మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో లీగల్ సర్వీసెస్ క్లినిక్‌ని ప్రారంభించిన జాతీయ మహిళా కమిషన్
ఆపదలో ఉన్న మహిళలకు ఉచిత న్యాయ సహాయం కౌన్సెలింగ్ అందించడానికి క్లినిక్
Posted On:
29 MAR 2022 2:57PM by PIB Hyderabad
మహిళలకు న్యాయ సహాయం మరింత అందుబాటులోకి తీసుకు రావడానికి, జాతీయ మహిళా కమిషన్ (NCW) ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (DSLSA) సహకారంతో ఒక న్యాయ సహాయ కేంద్రాన్ని ప్రారంభించింది, మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించడం ద్వారా ఇది ఫిర్యాదులను పరిష్కరించడానికి సింగిల్ విండో సౌకర్యంగా పనిచేస్తుంది.

NCW ఇతర రాష్ట్రాల మహిళా కమీషన్లలో కూడా ఇలాంటి న్యాయ సేవల క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. న్యాయ సహాయ కేంద్రాన్ని న్యూఢిల్లీలోని కమిషన్ కార్యాలయం నుంచి పని చేస్తుంది. DSLSA ప్యానెల్‌లోని న్యాయ సేవల న్యాయవాదులు మహిళలకు సహాయం చేసే ఉచిత న్యాయ సలహా కౌన్సెలింగ్ సదుపాయాన్ని ఏ స్త్రీ అయినా పొందగలుగుతారు.


ఢిల్లీలోని కమిషన్ కార్యాలయంలో న్యాయ సహాయ క్లినిక్ ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది. చైర్‌పర్సన్ శ్రీమతి రేఖా శర్మ, అదనపు సెషన్స్ జడ్జి శ్రీ సుశాంత్ చంగోత్రా, డిఎస్‌ఎల్‌ఎస్‌ఎ అదనపు కార్యదర్శి శ్రీమతి నమితా అగర్వాల్, డిఎస్‌ఎల్‌ఎస్‌ఎ ప్రత్యేక కార్యదర్శి శ్రీ కన్వల్ జీత్ అరోరా, డిఎస్‌ఎల్‌ఎస్‌ఎ మెంబర్ సెక్రటరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సభను ఉద్దేశించి చైర్‌పర్సన్ శ్రీమతి రేఖా శర్మ మాట్లాడుతూ మహిళలకు ఉచిత సలహాలు న్యాయసేవలు అందించడమే న్యాయసహాయ కేంద్రం లక్ష్యమని అన్నారు. “ఈ రోజు మహిళలకు సహాయం చేయడానికి NCW నిరంతర ప్రయత్నాలలో కొత్త అధ్యాయానికి తెరతీసే రోజు. లీగల్ ఎయిడ్ క్లినిక్ మహిళల హక్కులను పరిరక్షించడంపై దృష్టి సారిస్తుంది, వారికి చట్టపరమైన కౌన్సెలింగ్ సహాయం కోసం ఒక-స్టాప్ సెంటర్‌ను అందిస్తుంది. మహిళలు ఇప్పుడు సహాయం కోరి అన్నివైపులా పరుగెత్తకుండా ఈ కేంద్రాన్ని సంప్రదిస్తే న్యాయ సహాయం పొందగలుగుతారు, ”అని ఆమె అన్నారు.
కొత్త లీగల్ ఎయిడ్ క్లినిక్ కింద, వాక్-ఇన్ ఫిర్యాదుదారులకు కౌన్సెలింగ్ అందిస్తారు, ఆపదలో ఉన్న మహిళలకు న్యాయ సహాయం అందుతుంది, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA)/ DSLSA వివిధ పథకాలపై సలహా సమాచారం, ‘మహిళా జన్ సున్న్వాయి’ లో సహాయం, ఉచిత చట్టపరమైన సహాయం, వివాహ సంబంధ కేసుల్లో విచారణలు కమిషన్‌లో నమోదైన ఇతర ఫిర్యాదులు ఇతర సేవలతో పాటు అందుతాయి.
****
(Release ID: 1811218)
Visitor Counter : 363