రక్షణ మంత్రిత్వ శాఖ
మిషన్ సాగర్-IIలో భాగంగా ఐఎన్ఎస్ ఐరావత్ ద్వారా దక్షిణ సూడాన్‌కు ఆహార సాయం
Posted On:
20 NOV 2020 6:29PM by PIB Hyderabad
మానవతా దృక్ఫథంతో సాగుతోన్న మిషన్ ‘సాగర్ -II’ కొనసాగింపుగా, భారత నావికా దళ నౌక ‘ఐరవత్’ ఈనెల 20వ తేదీని కెన్యాలోని పోర్ట్ ఆఫ్ మొంబాసా చేరింది. ప్రకృతి వైపరీత్యాలు, కోవిడ్ మహమ్మారి వంటి వాటి వల్ల కలుగుతున్న అవరోధాలను అధిగమించడానికి వీలుగా భారత్ తన స్నేహ పూర్వక దేశాలకు
సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ఐఎన్ఎస్ ఐరవత్ నౌక దక్షిణ సూడాన్ ప్రజలకు ఆహార సాయన్ని అందిస్తోంది. ప్రధాన మంత్రి దృష్టి కోణం ‘సాగర్’
(ప్రాంతంలోని అందరికీ భద్రత మరియు వృద్ధి) కార్యక్రమం అనుసంధానంగా
మిషన్ సాగర్- II ముందుకు సాగుతోంది. హిందూ మహా సముద్ర ప్రాంతంలో (ఐఓఆర్) విశ్వసనీయ భాగస్వామిగా భారత స్థానాన్ని పునరుద్ఘాటిస్తుంది. ఈ ప్రాంతంలో భారత నావికా దళం సూత్రప్రాయ సముద్ర సంస్థగాను, సముద్ర డొమైన్ విభాగంలో మొట్టమొదటి ప్రతిస్పందన సంస్థగానూ నిలుస్తూ వస్తోంది.
దక్షిణ సూడాన్‌లో సంబంధాలకు భారతదేశం ఇచ్చిన ప్రాముఖ్యతను కూడా ఈ మిషన్ వెలుగులొకి తెస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని ఇది మరింత బలపరుస్తుంది. భారత్ మరియు ఆఫ్రికాలోని దేశాల మధ్య స్నేహం మరియు సోదర సంబంధాల యొక్క బలమైన బంధాలు అనేక శతాబ్దాలుగా బలోపేతం చేయబడ్డాయి. భారతదేశం ఎల్లప్పుడూ ఆఫ్రికాలోని దేశాలు మరియు అక్కడి ప్రజలతో సంఘీభావంగా ఉంది. అభివృద్ధి, సామర్థ్యం పెంపు మరియు మానవతా సహాయ కార్యక్రమాలను చేపట్టడంలోనూ భాగస్వామ్యం కలిగి ఉంది. భారత నావికాదళం రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు, భారత ప్రభుత్వంలోని ఇతర ఏజెన్సీలతో సన్నిహిత సమన్వయంతో ఈ మిషన్‌ను చేపడుతూ వస్తోంది.
***
(Release ID: 1674581)