నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                    
                    
                        2022 ఏప్రిల్ 21వ తేదీన దేశవ్యాప్తంగా 700 కంటే ఎక్కువ ప్రదేశాలలో నిర్వహిస్తున్న నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా -2022
                    
                    
                         
                    
                
                
                    Posted On:
                19 APR 2022 3:18PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                స్కిల్ ఇండియా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (DGT)తో కలిసి, 21 ఏప్రిల్ 2022న దేశవ్యాప్తంగా 700 కంటే ఎక్కువ ప్రదేశాలలో ఒక రోజుపాటు ‘అప్రెంటిస్‌షిప్ మేళా’ను నిర్వహిస్తోంది.

ఈ ప్రయత్నం కింద, లక్ష మందికి పైగా శిక్షణార్థుల నియామకానికి మద్దతు ఇవ్వడం, సరైన ప్రతిభను వెలికితీయడంలో యజమాన్యానికి  సహాయం చేయడం, శిక్షణ, ఆచరణాత్మక నైపుణ్యాలను అందించడం ద్వారా దానిని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉంది.
శక్తి ఉత్పాదన, రిటైల్, టెలి కమ్యూనికేషన్స్ , సమాచార సాంకేతిక /IT ఆధారిత సేవలు,  ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ వంటి 30 కంటే ఎక్కువ రంగాలలో పనిచేస్తున్న దేశవ్యాప్తంగా 4000 కంటే ఎక్కువ సంస్థలు ఈ ఈవెంట్‌లో పాల్గొంటాయి. అదనంగా, ఔత్సాహిక యువత వెల్డర్, ఎలక్ట్రీషియన్, హౌస్‌కీపర్, బ్యూటీషియన్, మెకానిక్ మొదలైన వాటితో సహా 500+ కంటే ఎక్కువ రంగాలలో పాల్గొనడానికి, నచ్చిన రంగాన్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
జూలై 15, 2015న ప్రధానమంత్రి ప్రారంభించిన నేషనల్ పాలసీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, 2015, తగిన పరిహారంతో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తికి లాభదాయకమైన ఉపాధిని కల్పించే సాధనంగా అప్రెంటిస్‌షిప్‌ని గుర్తిస్తుంది.
నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకతల  మంత్రిత్వ శాఖ  కూడా దేశంలోని ఎంటర్‌ప్రైజెస్ ద్వారా అప్రెంటిస్‌ల సంఖ్యను పెంచడానికి అనేక ప్రయత్నాలు చేసింది. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి కోసం సరఫరా-డిమాండ్‌లో అంతరాన్ని పూరించడం, ఉద్యోగ శిక్షణ పొందడం, ఉపాధికి మెరుగైన అవకాశాలను పొందడం ద్వారా భారతీయ యువత ఆకాంక్షలను తీర్చడం దీని లక్ష్యం. కనీసం 5వ తరగతి పాసైన విద్యార్థులు, 12వ తరగతి పట్టభద్రులు, నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్ హోల్డర్లు, ఐటీఐ విద్యార్థులు, డిప్లొమా హోల్డర్లుగ్రాడ్యుయేట్లు అప్రెంటిస్‌షిప్ మేళాలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అభ్యర్థులు తప్పనిసరిగా వ్యక్తిగత సమాచారం మూడు కాపీలు, అన్ని మార్కు షీట్లుసర్టిఫికేట్‌ల  మూడు కాపీలు (5 నుండి 12వ తరగతి ఉత్తీర్ణత, స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికేట్, పట్టభద్రత కు సంబంధించిన (BA, BCom, BSc మొదలైనవి), ఫోటో గుర్తింపు  (ఆధార్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి.) సంబంధిత వేదికల వద్ద మూడు పాస్‌పోర్ట్ సైజు ఛాయాచిత్రాలు ఇవ్వాలి.
సంభావ్య దరఖాస్తుదారులు అప్రెంటిస్‌షిప్ మేళాకు హాజరు కావడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందుతారు. వారు అక్కడికక్కడే అప్రెంటిస్‌షిప్‌ను పొందేందుకు, నేరుగా పరిశ్రమ బహిర్గతం పొందడానికి భారీ అవకాశం ఉంది. తరువాత, వారు కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం నెలవారీ స్టైఫండ్ పొందుతారు, వారు నేర్చుకునేటప్పుడు సంపాదించడానికి అవకాశం ఉంటుంది.
 ఔత్సాహిక వృత్తి విద్య  అభ్యర్థులు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET)చే గుర్తింపు పొందిన సర్టిఫికేట్‌లను పొందుతారు, శిక్షణ తర్వాత వారి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అప్రెంటిస్‌షిప్ మేళాలలో పాల్గొనే సంస్థలు ఉమ్మడి ప్లాట్‌ఫారమ్‌లో సంభావ్య శిక్షణార్ధులను కలుసుకునే అవకాశాన్ని పొందుతాయి. అక్కడికక్కడే అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. అదనంగా, కనీసం నలుగురు పని చేసే సభ్యులతో కూడిన చిన్న తరహా పరిశ్రమలు కూడా ఈవెంట్‌లో అప్రెంటిస్‌లను తీసుకోవచ్చు.
 
****
                
                
                
                
                
                (Release ID: 1818312)
                Visitor Counter : 324
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam