వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సేంద్రియ వ్యవసాయం (గ్రీన్ ఫార్మింగ్) కోసం ప్రోత్సాహకాలు

నాడు పోస్టు చేయడమైనది: 15 MAR 2022 4:23PM by PIB Hyderabad

గంగా నది వెంబడి  సేంద్రియ మరియు సహజ వ్యవసాయం, రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం  పరంపరాగత్ కృషి వికాస్ యోజన మరియు భారతీయ ప్రకృతిక కృషి పద్ధతి ద్వారా ప్రోత్సాహకాలను అందిస్తోంది. 

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పికెవివై పథకం అమలు జరుగుతున్నది. ఈ పథకం కింద  రైతులకు విత్తనాలు, బయో-ఎరువులు, బయో-పెస్టిసైడ్‌లు, సేంద్రీయ ఎరువు, కంపోస్ట్/ వర్మీ కంపోస్ట్, వృక్షశాస్త్ర పదార్దాలు మొదలైన సేంద్రీయ ఇన్‌పుట్‌ల కోసం హెక్టారుకు 3 సంవత్సరాల పాటు   31000 రూపాయల  ఆర్థిక సహాయం అందించబడుతుంది.  దీనితోపాటు గ్రూప్/రైతు ఉత్పత్తిదారుల సంస్థ  (ఎఫ్ పీఓ)ల  ఏర్పాటు, శిక్షణ, ధృవీకరణ, విలువ జోడింపు మరియు వారి సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కూడా సహకారం అందించబడుతోంది. 6181 క్లస్టర్లు మరియు 123620 హెక్టార్ల  భూమికి నమామి గంగే కార్యక్రమం కింద  మొత్తం  120.49 కోట్ల రూపాయలు  నిధులు( ఆర్కేవివై   నుంచి  రూ. 67.36 కోట్లు &  పికెవివై   నుంచి రూ. 34.20 కోట్లు) విడుదల చేయడం జరిగింది. 

ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు, రసాయన ఎరువులు సమతుల్యంగా మరియు తెలివిగా ఉపయోగించడం వల్ల భూసారంపై  ఎటువంటి హానికరమైన ప్రభావం ఉండదు. అయితే, 'దీర్ఘకాలిక ఎరువుల ప్రయోగాలు'పై ఐదు దశాబ్దాలుగా గుర్తించిన  ప్రదేశాలలో ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద జరిగిన పరిశోధనలు నత్రజని తో కూడిన ఎరువుల నిరంతర/అధిక వినియోగం మాత్రమే భూసారం  మరియు పంటల దిగుబడిపై   హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని వెల్లడించాయి. సూక్ష్మ పోషకాల లోపం ఉందని కూడా పరిశోధనల్లో తేలింది. భూసారాన్ని  మెరుగుపరచడానికి రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులను (ఎరువులు, బయో-ఎరువులు మొదలైనవి)సరైన మోతాదులో కలిపి  ఉపయోగించడం ద్వారా పంటలకు సరైన  పోషకాలు అందింది భూసారాన్ని పరిరక్షించవచ్చునని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సూచించింది.  పప్పు ధాన్యాల పంటలు పండించడం మరియు వనరుల సంరక్షణ సాంకేతికతల ఉపయోగించాలని సూచించింది. అన్ని అంశాలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ రైతులకు అవగాహన కల్పించి, శిక్షణ ఇస్తున్నది. 

ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్‌మెంట్ (ఐఎన్ఎం)ని ప్రోత్సహిస్తోంది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు వ్యవసాయ యార్డ్ ఎరువు (ఎఫ్ వై ఎమ్ ), సిటీ కంపోస్టు, వర్మి-కంపోస్ట్ మరియు బయో-ఎరువుల వంటి సేంద్రియ వనరులతో కలిపి ఉపయోగించడం, భూసార పరీక్షల నిర్వహణ లాంటి అంశాలతో ఈ కార్యక్రమం సమగ్రంగా అమలు జరుగుతోంది. 

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఈ సమాచారం అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 1806565) సందర్శకుల సూచీ సంఖ్య : : 343
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Tamil