సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                
                    
                    
                        5వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సదస్సులో వర్చ్యువల్ గా హాజరైన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ఇంచార్జి మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ 
                    
                    
                        సంస్కృతి అనేది మానవ నిర్మిత సరిహద్దులకతీతంగా ఉన్న బలమైన బంధం- ప్రేమ, సామరస్యం ద్వారా ప్రజలను కలుపుతుంది - శ్రీ పటేల్  
                    
                
                
                    Posted On:
                04 SEP 2020 6:04PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                2020 సెప్టెంబర్ 3 న జరిగిన 5 వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశానికి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి (ఇంచార్జి) శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ వర్చ్యువల్ గా హాజరయ్యారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షతన జరిగింది. ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్, రష్యన్ ఫెడరేషన్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా సాంస్కృతిక మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 

సమావేశంలో, బ్రిక్స్ దేశాలలో సాంస్కృతిక రంగానికి సంక్రమణ వ్యాధుల పరిస్థితి ప్రభావం, బ్రిక్స్‌లో ఉమ్మడి సాంస్కృతిక ఆన్‌లైన్-ప్రాజెక్టులను అమలు చేయడంపై సమీక్ష జరిగింది. సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి సమావేశంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా ఆన్‌లైన్ పద్ధతిలోనే సాంస్కృతిక కార్యక్రమాలను పంచుకోవడం, నిర్వహించడంపై మాట్లాడారు. ప్రత్యామ్నాయ విధానాల ద్వారా బ్రిక్స్‌లో సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడానికి భారత్ దృక్పథాన్ని ఆయన వివరించారు. 
"కోవిడ్-19 మనకొక చేదు అనుభవం. అయితే ప్రకృతి, దేశాల మధ్య విచక్షణ చూపదని రుజువు చేసింది. కులము, వర్గము ఆధారంగా అది ప్రజల మధ్య భేదభావాలు చూపదు. మనుషులు తమ చుట్టూ సరిహద్దులు వేసుకుని వేరువేరు దేశాలుగా ఉన్నప్పటికీ సంస్కృతీ అనేది ఒక గట్టి బంధంగా వారి మధ్య పెనవేసుకుని ఉంటుంది. ఇందుకు మానవాళి సృష్టించుకున్న హద్దులను సైతం దాటి  ప్రేమ, సమరస్యాలతో కలిపే ఉంచుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో మనమంతా పాల్గొనడం మునిపటి కంటే మన మధ్య మరింత బంధాన్ని పెంచుతుంది." అని కేంద్ర మంత్రి శ్రీ పటేల్ అన్నారు. 
బ్రిక్స్ అలయన్స్ ఆఫ్ మ్యూజియమ్స్ ఆధ్వర్యంలో 2021 చివరిలో షేర్డ్ థీమ్‌పై డిజిటల్ ఆన్‌లైన్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించే అవకాశాలను అన్వేషించాలని సూచించారు. బ్రిక్స్ అలయన్స్ కింద రూపొందించే వెబ్‌సైట్ కోసం పూర్తి సహకారం అందించుకుంటూ కంటెంట్ భాగస్వామ్యాన్ని విస్తరించాలని ఆయన తెలిపారు.
బ్రిక్స్ అలయన్స్ ఆఫ్ లైబ్రరీల ఆధ్వర్యంలో బ్రిక్స్ కార్నర్‌ను తెరవడం, 2021 లో భారతదేశ బ్రిక్స్ ప్రెసిడెన్సీ సందర్భంగా ప్రారంభించాలని ప్రతిపాదించారు. బ్రిక్స్ దేశాల చరిత్ర, సంస్కృతికి సంబంధించిన సమాచారాన్ని ఈ కార్నర్ వ్యాప్తి చేస్తుందన్నారు. ఈ కేంద్రంలో బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా బహుమతిగా ఇచ్చిన పుస్తకాలు, పత్రికలు ఇతర ఇ-వనరులను ప్రదర్శిస్తారని సూచించారు.
న్యూఢిల్లీ లోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్స్ బ్రిక్స్ ఉమ్మడి ఎగ్జిబిషన్‌ను ‘బాండింగ్ రీజియన్స్, ఇమాజినింగ్ కల్చరల్ సినర్జీస్’ పేరుతో బ్రిక్స్ అలయన్స్ ఆఫ్ ఆర్ట్ మ్యూజియంలు, గ్యాలరీల ఆధ్వర్యంలో నిర్వహించనుంది. 2021 లో భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోయే బ్రిక్స్ ఈవెంట్‌తో సమానంగా ఈ ప్రదర్శనను 2021 లో నిర్వహించాలని ప్రతిపాదించబడింది. బ్రిక్స్ అలయన్స్ పరిధిలోని ఐదు ప్రతిష్టాత్మక సంస్థల నుండి సుమారు 100 కళాకృతులను ప్రదర్శించడం ఈ ప్రదర్శన లక్ష్యం. సమావేశం ముగింపులో బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల వర్చ్యువల్ సమావేశం ప్రకటనపై బ్రిక్స్ దేశాల ప్రతినిధులందరు సంతకాలు చేశారు.
           ****
                
                
                
                
                
                (Release ID: 1651467)
                Visitor Counter : 288