ప్రధాన మంత్రి కార్యాలయం

థాయీలాండ్ ప్ర‌ధాని జనరల్ (రిటైర్ డ్) ప్రయుత్ చాన్-ఒ -చా తో టెలిఫోన్ లో సంభాషించిన ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ

Posted On: 01 MAY 2020 7:30PM by PIB Hyderabad

థాయీలాండ్ ప్ర‌ధాని జనరల్ (రిటైర్ డ్) ప్రయుత్ చాన్-ఒ -చా తో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్‌ లో మాట్లాడారు.


ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఏశియాన్ కు మరియు సంబంధిత శిఖర సమ్మేళనాల కు హాజరు కావడం కోసం 2019 వ సంవత్సరం నవంబరు లో తాను బ్యాంకాక్ ను సందర్శించిన సంగతి ని ఆత్మీయం గా గుర్తు కు తెచ్చుకోవడమే కాక, థాయీలాండ్ ప్రజల కు మరియు థాయీలాండ్ రాజ కుటుంబ సభ్యుల కు కూడా తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

గురించి ఉభయ నేత లు  కోవిడ్-19 విశ్వమారి ని ఎదుర్కొనేందుకు వారి వారి దేశాల లో చేపడుతున్నటువంటి చర్యల ను గురించిన సమాచారాన్ని పరస్పరం వెల్లడించుకొన్నారు.


ప్రపంచవ్యాప్త వ్యాధి కోవిడ్-19 ని సమర్థం గా ఎదిరించి పోరాడడం లో ప్రాంతీయ స్థాయి సహకారాని కి మరియు ప్రపంచ స్థాయి సహకారాని కి గల ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి తన సంభాషణ లో ప్రస్తావించారు.  థాయీలాండ్ కు అవసరమయ్యే ఔషధాల ను సమకూర్చి సాయపడేందుకు భారతదేశం కట్టుబడి ఉంటుందంటూ ఆయన థాయిలాండ్ ప్రధాని కి హామీ ని ఇచ్చారు.

ఇరు దేశాల కు చెందిన పరిశోధకులు, శాస్త్రవేత్త లు మరియు నూతన ఆవిష్కరణ ల శిల్పుల కు మధ్య ఇతోధిక సహకారం నెలకొనడం అభిలషణీయం అనే అంశం లో ఇద్దరు నేతలు అంగీకారాన్ని వ్యక్తం చేశారు.

వారి వారి దేశాల లో ఉంటున్న ఇతర దేశం యొక్క పౌరుల కు సమకూర్చుతున్న సదుపాయాల పట్ల నేత లు ప్రశంస ను వ్యక్తం చేయడమే కాకుండా, ఆ తరహా సహాయాన్ని కొనసాగించే విషయం లో ఒకరి కి మరొకరు వాగ్దానం చేసుకొన్నారు.

భారతదేశం తో సముద్ర ప్రాంతం పరం గా విస్తారిత పొరుగు దేశం గా ఉన్న థాయీలాండ్ భారత్ తో ప్రాచీన సంస్కృతి పరమైన బంధాన్ని మరియు జాతి పరమైన బంధాన్ని సైతం కలిగివుండి, భారతదేశాని కి ఒక విలువైన సముద్ర సంబంధిత భాగస్వామ్య దేశం గా కూడా ఉంటోంది.
 

***
 


(Release ID: 1655025)