పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఇసుక అక్రమ తవ్వకాన్ని అరికట్టడానికి చట్టాలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను కోరిన శ్రీ ప్రకాశ్ జావడేకర్
జాతీయ అటవీ మృతవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బందికి నివాళులు అర్పించిన పర్యావరణ మంత్రిత్వశాఖ
प्रविष्टि तिथि:
11 SEP 2020 8:09PM by PIB Hyderabad
15వ జాతీయ అటవీ మృతవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా కేంద్ర పర్యావరణ, అడవులు మరియు వాతావరణ మార్పు మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ విలువైన వృక్ష జంతు జాలం మరియు మన ప్రకృతి వనరులను కార్చిచ్చు, స్మగ్లర్లు, మాఫియా నుంచి కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన మృతవీరులను గుర్తుచేసుకొని మంత్రి నివాళులర్పించారు.

గంధం చెక్కల దొంగల చేతిలో అటవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం పట్ల శ్రీ జావడేకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరింత విస్తృతంగా గంధం సాగు చేయడానికి వీలుగా చట్టాలు, నియంత్రణల్లో సవరణలు చేయనున్నట్లు తెలిపారు. కార్చిచ్చులను ఆర్పుతూ, పులులు, ఏనుగులు మరియు ఒంటికొమ్ము ఖడ్గమృగము దాడుల్లో అసువులు బాసిన అటవీ మృతవీరులకు కేంద్ర మంత్రి నివాళులు అర్పించారు. 2019-20 సంవత్సరంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బంది సంస్మరణలో సర్టిఫికెట్లు జారీ చేశారు.
మన పర్యావరణాన్ని, అడవులను మరియు వన్యప్రాణుల సంరక్షణలో ప్రాణ త్యాగం చేసిన అటవీ మృతవీరులకు నివాలులర్పిస్తూ మేము జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా కేంద్ర పర్యావరణ, అడవులు మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖలో అటవీ మృతవీరుల సంస్మరణ దినోత్సవం పాటించాం. ఈ ఇది 25 మంది అటవీ సిబ్బంది సేవలను గుర్తిస్తూ సర్టిఫికెట్లు బహుకరించడం జరిగింది.
ఇసుక మాఫియాకు కేంద్ర మంత్రి గట్టి హెచ్చరిక చేస్తూ పరిస్థితిని సమీక్షిస్తామని చట్ట ప్రకారం నడుచుకొని వారిని శిక్షించడం జరుగుతుందని తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాన్ని అరికట్టడానికి పకడ్బందీగా, నిర్వహణకు అనువైన చట్టాలను, నియంత్రణలను ఆమోదించినప్పటికీ పలు రాష్ట్రాలు మరియు ప్రాంతాలు నియమాలను పాటించడం లేదని ఆయన అన్నారు. అల్వార్ లోని సరిస్కా పులుల రిజర్వులో తన సహచరునితో కలసి ఇసుక మాఫియా సభ్యులను నిలిపేందుకు ప్రయత్నించిన అటవీ హోమ్ దారుడు కేవల్ సింగ్ ను ట్రాక్టర్ తో తొక్కించి చంపారని తెలిపారు.
ఇసుక మాఫియాను, అక్రమ తవ్వకాన్ని తీవ్రంగా పరిగణించి చట్టాలను కఠినంగా అమలు చేయాలనీ, ఈ అలవాటును అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. నదీ తీరాలలో ఇసుక నిల్వలు అంతరించి పోకుండా నిర్వహణకు అనువైన రీతిలో ఇసుక తవ్వకాలు జరపాలని, దేశ సంపదను కాపాడేందుకు విధులు నిర్వహిస్తున్న అటవీ , రెవెన్యూ సిబ్బంది హత్యలు అనంగీకారమని , నేరస్థులను శిక్షించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి అన్నారు.
విస్తారమైన జీవవైవిధ్యంతో అలరారే మనోజ్ఞమైన భారత అటవీ సంపదను కాపాడేందుకు అటవీ అధికారులు మరియు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా జంతు జాలాన్ని, ప్రకృతి సంపదను పరిరక్షిస్తూ, వన్య ప్రాణులతో పోరాడుతూ పలువురు అటవీ సిబ్బంది తమ ప్రాణాలు కోల్పోయారు.
దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యావరణాన్ని, అడవులను మరియు వన్యప్రాణులను సంరక్షిస్తూ ప్రాణ త్యాగం చేసిన అటవీ సిబ్బంది పరాక్రమానికి, త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వ పర్యావరణ, అడవులు మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ 11 సెప్టెంబర్ ను జాతీయ అటవీ మృతవీరుల సంస్మరణ దినంగా ప్రకటించి పాటిస్తున్నది.

సెప్టెంబర్ 11న సంస్మరణ దినం పాటించడానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. 1730 సంవత్సరంలో రాజస్థాన్ లోని కేజర్లీ ప్రాంతంలో రాజు ఆదేశాల మేరకు చెట్లు కొట్టి వేయడాన్ని అమృతా దేవి నేతృత్వంలో బిష్ణోయ్ తెగ వారు వ్యతిరేకించారు. వారి నిరసనను భరించలేని రాజు 360 మందిని ఒకేసారి చంపించారు. వారి సంస్మరణార్ధం డెహరాడూన్ లోని అటవీ పరిశోధనా సంస్థ సమీపంలో 2012 అక్టోబర్ 3వ తేదీన స్మారక స్థూపాన్ని నిర్మించారు. మన దేశ జీవ వైవిధ్యాన్ని , అడవులను కాపాడుతూ ప్రాణ త్యాగం చేసిన అడవి మనుష్యులను త్యాగానికి ప్రతీకగా డెహరాడూన్ లోని అటవీ పరిశోధనా సంస్థలో స్మారక చిహ్నాన్ని నిర్మించారు.
జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జికా) సహాయంతో పర్యావరణ మంత్రిత్వ శాఖ అటవీ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల స్థితిగతులు మెరుగుపరిచేందుకు చర్యలు తీనుకుంటున్నది.
2019-20 సంవత్సరంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది జాబితా కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
*****
(रिलीज़ आईडी: 1653690)
आगंतुक पटल : 258