ప్రధాన మంత్రి కార్యాలయం

మిజోరమ్ ముఖ్యమంత్రి తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి; అడవి లో మంటలు చెలరేగినందువల్ల ఏర్పడ్డ స్థితి ని గురించి అడిగి తెలుసుకొన్నారు


Posted On: 26 APR 2021 3:25PM by PIB Hyderabad

మిజోరమ్ ముఖ్యమంత్రి శ్రీ జోరామ్ థాంగా తో ఈ రోజున అంటే సోమవారం నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు; రాష్ట్రం లోని అటవీప్రాంతాల లో జ్వాల లు చెలరేగిన కారణం గా కొన్ని చోట్ల ఏర్పడ్డ స్థితి ని గురించి ప్రధాన మంత్రి వాకబు చేశారు.

‘‘ మిజోరమ్ ముఖ్యమంత్రి శ్రీ జోరామ్ థాంగా తో నేను మాట్లాడి, రాష్ట్రం లో  అటవీప్రాంతాల లో అగ్ని కారణంగా కొన్ని చోట్ల ఏర్పడ్డ స్థితి ని గురించి అడిగి తెలుసుకొన్నాను.  ఈ గండం నుంచి గట్టెక్కడం లో కేంద్రం వైపు నుంచి సాధ్యమైన అన్ని విధాలు గాను సాయపడుతాం అంటూ హామీ ని ఇచ్చాను.   మిజోరమ్ ప్రజల సురక్షత కోసం, మిజోరమ్ ప్రజల శ్రేయం కోసం మనం అందరమూ ప్రార్థిద్దాం’’ అని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***


(Release ID: 1714189)