ప్రధాన మంత్రి కార్యాలయం

ఈనెల 22న ఏఎంయూ శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించనున్న ప్రధాని


Posted On: 20 DEC 2020 12:24PM by PIB Hyderabad

ఈ నెల 22వ తేదీన జరగనున్న అలీఘర్‌ ముస్లి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. 22న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగం ఉంటుంది. శతాబ్ది వేడుకలకు గుర్తుగా తపాలా స్టాంపును కూడా ఆవిష్కరించనున్నారు. విశ్వవిద్యాలయం కులపతి శ్రీ సైద్నా ముఫద్దల్‌ సైఫుద్దీన్‌, కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఏఎంయూ గురించి:

1920లో, మొహమ్మదాన్ ఆంగ్లో ఓరియంటల్ (ఎంఏవో) కళాశాలను కేంద్ర విశ్వవిద్యాలయం హోదాకు పెంచడం ద్వారా, పార్లమెంటు చట్టంతో, ఏఎంయూ విశ్వవిద్యాలయంగా మారింది. ఎంఏవోను 1877లో శ్రీ సైయద్‌ అహ్మద్‌ ఖాన్‌ స్థాపించారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో, 467.6 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం వ్యాపించి ఉంది. కేరళలోని మలప్పురంలో, పశ్చిమ బంగాల్‌లోని ముర్షిదాబాద్‌-జంగిపూర్‌లో, బిహార్‌లోని కిషన్‌గంజ్‌లోనూ ఈ విద్యాలయ ప్రాంగణాలు ఉన్నాయి.

*****


(Release ID: 1682158)