సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
డిజిటల్ మీడియా ద్వారా వార్తలను, సమకాలీన అంశాలను అప్‌లోడింగ్/ ప‌్రసారం చేసే సంస్థలకు సౌకర్యాలు, ప్రయోజనాలు
Posted On:
16 OCT 2020 7:29PM by PIB Hyderabad
ప్రభుత్వ ఆమోదంతో 26% విదేశీ పెట్టుబడులను డిజిటల్ మీడియా ద్వారా వార్తలను, కరెంట్ అఫైర్స్ ను అప్ లోడ్/ ప‌్రసారం చేసేందుకు పారిశ్రామిక, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహం (డిపిఐఐటి) శాఖ ఆధ్వర్యంలో అనుమతినిచ్చే సమయంలో వాటికి కూడా సమీప భవిష్యత్తులో సంప్రదాయ మీడియాకు (ప్రింట్, టివి ) ఉన్న లబ్ధిని విస్తరించేందుకు సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.
ప్రధమ సమాచారం, అధికారిక విలేకరుల సమావేశం, తదితర కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆయా సంస్థల రిపోర్టర్లు, వీడియోగ్రాఫర్లు, కెమెరామెన్‌లకు పిఐబి అక్రెడిటేషన్‌ను ఇవ్వాలని తలపెట్టింది.
పిఐబి అక్రెడిటేషన్ గల వారికి సిజిహెచ్ ఎస్ లాభాలను, రైలు టిక్కెట్టు ధరలో రాయితీ వంటివి ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం అందుతాయి. బ్యూరో ఆఫ్ ఔట్‌రీచ్ అండ్ కమ్యూనికేషన్ ద్వారా డిజిటల్ ప్రకటనలు పొందేందుకు అర్హత వస్తుంది.
2. ప్రభుత్వంతో పరస్పర చర్యను, తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉన్నట్టుగా స్వీయ నియంత్రణ వ్యవస్థలను డిజిటల్ మీడియా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
(Release ID: 1665450)