ప్రధాన మంత్రి కార్యాలయం

రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ఫోన్ లో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 07 OCT 2020 2:57PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో బుధవారం ఫోన్ లో మాట్లాడారు.

ఈ రోజు రష్యా అధ్యక్షుని పుట్టిన రోజు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ఆయనకు తన అభినందనలను, శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.

శ్రీ పుతిన్ తో చాలా కాలం నుంచి తనకు ఉన్న స్నేహాన్ని, అనుబంధాన్ని ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు.  భారతదేశం, రష్యా ల మధ్య ప్రత్యేక, విశేషాధికారాలతో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచి పోషించడం లో శ్రీ పుతిన్ చొరవ తీసుకొని పోషిస్తున్న పాత్ర ను శ్రీ మోదీ ప్రశంసించారు. 

కోవిడ్-19 మహమ్మారి రువ్విన సవాళ్లతో సహా, పలు అంశాలపై రాబోయే రోజులలో సంప్రదింపులను, సమాలోచనలను జరపడాన్ని కొనసాగిద్దామంటూ నేతలు ఇద్దరూ పరస్పర అంగీకారాన్ని వ్యక్తం చేశారు. ప్రజారోగ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకొన్న తర్వాత సాధ్యమైనంత త్వరలో అధ్యక్షుడు శ్రీ పుతిన్ ను భారతదేశానికి ఆహ్వానించాలనుకుంటున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు.  

***


(Release ID: 1662299)