ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఇ సి ఎల్ జి ఎస్ కింద ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌కుపైగా విలువ‌గ‌ల రుణాల పంపిణీ

Posted On: 20 AUG 2020 11:19AM by PIB Hyderabad

భార‌త ప్ర‌భుత్వ గ్యారంటీ తో‌, నూరు శాతం ఎమ‌ర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ ప‌థకం (ఇసిఎల్ జి ఎస్‌)  కింద ప్ర‌భుత్వ , ప్రైవేటు రంగ బ్యాంకులు 2020 ఆగ‌స్టు 18 వ తేదీ నాటికి 1.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల రుణాల‌ను మంజూరు చేశాయి. ఇందులో ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఇప్ప‌టికే పంపిణీ చేశారు. ఇసిఎల్‌జిఎస్‌ను ప్ర‌భుత్వం ఆత్మ నిర్భ‌ర్ ‌భార‌త్ ప్యాకేజ్ కింద ప్ర‌క‌టించింది.కోవిడ్ -19 లాక్‌డౌన్ ప‌రిస్థితుల నుంచి  వివిధ‌రంగాలు, ప్ర‌త్యేకించి ఎం.ఎస్‌.ఎం.ఇల‌కు రుణం అందించి ఆదుకునేంద‌కు దీనిని ప్ర‌క‌టించారు.

 ప్ర‌భుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు మంజూరు చేసిన మొత్తం రుణాల వివ‌రాలు:



ఇసిఎల్‌జిఎస్ కింద‌, ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు (పిఎస్‌బిలు) 76,044.44 కోట్ల రూపాయ‌లు మంజూరు చేశాయి. ఇందులో  56,483.41 కోట్ల రూపాయ‌లను ఇప్ప‌టికే పంపిణీచేశారు. ప్రైవేటు రంగ బ్యాంకులు 74,715.02 కోట్ల‌రూపాయ‌ల రుణాలు మంజూరు చేయ‌గా ఇందులో రూ 45,762 కోట్ల రూపాయ‌లు ఇప్ప‌టికీ పంపిణీచేశారు. ఈ ప‌థ‌కం కింద అత్య‌ధిక రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌.బి.ఐ), కెన‌రా బ్యాంక్‌, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌(పిఎన్‌బి), బ్యాంక్ ఆప్ ఇండియా, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌.డి.ఎఫ్‌.సి బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి.

12 ప్ర‌భుత్వరంగ బ్యాంకులు మంజురుచేసిన‌,పంపిణీ చేసిన రుణాల వివ‌రాలు కింది విధంగా ఉన్నాయి.
                         


ఇసిఎల్‌జిఎస్ కింద ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకులు మంజూరు చేసిన‌, పంపిణీ చేసిన రుణాలు రాష్ట్రాల వారీగా కింది విధంగా ఉన్నాయి.
                                   


****



(Release ID: 1647380) Visitor Counter : 219