ఆయుష్
జాతీయ ఔషధమొక్కల బోర్డు నెలకొల్పి రెండు దశాబ్దాలు అయిన సందర్భంగా జరిగిన ఈ - ఈవెంట్‌కు అధ్యక్షత వహించిన కేంద్ర ఆయుష్‌శాఖ సహాయమంత్రి (ఇంఛార్జ్) శ్రీపాద యశో నాయక్
Posted On:
25 NOV 2020 6:31PM by PIB Hyderabad
జాతీయ ఔషధమొక్కల బోర్డు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నవంబర్ 24,2020న జరిగిన ఈ -ఈవెంట్ కార్యక్రమానిఇక కేంద్ర ఆయుష్ శాఖ సహాయమంత్రి శ్రీశ్రీపాద యశోనాయక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎన్.ఎం.పి.బి 2020 స్థాయీ నివేదికను, అలాగే ఆయుర్ వెజ్ ఈ బుక్‌ను మంత్రి విడుదల చేశారు.
ఆయుష్ శాఖ మంత్రి, ఆయుష్ విభాగం కార్యదర్ధి రాజేష్‌కొటెచా, బోర్డు కు చెందిన ఇతర సభ్యులు ఎన్.ఎం.పి.బి ప్రగతిని, అది సాధించిన విజయాలను , దేశంలో ఔషధ మొక్కల అభివృద్ధి , ప్రగతికి సంస్థ చేసిన కృషిని అభినందించారు.
ఇటీవలి కాలంలో ఔషధమొక్కల సాగు ఊపు అందుకుంది. అయితే చాలా వరకు మన అవసరాలను ఇంకా అటవీ ప్రాంతం నుంచే సమకూరుతున్నాయి. ఔషధమొక్కలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఎన్.ఎం.పి.బి ఔషధ మొక్కలను వాటి సహజ వాతావరణంలో పరిరక్షించడం , ఇతర ప్రాంతాలలో వాటిని పెంచడం వంటి చర్యలను ముమ్మరంగా చేపడుతున్నది. స్థానిక ఔషధ మొక్కలను ప్రోత్సహించడం, ఔషధగుణాలు కలిగిన సుగంధ,పరిమళ రకాలను ప్రోత్సహించడం జరుగుతోంది. ఎన్.ఎం.పిబి పరిశోధన, అభివృద్ధి ప్రోత్సహిస్తూ, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేయడం ద్వారా , ప్రమోషనల్‌కార్యకలాపాల ద్వారా ఇళ్లల్లో, పాఠశాలల్లో, మూలికా తోటల ప్రోత్సాహానికి కృషి చేస్తున్నది.
ఎన్.ఎం.పి.బి ప్రధాన లక్ష్యం ఔషధ మొక్కల రంగాన్ని అభివృద్ధి చేయడం. ఇందుకు రైతులు, వ్యాపారులు, తయారీ దారులు అందరికీ ప్రయోజనం కలిగించే విధంగాఈ రంగాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం.ఈ ప్రయత్నం రైతులు, గిరిజనుల జీవనోపాధిని పెంచుతుంది. ఇది పరిశ్రమలు, తయారీదారులతో సాగు అనంతర విధానాలద్వారా తగిన అనుసంధానతను కల్పిస్తుంది. కొత్త ఐటి ఉపకరణాలు ఉపయోగించడం, మార్కెట్ అనుసంధాన కార్యకలాపాలు రైతులు, పరిశ్రమకు ఎంతగానో ఉపయోగపడతాయి.
భారతదేశ వ్యవసాయ రంగ అభివృద్ధిలో ఔషధ మొక్కల సాగు ప్రాధాన్యతను ఈ వ్యవస్థాపకదినోత్సవం నాడు ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. ఆరోగ్యవంతమైన సమాజానికి ఔషధ మొక్కలు కీలకం, ఇది ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికీ ఉపయోగపడుతుంది. అలాగే ఔషధమొక్కలకుగల విలువ జోడింపు వల్ల చిన్న రైతులనుంచి అందరికీ ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇది చాలా సందర్భాలలో నిర్లక్ష్యానికి గురౌతున్నది. దీనితో రైతులను ఈ దిశగా ప్రోత్సహించేందుకు ఎన్.ఎం.పిబి కృషి చేస్తున్నది. పెద్ద ఎత్తున ఔషధ మొక్కల సాగు కు రైతులకు ప్రేరణనిస్తున్నది. ఈ రంగంలోపెట్టుబడి దారులు, సాగు, ఉత్పత్తి, ఔషధాల తయారీ వంటి అంశాలను కూడా బోర్డు చూస్తుంది.
అంతర్జాతీయంగా ఔషధ మొక్కలకు పెరుగుతున్న డిమాండ్‌ను గమనించినపుడు, అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలలో ఔషధమొక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం , రైతుల రాబడి పెంచేందుకు ఔషధ మొక్కల సాగును ఒక ప్రత్యామ్నాయంగా ప్రోత్సహిస్తున్నది. ఈ దిశగా జాతీయ ఔషధ మొక్కల బోర్డు రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నది.
2000 సంవత్సరం నవంబర్ 24న ఆయుష్ విభాగం పర్యావరణం, అడవులు, డిపార్టమెంట్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసెర్చ్ , డిపార్టమెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ, డిపార్టమెంట్ ఆఫ్ అగ్రికల్చర్‌రిసెర్చి ,ఎడ్యుకేషన్‌తో కలసి నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు (ఎన్.ఎం.పి.బి) ఏర్పాటుకుచేతులు కలిపింది. ఈ బొర్డు ప్రస్తుతం ఆయుష్ మంత్రిత్వశాఖ లో అంతర్భాగంగా ఉంది. పైన పేర్కొన్న మంత్రిత్వశాఖలు, విభాగాలు తమ సలహాలు, మద్దతు నిస్తూ ఔషధ మొక్కల రంగం పురొగతికి తోడ్పడుతున్నాయి.
ఔషధ మొక్కల ఉత్పత్తికి సంబంధించి వాలంటరీ సర్టిఫికేషన్‌స్కీమ్ (విసిఎస్ఎంపిపి) అనేది ఎన్.ఎం.పి.బి సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఈ పథకం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మద్దతుతో రూపొందించబడినది. ఇది ఔషధ మొక్కల సాగుకు, నాణ్యతాప్రమాణాలను పాటించడానికి సంబంధించి ఉత్తమ విధానాలను ప్రోత్సహిస్తుంది. ఈ సర్టిఫికేషన్ పలురకాలుగా ఉంటుంది. ఇది సులభతర మార్కెటింగ్, ఔషధ మొక్కల ఉత్పత్తుల ఎగుమతులకు ఉపయోగపడుతుంది.
ఎన్.ఎం.పి.బి దేశవ్యాప్తంగా వేలాది మంది రైతులకు ఔషధ మొక్కల సాగుపై అవగాహన కల్పించింది. ఈ సంస్థ ఎగ్జిబిషన్లు, ప్రదర్శనలు, ప్రత్యేక ప్రచారాలు చేపడుతోంది. అలాగే వివిధ వ్యాపార అభివృద్ధి కార్యకలాపాలకు మద్దతునిస్తుంది. ఇందులో డిజిటల్ సొల్యూషన్స్ అయిన ఈ -హెర్బ్స్ ( జియో ట్యాగింగ్ కోసం, క్షేత్రస్థాయి సమాచార సేకరణ కోసం), ఈ-చరక్ మొబైల్ యాప్ (మార్కెట్ సమాచారం కోసం) ఉన్నాయి. ఎన్.ఎం.పి.బి రైతులకు సంబందించి వివిధ ప్రాజెక్టులను చేపట్టింది. అవి సుస్థిర పంట కోత, అంతర్ పంటలు, సాగు అనంతర నిర్వహణ వంటి వి ఉన్నాయి. ఎగుమతులకు ప్రోత్సాహం మరో ముఖ్యమైన అంశం. ఈ దిశగా ఈ సంస్థ చెప్పుకోదగిన చర్యలు చేపట్టింది.
ఎన్.ఎం.పి.బి రైతులు, ట్రేడర్లను ప్రాంతీయంగా, రాష్ట్రస్థాయి నెట్‌వర్కులద్వారా చేరుకుంటుంది. ప్రతి రాష్ట్రం రాష్ట్ర ఔషధ మొక్కల బోర్డు (ఎస్ఎంపిబి) కలిగి ఉంది. దీనికి తోడు ఏడు ప్రాంతీయ ,ఫెసిలిటేషన్ కేంద్రాలు (ఆర్‌సిఎఫ్‌సిలు) ఉన్నాయి. ఇవి ఎస్.ఎం.పి.బి లు, ఎన్.ఎంపిబి లమధ్య సమన్వయానికి ఉపయోగపడతాయి.
ఎన్.ఎం.పి.బి రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహించాలని, వివిధ ప్రోత్సాహక, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది.
******
(Release ID: 1676003)