వ్యవసాయ మంత్రిత్వ శాఖ
న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో రైతు సంఘం ప్రతినిధులతో స్నేహపూర్వక మరియు స్పష్టమైన వాతావరణంలో చర్చలు జరిగాయి
రైతులతో చర్చలు తిరిగి డిసెంబర్ 5వ తేదీన కొనసాగుతాయి - శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
Posted On:
03 DEC 2020 9:57PM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆహ్వానం మేరకు 40 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు ఈ రోజు విజ్ఞాన్ భవన్ లో పలువురు కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో - కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్; ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ, రైల్వేలు, వాణిజ్య శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయెల్; మరియు వాణిజ్య శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్; వ్యవసాయం, ఆహారం. వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. నాల్గవ సారి జరిగిన ఈ చర్చలు, స్నేహపూర్వక మరియు స్పష్టమైన వాతావరణంలో జరిగాయి. డిసెంబర్ 5 న జరిగే తదుపరి సమావేశంలో మరింత విస్తృతంగా చర్చించడానికి రైతు సంఘాలు అంగీకరించాయి.

చర్చల ప్రారంభంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ, రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. తమ అభిప్రాయాలను తెలియజేయాలనీ, వివాదాస్పదంగా భావించిన సమస్యలను ఎత్తి చూపాలనీ ఆయన రైతు సంఘాల ప్రతినిధులను కోరారు. రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, మూడు చట్టాల రాజ్యాంగ ప్రామాణికత గురించి ప్రశ్నించారు. ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఏ రాజ్యాంగ నిబంధనల ప్రకారం రూపొందించిందీ, ప్రభుత్వం తరఫున వారికి వివరించారు. రైతులు ఎ.పి.ఎం.సి. లకు సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తూ, ఎ.పి.ఎం.సి. లు మరియు ప్రైవేట్ మార్కెట్లు మరియు ట్రేడ్ యార్డుల మధ్య ఒక స్థాయి అవగాహన ఉందని వారు చెప్పారు. ఎ.పి.ఎం.సి. ల వెలుపల వాణిజ్యాన్ని సరైన పద్దతిలో నమోదు చేయవలసిన అవసరం ఉందని వారు చెప్పారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టంలో రైతుల భూములను రక్షించే అంశాన్ని కూడా వారు ప్రశ్నించారు. ఎం.ఎస్.పి. వ్యవస్థను చట్టబద్ధం చేయాలని రైతు సంఘాలు కూడా కోరాయి. కొత్త వ్యవసాయ చట్టాలలో వివాద పరిష్కార వ్యవస్థ గురించి యూనియన్లు మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థ అవసరం ఉందని చెప్పాయి. కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని నమోదు చేయవలసిన అవసరాన్ని కూడా వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ అగర్వాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యవసాయ చట్టాల గురించి, రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ తీసుకున్న ప్రత్యేక చర్యల గురించి, అదేవిధంగా, సరఫరా వ్యవస్థ చురుకుగా ఉంచడం కోసం లాక్ డౌన్ సమయంలో తీసుకున్న వ్యవసాయానికి ప్రయోజనం చేకూర్చే వివిధ చర్యల గురించీ, సవివరంగా తెలియజేశారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ వ్యవసాయ చట్టాలను రూపొందించినట్లు, ఆయన చెప్పారు.
వ్యవసాయ మంత్రి శ్రీ తోమర్ మాట్లాడుతూ, కనీస మద్దతు ధర అలాగే ఉంటుందనీ, అందువల్ల అది పోతుందని రైతులు భయపడకూడదనీ, రైతు సంఘాలకు హామీ ఇచ్చారు. తమ సమస్యలను తెలియజేసినందుకు, రైతు సంస్థలకు కృతజ్ఞతలు ఆయన తెలియజేశారు. ఈ చర్చలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు.
*****
(Release ID: 1678179)