సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"ఆజాదీ కా అమృత మహోత్సవ్"- మిలన్ 2022


प्रविष्टि तिथि: 26 FEB 2022 6:30PM by PIB Hyderabad

ముఖ్య అతిథి : గౌరవనీయులు గొలగాని హరి వెంకట కుమారి, విశాఖ నగర మేయర్.

విశాఖపట్నంలో నిర్వహిస్తున్న మిలన్ 2022  కార్యక్రమంలో పాల్గొంటున్న సాంస్కృతిక మంత్రిత్వ శాఖ.

'ఆజాదీ కా అమృత్ మహోత్సవం' కార్యక్రమంలో భాగంగా 2022 ఫిబ్రవరి 26 నుండి 28 వరకు 'ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్‌ అధ్వర్యంలో 'తూర్పు నావికాదళం,  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న మిలన్ 2022  రామకృష్ణ బీచ్ లో, ఇంకా మిలన్ విలేజ్, విశాఖపట్నంలోనూ సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పన జరిగింది. 

 

ముఖ్యఅతిథిగా విచ్చేసిన వైజాగ్ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు.

 

ప్రారంభోత్సవ సభలో డాక్టర్ ప్రియాంక మిశ్రా, డైరెక్టర్ IGNCA స్వాగత ప్రసంగం చేస్తూ, AKAM  ఇతివృత్తం, భూమిక, ఇంకా మిలన్ 2022లో నిర్వహించిన ఈ ప్రత్యేక జలరక్షణ సమారోహ ప్రాముఖ్యతను వివరించారు. గౌరవ అతిథిని శ్రీమతి ప్రియాంక చంద్ర , AKAM డైరెక్టర్, సాంస్కృతిక శాఖ గౌరవ అతిధిని ఈ సందర్భంగా సత్కరించారు. 

ఈ కార్యక్రమం విశేష ప్రాముఖ్యత కలిగినది, ఎందుకంటే

భారత నౌకాదళ విభాగాలతో పాటు సుమారు 140 విదేశీ ఉన్నత స్థాయి ప్రతినిధులు,  14 విదేశీ యుద్ధనౌకలు,   విదేశీ విమానాలు ఆయా దేశాల ప్రతినిధులు పాల్గొనే కార్యక్రమంలో వేలాదిమంది ఈ వేదిక వద్ద గాలిపటాల సంరంభాన్ని,  రంగోలీలను తిలకిస్తారు.  MILAN అనేది అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల కార్యక్రమం, ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఈ సంవత్సరం MILAN 2022 భూమిక/ థీమ్ “స్నేహం, సమన్వయం, సహకారం”. కార్యక్రమానికి  ఈ శీర్షిక విన్యాస  స్ఫూర్తికి అనువైన స్వరూపంగా శోభించింది. మిలాన్ 2022 కోసం 46 స్నేహపూర్వక దేశాలకు ఆహ్వానాలు పంపారు.

గౌరవనీయురాలు గొలగాని హరి వెంకట కుమారి ఆంధ్ర ప్రదేశ్  సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, సహకారం, ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ భారతదేశ  పరిణామంలో ఇంత దూరంవరకూ  ముందుకు రావడంలో కీలకపాత్ర పోషించిన భారతదేశ ప్రజల అంకితభావాన్ని తన ప్రారంభ ప్రసంగంలో వ్యక్తం చేశారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో ఉత్తేజితమైన  భారతదేశం 2.0 ని దర్శనం చేయాలనే ప్రధాని మోదీ ఆకాంక్షకు అనుగుణంగా సాకారం చేసే శక్తి , సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలని అన్నారు. AKAM ఆధ్వర్యంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తరపున పాల్గొనడానికి IGNCA ద్వారా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమ వివరాలు..

• గాలిపటాలు ఎగురవేయడం - 2022 ఫిబ్రవరి 26 మరియు 27 తేదీలలో మధ్యాహ్నం 3.00 నుండి 4.00 వరకు ప్రదేశం: RK బీచ్ బస్టాప్ వెనుక, గవ్వల దుకాణాల పక్కన, ఎన్టీఆర్ విగ్రహం వద్ద

• రంగోలి- 2022 ఫిబ్రవరి 26 నుండి 28 వరకు (పూర్తి రోజు)

RK బీచ్ బస్టాప్ వెనుక, గవ్వల దుకాణాల పక్కన, ఎన్టీఆర్ విగ్రహం వద్ద

• నగర కవాతులో పాల్గొనే సాంస్కృతిక బృందం- 26, 27 ఫిబ్రవరి 2022 18.40 PM రామకృష్ణ బీచ్‌లో.

•సాంస్కృతిక కార్యక్రమాలు - 2022 ఫిబ్రవరి 26 నుండి 28 వరకు, బీచ్ రోడ్, మిలన్ విలేజ్ వద్ద సాయంత్రం 7:30 గంటల నుండి

IGNCA నిర్వహణలో కూడా 2022 ఫిబ్రవరి 26 నుండి 28 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

వేదిక: RK బీచ్ బస్టాప్ వెనుక బీచ్ రోడ్డు వద్ద, గవ్వల షాపుల పక్కన, ల్యాండ్‌మార్క్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద

సాయంత్రం 7:30 గంటల నుండి, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యక్షంగా  విశాఖపట్నం నగర ప్రజలు ఆనందించవచ్చు. ఈ కార్యక్రమాలు  AKAM ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగానూ  ప్రసారం అవుతాయి.

 

****


(रिलीज़ आईडी: 1801507) आगंतुक पटल : 409
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil