ఉక్కు మంత్రిత్వ శాఖ

ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలో నైపుణ్య శిక్షణా కేంద్రాలు

Posted On: 14 SEP 2020 3:29PM by PIB Hyderabad

ద్వితీయ ఉక్కు రంగంలో పనిచేసే మానవశక్తికి సాంకేతిక శిక్షణ ఇవ్వడం కోసం మూడు శిక్షణా సంస్థలు ప‌ని చేస్తున్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సెకండరీ స్టీల్ టెక్నాలజీ (ఎన్‌ఐఎస్‌టీ)
(ఈ శిక్ష‌ణా సంస్థ కోల్‌కతా మరియు నాగ్‌పూర్‌లోని ప్రాంతీయ కేంద్రాలతో పాటుగా మండి గోబింద్‌ఘ‌ర్‌లో ప్రధాన కార్యాలయం క‌లిగి ఉంది); కోల్‌కతాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ స్టీల్ డెవలప్‌మెంట్ అండ్ గ్రోత్ (ఐఎ‌న్ఎస్‌డీఏజీ), పురి న‌గ‌రంలో బిజు పట్నాయక్ నేషనల్ స్టీల్ ఇన్‌స్టిట్యూట్‌ (బీపీఎన్ఎస్ఐ) సంస్థ‌లు ప‌ని చేస్తున్నాయి. దీనికి తోడు స్టీల్ మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యక్తిగత సీపీఎస్ఈలు తమ ఉద్యోగులకు, అప్రెంటిస్‌లకు శిక్షణను ఇస్తున్నాయి.
2019-20లో స్టీల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సంస్థలు మరియు సీపీఎస్ఈలు ఇచ్చిన శిక్షణ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: 

శిక్ష‌ణా సంస్థ పేరు/పీఎస్‌యూ

శిక్ష‌ణ ర‌కం

శిక్ష‌ణ‌నిచ్చిన‌ వారి సంఖ్య‌

 

 

ఆర్థిక సంవ‌త్స‌రం 2019-20

ఎన్ఐఎస్ఎస్‌టీ

ద్వితీయ ఉక్కు రంగంలో నైపుణ్య అభివృద్ధిప‌ర‌చ‌డం

 

656

 

 

 

 ఐఎన్ఎస్‌డీఏజీ

 

ఉక్కు డిజైన్‌లు మరియు నిర్మాణ శిక్షణ

 

814

సీపీఎస్ఈల [స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లి.(సెయిల్‌) మ‌రియు రాష్ట్రీయ ఇస్పాత్ నిఘ‌మ్ లిమిటెడ్‌.(ఆర్ఐఎన్ఎల్‌)]

ఉద్యోగుల నైపుణ్యత‌ను అభివృద్ధిప‌ర‌చ‌డం

 

380

 

అప్రెంటిస్ శిక్షణ

3318

 

రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ స్పాన్సర్ చేసిన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఎఎన్‌ఐఎస్‌టీ తన కేంద్రాలలో ఒకదానిని క‌లిగి ఉంది.

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు లోక్‌స‌భ‌కు ఇచ్చిన‌ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియ‌జేశారు.

                                                                                                                                        *****


(Release ID: 1654396)