ఆర్థిక మంత్రిత్వ శాఖ

భారతదేశానికి, లగ్జెంబర్గ్ కు మధ్య ద్వైపాక్షిక అవగాహన పూర్వకఒప్పందపత్రం పై సంతకాలు చేసేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ఇండియా (ఎస్ఇబిఐ) చేసిన ప్రతిపాదన కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి


Posted On: 09 DEC 2020 3:51PM by PIB Hyderabad

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ఇబిఐ.. ‘సెబి’) కి, లగ్జెంబర్గ్ కు చెందిన ఫైనాన్సియల్ అండ్ కమీషన్ డి సర్వేలన్స్ డు సెక్టర్ ఫైనాన్షియర్ (సిఎస్ఎస్ఎఫ్) కు మధ్య ఒక ద్వైపాక్షిక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకం చేయడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తన ఆమోదాన్ని తెలిపింది.

ఉద్దేశాలు:

ఈ ఎమ్ఒయు సెక్యూరిటీస్ తాలూకు నియమ నిబంధనల రంగం లో రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి, పరస్పర సహాయానికి మార్గాన్ని సుగమం చేయడానికి, సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించడానికి సంబంధించి పర్యవేక్షక విధులను సమర్థంగా నిర్వహించడానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నారు. భారతదేశం, లగ్జెంబర్గ్ ల రంగంలో సీమాంతర సహకారాన్ని బలోపేతం చేయడానికి, పరస్పర సహాయానికి మార్గాన్ని సుగమం చసెక్యూరిటీస్ మార్కెట్లను నియంత్రించే చట్టాల, నియమనిబంధనల ప్రభావశీల అమలు కు కూడా ఈ ఎమ్ఒయు దొహదపడుతుందని భావిస్తున్నారు.

ప్రధాన ప్రభావం:

సెబీ మాదిరిగానే సిఎస్ఎస్ఎఫ్ కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమీషన్స్ మల్టిలేటరల్ ఎమ్ఒయు (ఐఒఎస్ సిఒ ఎమ్ఎమ్ఒయు) లో సహసంతకందారు గా ఉంది. అయితే, సాంకేతిక సహాయం తాలూకు నిబంధన ఏదీ ఐఒఎస్ సిఒ ఎమ్ఎమ్ఒయు పరిధి లో లేదు. ప్రతిపాదిత ద్వైపాక్షిక ఎమ్ఒయు సెక్యూరిటీస్ చట్టాల ప్రభావశీలమైన అమలుకు తోడ్పడే సమాచారాన్ని పంచుకొనే ఒక ప్రేమ్‌ వర్క్ ను బలోపేతం చేసుకొనేందుకు దోహద పడడమే కాకుండా సాంకేతిక సహాయ కార్యక్రమాన్ని అమలుపర్చడంలో కూడా సహాయపడుతుంది. సాంకేతిక సహాయ కార్యక్రమం, క్యాపిటల్ మార్కెట్లు, అధికారుల సామర్థ్యం పెంపుదల కార్యకలాపాలకు, అలాగే శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలలో సంప్రదింపుల మాధ్యమం ద్వారా ప్రాధికరణ సంస్థలకు ప్రయోజనాన్ని చేకూర్చుతుంది.

***

 


(Release ID: 1679442)