పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ “ఉడాన్” పథకానికి ప్రజా పరిపాలన విభాగం అత్యుత్తమ పనితీరు కై లభించిన ప్రధాన మంత్రి అవార్డు


టైర్ II మరియు III నగరాల్లో విమానయాన మౌలిక సదుపాయాలు వాయుమార్గం అనుసంధానాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ‘ఉడాన్’.

Posted On: 20 APR 2022 5:41PM by PIB Hyderabad

పౌర విమాన యాన మంత్రిత్వ శాఖ (MoCA) ప్రతిష్టాత్మక ప్రాంతీయ అనుసంధాన పధకం  ‘ఉడాన్’ (Ude Desh ka AamNagrik) కి "ఇన్నోవేషన్ (జనరల్) - కేంద్ర" కేటగిరీ కింద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2020లో అత్యుత్తమంగా ప్రధానమంత్రి అవార్డు లభించింది.

MoCA కార్యదర్శి శ్రీ రాజీవ్ బన్సల్  భారత విమానాశ్రయ   అధికార సంస్థ చైర్మన్ శ్రీ సంజీవ్ కుమార్ సమక్షంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీమతి ఉషా పాధీ నేతృత్వంలోని ‘ఉడాన్’ బృందానికి పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ఈ అవార్డును అందజేశారు.

ప్రభుత్వ జిల్లాల సంస్థలు చేసిన అసాధారణమైన  వినూత్నమైన పనిని గుర్తించి, గుర్తించి,ప్రోత్సహించడానికి  భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రారంభించింది. ఈ పథకం కేవలం పరిమాణాత్మక లక్ష్యాల సాధనపై కాకుండా, సుపరిపాలన, గుణాత్మక విజయాలు చివరి మైలు అనుసంధానం పై దృష్టి పెడుతుంది.  అవార్డులో జ్ఞాపిక, స్క్రోల్ తోపాటు రూ. 10 లక్షల ప్రోత్సాహక నగదు ఉంటాయి.

2016లో ప్రారంభించిన, ‘ఉడాన్’ పథకం Ude Deshka Aam Nagrik  దార్శనికతను అనుసరించడం ద్వారా సామాన్య ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లక్ష్యంగా పెట్టుకుంది, ఇది టైర్ II మరియు III నగరాల్లో మెరుగైన విమానయాన మౌలిక సదుపాయాలు  విమాన అనుసంధానాన్ని కలిగి ఉంది. 5 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో, నేడు 419 ‘ఉడాన్’  మార్గాలు జలవిమానాశ్రయాలు  వాటర్ ఏరోడ్రోమ్‌లతో సహా 67 విమానాశ్రయాలను  కలుపుతున్నాయి , 92 లక్షల మందికి పైగా ప్రజలు దీని నుండి ప్రయోజనం పొందారు. ఈ పథకం కింద ఇప్పటివరకు  1 లక్ష 79 వేలకు పైగా విమానాలు ప్రయాణించాయి. ‘ఉడాన్’ పథకం కొండ ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతం దీవులతో సహా భారతదేశంలోని అనేక రంగాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చింది.

ఉడాన్ దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది  పరిశ్రమ భాగస్వాముల నుంచి ముఖ్యంగా ఎయిర్‌లైన్స్ ఆపరేటర్లు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అద్భుతమైన ప్రతిస్పందనను సాధించింది. 350 కంటే ఎక్కువ కొత్త నగరాలు  జంటలుగా  ఈ పథకం కింద ఇప్పుడు అనుసంధానించి ఉన్నాయి, 200 ఇప్పటికే వాయుమార్గాలు  భౌగోళికంగా విస్తృతంగా విస్తరించి ఉన్నాయి  దేశమంతటా రవాణా అనుసంధానాన్ని అందిస్తున్నాయి. అలాగే సమతుల్య ప్రాంతీయ వృద్ధిని నిర్ధారించడంతోపాటు ఆర్థిక వృద్ధి,   స్థానిక జనాభాకు  ఉపాధి కల్పిస్తుంది.

 

ఈ పథకం సిక్కింలోని గ్యాంగ్‌టక్ సమీపంలోని పాక్యోంగ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని తేజు, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు వంటి కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధికి దారితీసింది. ఈ పథకం నాన్-మెట్రో విమానాశ్రయాలలో దేశీయ ప్రయాణీకుల వాటాలో 5% పెరుగుదలకు దారితీసింది.

2026 నాటికి ‘ఉడాన్’ RCS పథకం కింద భారతదేశంలో 1,000 కొత్త మార్గాలతో 2024 నాటికి 100 కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రణాళికలు వేసి, వాటి అమలుకు  కట్టుబడి ఉంది.

ఇటీవల, పౌర విమానయాన శాఖ   2022 రిపబ్లిక్ డే కోసం ఉత్తమ కేంద్ర మంత్రిత్వ శాఖ  గా ఎంపికైంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ - ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్ (RCS) – ‘ఉడాన్’ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ) ని దాని కేంద్ర ఇతివృత్తంగా ప్రదర్శించింది.


****


(Release ID: 1818651)