ప్రధాన మంత్రి కార్యాలయం

లోక్ ఎంపి బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్ రావు గారి క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 16 SEP 2020 8:35PM by PIB Hyderabad

లోక్ సభ ఎంపి శ్రీ బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్ రావు క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

‘‘లోక్ స‌భ ఎంపి బ‌ల్లి దుర్గా ప్రసాద్ రావు గారి మ‌ర‌ణం నాకెంతో దుఃఖం క‌లిగించింది.  ఆయ‌న ఎంతో అనుభ‌వం ఉన్న నాయ‌కుడు.  ఆంధ్ర ప్ర‌దేశ్ ప్రగ‌తి కి ఎంతగానో తోడ్పడ్డారు.  ఈ దుఃఖ ఘ‌డియ‌లో ఆయ‌న కుటుంబాని కి, ఆయన శ్రేయోభిలాషుల‌ కు క‌లిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.


***


(Release ID: 1657161)