కింద అధిక సబ్సిడీ కలిగిన ఆహార ధాన్యాలను పొందటానికి దాదాపు 81.09 కోట్ల మందికి కవరేజీని అందిస్తుంది. ఆ రెండు వర్గాలు... 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో దాదాపు మూడింట రెండు వంతులు ఉన్న అంత్యోదయ అన్న యోజన (ఏఏవై), ప్రాధాన్యత గృహ పరివారాలు(పి హెచ్ హెచ్ ). గ్రామీణ జనాభాలో 75% వరకు, పట్టణ జనాభాలో 50% వరకు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ వర్తిస్తుంది. ఈ ప్రాతిపదికన, దేశ జనాభాలో దాదాపు 67% ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలోకి వస్తుంది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద లబ్ధిదారులను గుర్తించే బాధ్యత రాష్ట్రాలు / యుటి ప్రభుత్వాలదే.

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద కొత్త లబ్ధిదారులను చేర్చే ప్రక్రియ కొనసాగుతున్న కసరత్తు, దీని ప్రకారం సంబంధిత రాష్ట్ర / యుటి ప్రభుత్వాలు నిష్క్రియాత్మక / ఉపయోగించని / బోగస్ రేషన్ కార్డులను తొలగించడం ద్వారా వారి పూర్తి అనుమతి పరిమితిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తాయి. కొత్త లబ్ధిదారులను వారి స్థానంలో క్రమానుగతంగా చేర్చడం జరుగుతుంటుంది. 2013-2018 మధ్య కాలంలో, రాష్ట్రాలు/ యుటిలు సుమారు 3 కోట్ల రేషన్ కార్డులను తొలగించి, వాటి స్థానంలో  కొత్త వారు, అర్హులైన లబ్ధిదారులను చేర్చారు.

కోవిడ్-19 కాలంలో, 2020 మార్చి నుండి, దాదాపు 60.70 లక్షల మంది కొత్త లబ్ధిదారులను ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు అందుబాటులో ఉన్న సీలింగ్ పరిమితుల్లో చేర్చాయి. అంటే, ఈ అదనపు లబ్ధిదారులు పిఎం గరిబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎం-జికెవై) వంటి పథకాలను పొందగలిగారు.

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పూర్తిస్థాయిలో అమలు చేసినప్పటి నుంచి 80 కోట్లకు పైగా వ్యక్తులు / లబ్ధిదారుల కోసం రాష్ట్రాలు / యుటిలకు ఆహార ధాన్యాలు నిరంతరం కేటాయింపు జరుగుతోంది.

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో, అన్ని రాష్ట్రాలు / యుటిలు తమ పోర్టల్‌లో టోల్ ఫ్రీ నంబర్ / ఆన్‌లైన్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశాయి. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద లబ్ధిదారుల కవరేజీని హేతుబద్ధీకరించడానికి ప్రస్తుతం ఉన్న జిల్లా గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్స్ (డిజిఆర్‌ఓ), వివిధ స్థాయిలలో విజిలెన్స్ కమిటీలు, స్టేట్ ఫుడ్ కమీషన్లు (ఎస్‌ఎఫ్‌సి) కి ఇవి అదనం. అటువంటి యంత్రాంగాల సహాయంతో, వాస్తవంగా ప్రభావితమైన వ్యక్తులు / గృహాలకు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన ఫిర్యాదులను రాష్ట్రాలు / యుటిలు సమర్థవంతంగా పరిష్కరించగలవు.

అందువల్ల లబ్ధిదారులను చేర్చడంలో రేషన్ కార్డుల జారీకి సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి అన్ని రాష్ట్రాలు / యుటిలలో తగిన పరిష్కార వేదికలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ కూడా సలహాలు, సమావేశాలు మొదలైన వాటి ద్వారా కొత్త, నిజమైన లబ్ధిదారులను ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద చేర్చే సమస్యను పరిష్కరిస్తోంది.

కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులకు తగిన పరిమాణంలో ఆహార ధాన్యాలు అందించడానికి సంబంధించి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సిఐ), వివిధ రాష్ట్ర సంస్థల సహకారంతో శాఖ పరంగా  ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ,  పీఎం-జికేఏవై కింద ఆహార ధాన్యాల రెట్టింపు పరిమాణాన్ని ప్రతి నెల ( నెలకు దాదాపు 83 LMT ) అందిస్తోంది. .

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ,  పీఎం-జికేఏవై కింద, 2020 ఏప్రిల్ నుండి సగటున దాదాపు 94% మంది లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు అందించడం జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో డాల్బర్గ్, మైక్రోసేవ్ కన్సల్టింగ్ మొదలైనవారు నిర్వహించిన స్వతంత్ర సర్వేలు అత్యధిక స్థాయిలో సంతృప్తిని చూపించాయి   ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ,  పీఎం-జికేఏవై కింద ఆహార ధాన్యాల పంపిణీకి సంబంధించి లబ్ధిదారులలో దాదాపు 94% మంది ఉన్నారు. ఇంకా, 2018-20 కాలంలో 27 రాష్ట్రాలు / యుటిలలో 26 మానిటరింగ్ ఇన్స్టిట్యూషన్స్ (ఎంఐలు) ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ అమలుపై విభాగం స్వతంత్ర ఏకకాల మూల్యాంకనం నిర్వహించింది. మూల్యాంకన నివేదికలను సంబంధిత రాష్ట్ర / యుటి ప్రభుత్వాలతో పంచుకుంది. 

****



(Release ID: 1647173) Visitor Counter : 223