రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ఐ-రాడ్ యాప్ గురించి పునశ్చరణ మరియు శిక్షణా కార్యక్రమాలతో పురోగమిస్తున్న - కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ


Posted On: 12 SEP 2020 5:24PM by PIB Hyderabad

ఐ-రాడ్ యాప్ గురించి 2 రోజుల పునశ్చరణ మరియు శిక్షణా కార్యక్రమాలను కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ 2020 సెప్టెంబర్ 7, 8 తేదీలలో కర్ణాటకలోని ఎంపిక చేసిన జిల్లాల కోసం, అదేవిధంగా, 2020 సెప్టెంబర్ 10, 11 తేదీలలో ఉత్తర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల కోసం నిర్వహించింది.  అందుకున్న స్పందన మరియు ఇతర సూచనల ఆధారంగా, ఈ యాప్ ను ఆయా రాష్ట్రాలకు అనుకూలంగా మార్పుచేయడం జరుగుతుంది.  

ప్రాథమిక ఐ-రాడ్ యాప్ అభివృద్ధి చేయబడింది. సంబంధిత రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా అనుకూలీకరించబడుతుంది / సమగ్రపరచబడుతుంది.  ఐ-రాడ్ మొబైల్  యాప్ ఆండ్రాయిడ్ వేదిక కోసం అందుబాటులో ఉంది మరియు ఐ.ఓ.ఎస్. వంటి ఇతర వేదికల కోసం త్వరలో అందుబాటులో ఉంటుంది.

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వర్తించే ‘ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా బేస్ ప్రాజెక్ట్ (ఐ-రాడ్)’ ను అమలు చేసే పనిలో ఉంది.  మొదటి దశలో, ఈ ప్రతిపాదనను ఆరు రాష్ట్రాలు - మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు లలో అమలు చేయాలని నిర్ణయించారు.  ఐ-రాడ్ యాప్ అభివృద్ధి మరియు అమలును ఐ.ఐ.టి మద్రాస్ మరియు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వీసెస్ సంస్థలకు అప్పగించారు.  యాప్ అభివృద్ధి చేయబడినప్పుడు మరియు క్రియాత్మకంగా ఉన్నప్పుడు, పోలీసు, రవాణా, ఆరోగ్యం వంటి భాగస్వామ్య విభాగాలకు వారి మొబైల్ ఫోన్‌లను అక్కడికక్కడే ప్రమాద డేటాను సేకరించడానికి వీలు కల్పిస్తుంది.

ఈ ప్రయోజనానికి అనుగుణంగా రూపొందించిన మొబైల్ యాప్ ఉపయోగించి  స్పాట్ యాక్సిడెంట్ డేటాను సంగ్రహించడానికి ఐ.టి. ఆధారిత వ్యవస్థపై ఈ ప్రాజెక్టు ప్రతిపాదించబడింది.  ఈ డేటాను ప్రమాదాల కారణాలను కనుగొనడం,  రహదారి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి పరిష్కార చర్యలు, పోలీసు, ఆరోగ్య సేవలు మరియు ఇతర సంబంధిత విభాగాల ఉపయోగం కోసం ప్రమాదాల డేటాను రికార్డ్ చేయడానికి మొదలైన వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. 

 

*****

 


(Release ID: 1653687)