వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఖరీఫ్ మార్కెట్ సీజన్ ( కెఎంఎస్) 2020-21కిగాను కనీస మద్దతు ధరల ప్రకారం చేపట్టిన సేకరణ కార్యక్రమాలు.
కొనసాగుతున్న వరిధాన్యం, పప్పు దినుసులు, నూనె విత్తనాలు, విత్తన పత్తి సేకరణ.
ప్రస్తుత కెఎంఎస్ లో 262.32 ఎల్ ఎంటి కి పైగా వరిధాన్య సేకరణ. గత ఏడాదితో పోలిస్తే 20.80 శాతం అధికం.
Posted On:
11 NOV 2020 6:58PM by PIB Hyderabad
గత ఏడాది చేసినట్టుగానే ఈ సారి కూడా ఖరీప్ మార్కెట్ సీజన్ 2020-21 లో కనీస మద్దతు ధరల ప్రకారం... ఆయా పంటల్ని కేంద్ర ప్రభుత్వం రైతులదగ్గరనుంచి సేకరిస్తోంది.
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఛండీగడ్, జమ్ము కశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరిధాన్య సేకరణ ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతోంది. నవంబర్ 10 నాటికి 262.32 ఎల్ ఎంటి వరిధాన్యాన్ని సేకరించడం జరిగింది. ఇది గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే 20.80 శాతం అధికం. సేకరించిన 262.32 ఎల్ ఎంటి ధాన్యంలో ఒక్క పంజాబునుంచే 185.33 ఎల్ ఎం టి ధాన్యం సేకరించడం జరిగింది. ఇది మొత్తం సేకరణలో 70.65 శాతం.
ప్రస్తుతం కొనసాగుతున్న పంటల సేకరణద్వారా 22.21 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఇందుకోసం కనీస మద్దతు ధరల ప్రకారం రూ. 49, 527. 36 కోట్లు ఖర్చు చేశారు.
తమిళనాడు, కర్నాటక, మహరాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాలు చేసిన ప్రతిపాదనల ప్రకారం 45. 10 ఎల్ ఎంటి పప్పు ధాన్యాలు,నూనె విత్తనాలను ఈ ఖరీఫ్ మార్కెట్ సీజన్లో సేకరించడానికి గాను కేంద్ర ఆమోదం తెలిపింది. ధరల మద్దతు పథకం ( పిఎస్ ఎస్ ) కింద ఈ సేకరణ చేస్తారు. అంతే కాదు 1.23 ఎల్ ఎం టి కొబ్బరిని ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలనుంచి సేకరించడానికిగాను కేంద్రం అనుమతినిచ్చింది. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో ప్రతిపాదనలు అందగానే అక్కడ కూడా పప్పుధాన్యాలు, నూనె గింజలు, కొబ్బరి పంటల్ని పిఎస్ ఎస్ కింద సేకరిస్తారు. పేర్లు నమోదు చేసుకున్న రైతుల దగ్గరనుంచి నేరుగా 2020-21 సంవత్సరానికిగాను కొనుగోలు చేస్తారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకన్నా తక్కువ ధర పలికే పంటల విషయంలో కూడా ఆయా రాష్ట్రాలు ఎంపిక చేసిన సేకరణ సంస్థల ద్వారా కేంద్ర సేకరణ సంస్థలు ఈ కొనుగోలు చేస్తాయి.
ఈ నెల 10వ తేదీ నాటికి ప్రభుత్వ సేకరణ సంస్థలు 50055.63 ఎంటి పెసలు, మినుములు పల్లీ, సోయాబీన్ పంటల్ని తమిళనాడు, మహారాష్ట్ర, ఉగజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో సేకరించడం జరిగింది.
అదే విధంగా ఈ నెల 10 నాటికి కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 5089 ఎంటి కొబ్బరిని సేకరించడం జరిగింది. ఈ విషయంలో ఇదే సమయానికి గత ఏడాదిలో 293.34 ఎంటి కొబ్బరి సేకరించడం జరిగింది.
పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో విత్తన పత్తి సేకరణ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీనాటికి 1237172 పత్తి బేళ్లను సేకరించారు. వీటి విలువ రూ. 3514. 88 కోట్లు. తద్వారా 241833 మంది రైతులు లబ్ధి పొందారు.
****
(Release ID: 1672175)