మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ సమయంలో మహిళలపై అత్యాచారాలు


Posted On: 23 SEP 2020 7:30PM by PIB Hyderabad

జాతీయ నేర రికార్డుల కార్యాలయం (ఎన్.సి.బి) తన “భారతదేశంలో నేరాలు” అనే ప్రచురణలో నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సంకలనం చేసి ప్రచురిస్తుంది.  ప్రచురించిన నివేదికలు 2018 సంవత్సరం వరకు అందుబాటులో ఉన్నాయి.  రాజస్థాన్ ‌లోని ఉదయపూర్ జిల్లాతో సహా దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా నమోదైన మొత్తం కేసుల వివరాలు జాతీయ నేర రికార్డుల కార్యాలయం (ఎన్.‌సి.ఆర్.‌బి) వెబ్‌సైట్‌  https://ncrb.gov.in లో అందుబాటులో ఉన్నాయి.  

జాతీయ మహిళా కమీషన్ (ఎన్.‌సి.డబ్ల్యు), సాధారణంగా వివిధ విధానాల ద్వారా స్వీకరించే ఫిర్యాదులను నిర్వహించడంతో పాటు, గృహ హింస కేసులను నివేదించడానికి 72177 35372 అనే ప్రత్యేక వాట్సాప్ నంబర్ ద్వారా కూడా  బాధలో ఉన్న మహిళలకు సహాయపడుతోంది.  10.04.2020 తేదీన ఈ సర్వీసును ప్రారంభించినప్పటి నుండి, ఇంత వరకు ఈ నెంబరుపై 1,443 గృహ హింస కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా నివేదించబడిన గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులను కూడా ఎన్.‌సి.డబ్ల్యు. తన పరిశీలనా పరిధిలోకి తెలుసుకుంటుంది.  ఎన్.‌సి.డబ్ల్యు.  అందుకున్న ఫిర్యాదులను బాధితులు, పోలీసులు మరియు ఇతర అధికారులతో సమన్వయం చేసుకొని తక్షణ సహాయం అందించడానికి చర్యలు తీసుకుంటుంది.  2020 మార్చి నుండి ఎన్.‌సి.డబ్ల్యు. నమోదు చేసిన / స్వీకరించిన ఫిర్యాదుల వివరాలు నెలవారీగా మరియు రాష్ట్రాల వారీగా (రాజస్థాన్ రాష్ట్రం తో సహా) అనుబంధం లో ఉన్నాయి.

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు లోక్‌సభలో సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియజేశారు.

 

*****

 


(Release ID: 1658524)
Read this release in: English , Punjabi