ప్రధాన మంత్రి కార్యాలయం
జెఎన్‌యు కేంపస్ లో ఈ నెల 12న స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాన మంత్రి
Posted On:
10 NOV 2020 12:43PM by PIB Hyderabad
జవాహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) ఆవరణ లో స్వామి వివేకానంద నిలువెత్తు విగ్రహాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 12 న సాయంత్రం 6:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భం లో కేంద్ర విద్యా మంత్రి కూడా హాజరు కానున్నారు.
స్వామి వివేకానంద దార్శనికత, ఆయన చేసిన సాహస యాత్ర ఈనాటికీ దేశ యువతకు ప్రబోధకంగా నిలచింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్దీ మందికి ప్రేరణను అందిస్తూనే వస్తున్నంతటి ఒక మహనీయుడిని కన్న భారతదేశం అందుకు గర్వ పడుతోంది. వివేకానందుల వారి ఆదర్శాలు స్వామీజీ జీవన కాలంలో మాదిరిగానే ఈనాటికీ సందర్భశుద్ధితో కూడినవిగానే ఉన్నాయని ప్రధాన మంత్రి ఎల్లప్పుడూ చెబుతూ వచ్చారు. సామాన్యులకు సేవ చేయడం, దేశం లో యువతీయువకులకు సాధికారత ను కల్పించడం అంటే.. ఆ పనులు దేశాన్ని భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికత పరంగా బలోపేతం చేయడంతో పాటు ఆ దేశానికి ప్రపంచం లో గల ప్రతిష్ట ను కూడా ఇనుమడింప చేస్తాయని ప్రధాన మంత్రి స్వయంగా ఇప్పటికే ఎన్నోసార్లు స్పష్టం చేశారు. భారతదేశ శక్తి, భారతదేశ సమృద్ధి ఆ దేశ ప్రజలలో దాగి ఉంది; ఈ కారణంగా అందరికీ సాధికారిత ను కల్పించడం ఒక్కటే ఒక ఆత్మనిర్భర్ భారత్ (స్వయంసమృద్ధియుత భారతదేశం) లక్ష్యాన్ని సాధించే దిశ లో దేశాన్ని ముందుకు తీసుకుపోగలుగుతుంది.
***
(Release ID: 1671669)
Read this release in:
Assamese
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam